లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఇదిగో నీ కుమారుడు

కీ.శే. యన్‌. దానియేలు గారు

యోహాను 19:25-27 వరకు

ఇక్కడ క్రీస్తు మరణం వరకూ బాధపడుతూ ఉండగా ఒకడు ఒక రకమైన దృశ్యంలో ఇంటి వాతావరణలో నుండే మాధుర్యమును ఆయన తీసుకువస్తున్నాడు. ఆయన తల్లితో జీవించిన దినములలో తను ఎదిగిన గృహమును మరచిపోలేక పోయాడు. ఇప్పుడది క్రీస్తుకు బాధను, విశ్వాసపు పరీక్షను తెచ్చేటటు వంటి అసాధారణ పరీక్షగా మారింది. కానీ క్రీస్తు మనస్సు కలత లేకుండా ఉండింది. మిల్టన్‌గారు మనస్సు గూర్చి ఇలా చెప్పారు అది' ''నరకమును పరలోకముగాను, పరలోకమును నరకముగానూ చేయునది'' అని చెప్పారు, క్రీస్తు నరకం యొక్క బాధలో ఉండినాడు కానీ ఆయన తండ్రితో ఉండినాడు. త్వరలోనే ఆయన తండ్రి సన్నిధిని పోగొట్టుకోబోతున్నాడు. నిరాశాయుక్తమైనటువంటి ఒక కేక వేస్తాడు. ''ఎలోయీ, ఎలోయీ లాయా సబక్తాని'' నాదేవా, ''నాదేవా'' నన్నెందుకు చేయి విడిచితివి'' అని.

నీవు ఒక గృహములో గృహము యొక్క మాధుర్యమును, ఐకమత్యమును పాడుచేసి ఆ గృహస్తుల యొక్క గృహమును బహు దుర్భరమైన స్థితికి తేవచ్చును. లేదా వారిని చాలా సంతోషపరచవచ్చును. కౄరులైన ప్రజలు ఉండే స్థలములో చాలా బాధకలిగించే వారు ఉండగా ఆయన తల్లివైపుకు చూస్తున్నాడు. ఆయన తల్లిని ప్రేమించాడు. ఆయన చనిపోవటం ఎందుకు? ఆయన ఎల్లప్పుడూ ఎందుకు జీవించలేకపోయాడు. తన తల్లికొరకు ఒక గృహమును సృజించి ఆమెను అందులో సౌఖ్యముగా ఎందుకు ఉంచలేక పోయాడు. కొంతమంది మిషనరీలు దేవుని పిలుపును వినకుండా తమ తల్లి మీద వారికున్న అనుబంధం వల్ల పాశ్చాత్య దేశములో వారు దేవుని సేవించడానికి ఆపుచేయబడ్డారు. కానీ కొందరైతే ఆ బంధములను జయించి ముందుకు సాగారు. క్రీస్తు మరణిస్తేనే తనతల్లి ఆయనతో పరలోకములో ఉంటుంది. క్రీస్తుకు జననము కలిగించుట ద్వారా ఆమె రక్షించబడబోదుగానీ ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా మట్టుకే, క్రీస్తు తన తల్లి కొరకు మట్టుకే కాక మానవాళి అంతట కొరకు మరణించుచున్నాడు. తన తల్లి వలే సమస్తమైన తల్లులన్న ఆయన ప్రేమించాడు. ఆయన తిరిగి లేచినప్పుడు భూమి మీద నడిచినటువంటి సామాన్యుడైన క్రీస్తువలే ఉండడు. ఆయన అనంతమైన శక్తిగా ఉంటాడు. దాని ద్వారా అనేకమంది తల్లులను వారిబిడ్డల నిమిత్తము దైవదృష్టి గలవారిగా ఆశీర్వాదిస్తాడు. దేవుని వాక్యమందు విశ్వాసముంచే వారు ఎన్నటికీ చంపబడడు అనే సత్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఒకసారి పునరుద్ధాన జీవితము మానవులలోనికి వచ్చిన తర్వాత అతను నిత్యము నిలిచేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఒకడు సత్యమును నమ్మి తన శరీరమునందు ఉన్న ప్రతి అణువులోనూ జీవించేవానిని ఎన్నడూ చంపలేము. సైఫను రక్తములో నుండి ఆయనకంటే బలవంతుడైన వాడు లేచాడు. హింసించే ఖడ్గము ఒక క్రైస్తవుని మీదకు వచ్చినప్పుడు ఆత్మ ఖడ్గము మరి గొప్ప శక్తితో వెళతాడు. అనేక సార్లు గృహముల యొక్క ప్రేమ - తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, మనలను క్రిందికి లాగివేస్తాయి. వారు నిన్ను నీ సేవలో బహు చిన్న ప్రాంతానికి కట్టివేస్తారు. దేవునికైతే నీకొరకు విస్తారమైన పొలములు ఉన్నాయి. ఒక గృహము యొక్క ప్రేమ సౌందర్యము, క్రమశిక్షణను ఎల్లప్పుడూ కాపాడబడవలెను. నీవు గృహమును ఆధీనములో పెట్టుకోవలెను. గృహము నిన్ను ఆధీనములో పెట్టుకోకూడదు. నీవు దేవుని కొరకు సృజించబడ్డావు. నీ గృహము నిన్ను ఎంతగా క్రిందికి లాగి వేస్తుందో నీవు ఎరుగవు. నీ గృహము కొరకు ప్రార్థన చేయి. క్రీస్తు సిలువమీద సహితము తన విధిని గూర్చి గమనిస్తున్నాడు, కానీ దేవుని చిత్తమును మొట్టమొదటగా పెట్టి మరణిస్తూ ఉన్నాడు.

నీ తండ్రిని, నీ తల్లిని ప్రేమించు, కానీ దేవునిని ఇంకా ఎక్కువగా ప్రేమించు. దేవుని చిత్తమును ఇంకా ఎక్కువగా ప్రేమియ-ఆయన ఉద్దేశములను ఇంకా ఎక్కువగా ప్రేమించు. నీవు పరలోకమందున్న నీ తండ్రి చిత్తమును నెరవేర్చునప్పుడు నీవు నీ గృహమునకు గొప్ప ఆశీర్వాదముగా మారతావు. ఆయన మరణిస్తున్నప్పుడు కూడా తల్లి యెడల ఆయనకున్నటువంటి విధిని మరిచిపోలేదు. ఆయన నిరాశచెందటం లేదుకూడా. పాపముపైగొప్ప విజయాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన మరణం ద్వారా అది మనుష్యులకు సాధ్యమవుతుంది. క్రీస్తు దేవుని యెడల ఆయనకు ఉండిన విధిని, తన గృహము యెడల ఆయనకు ఉండిన విధిని ఆయన పొందిక పరుస్తున్నాడు. మరణపు ముల్లును తీసివేయడం ద్వారా మరణములో మాధుర్యము ఉన్నది. సమాధి యొక్క విజయమును అంతం చేస్తున్నాడు.

మూల ప్రసంగాలు