లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఆయన యందు విశ్వాసముంచువాడెన్నడునూ సిగ్గుపడడు

కీ.శే. యన్‌. దానియేలు గారు

రోమా 10:1-11

''ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడు.'' మోషేను ప్రవక్తలను వారి మనస్సు ద్వారా దేవుని వాక్యమును పంపించిరి. మానవుడు తన మానసిక శక్తుల ద్వారా ఒక విధమైన నీతిని పొందగలడు. కానీ అది చచ్చిన నీతి. సువార్త యేసుక్రీస్తు అనెడి పరిపూర్ణమైన పంపేవాని ద్వారా వచ్చింది. ఈ సువార్త మొట్ట మొదటగా హృదయానికి అన్వయించేదే గాని మనస్సునకు కాదు. మనస్సులో మట్టుకే ఈ సువార్త ప్రవేశిస్తే మనుష్యులలోనికి ఒక రకమైన స్వయంతృప్తి వస్తుంది. మనము మోషే ధర్మశాస్త్రమునకు విధేయులము అయినప్పటికీ మనము ఒక ఆశీర్వాదము సంపాదించుకుంటాము. కానీ అది మారుమనస్సు కాదు. 9వచనం.'' నీవు యేసు ప్రభువని నీనోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు.'' నీ హృదయము సువార్త నిమిత్తము సృజించబడింది, సువార్త దానికి అందినప్పుడే హృదయము తృప్తిపొందును. క్రీస్తు యొక్క మరణము నీ పాపము వలన కలిగినది. అని నీవు నమ్మినట్లయితే అది సరిపోతుంది. ఒక తల్లి యొక్క క్రియ బిడ్డను మరణమునకు నడిపించినట్లయితే ఆమె జీవితాంతము వరకు ఏడుస్తూ ఉంటుంది. నీ పాపము క్రీస్తు మరణము కావించింది. ఇది నీ హృదయమందు ప్రవేశించిందా! ఇది అది చేయమని చెప్పుడమే సువార్తని చాలామంది అనుకుంటారు. లేదు. అది మోషే ధర్మ శాస్త్రం. ఈ ధర్మ శాస్త్రము ఎన్నటికిని ప్రేమను కలిగించదు. ప్రేమహీనమైన దానిని ప్రేమించినప్పుడే ఒక క్రైస్తవుడు నిజముగా విడుదల పొందియున్నాడు. క్రీస్తు నీ కొరకు మరణించింది ఎందుకంటే ఆ ప్రేమ మెట్టుకు నిన్ను పైకి లేపడానికే, దేవుడు క్రిందికి దిగి వచ్చి నీవలే అయి ధర్మశాస్త్రమును నెరవేర్చవలసి వచ్చింది. క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చినప్పుడు అక్కడతో ధర్మశాస్త్రము అంతయు అయి కృపాసువార్త ప్రారంభము అయింది.

క్రీస్తు ప్రేమ, జీవము అనే ఊటను నీ తలలో పెడతాడు. అప్పుడు అది నోటిద్వారా బయటకు వస్తుంది. తెలివితేటలు గల వారు వారి మనస్సును, వారినోటి ద్వారా మాట్లాడవచ్చును గానీ దాని ఫలితమేమీ ఉండదు. నీవు గొప్ప పాపివని దాని ద్వారా క్రీస్తుకు మరణమును కలిగించినావని గ్రహించినట్లయితే ఒక క్రొత్త జీవము ప్రారంభమవుతుంది. ఇది హృదయముతో విశ్వసించినప్పుడు నీతి తనంతట అదే ఉపొంగుతుంది. క్రీస్తు మరణమునుండి తిరిగి లేచినప్పుడు నిన్ను పైకి లేపగల్గిన శక్తిని విడుదల చేసాడు. నీవు హృదయముతో విశ్వసించినప్పుడు క్రీస్తు పునరుథ్ధానము నీలోనికి వస్తుంది. అప్పుడు నీవు లేపబడతావు. నీ స్వభావము పరిశుద్ధుల స్వభావం అవుతుంది. నీవు పైపైకి లేపబడతావు నీవు విశ్వసిస్తావు అప్పుడు హృదయము యొక్క విశ్వాసము నీతిగా మారుతుంది.

ఇది విశ్వాసపు నీతి ఫిలిప్పీ 3:9 ''క్రీస్తును సంపాదించుకొని ధర్మ శాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును...''

నీవు పశ్చాత్తాప పడినప్పుడు నీవు నీ పాపముల నిమిత్తము దు:ఖపడతావు. నీయందున్న దేవుని ఆత్మ దు:ఖపడతాడు. నీవు మాట్లాడినప్పుడు నీ మాటల ద్వారా నీ హృదయములో నుండి వెలుపలికి వచ్చునటువంటి ఆశుధారగా వచ్చు సువార్త ఇతరులు కూడా ఏడ్చునట్లు చేస్తుంది. ఈ రోజు ప్రాంతములో మిషనరీలను తోలివేశారు. మధ్యరాత్రియందు కూటములు ఏర్పాటు చేయబడిన ప్రోగ్రాం. సువార్త ఇవ్వబడినప్పుడు ఆ నేలంతా కన్నీటితో ఎంత తడిగా ఉండిందంటే నేను నడుస్తూ జారిపోయాను. | కొరింధి 14:25 ''అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. అందువలన దేవుడు నిజముగా ఉన్నాడని ప్రచురము చేయుచూ అతడు సాగిలపడి నమస్కారము చేయును.'' ఒక మనుష్యుడు మారు మనస్సు పొంది బోధించుచున్నప్పుడు తనలో దాచబడిన రహస్యములన్నీ బయటకు తేబడతాయి. నీ యొద్దకు వచ్చి వినువారందరు దేవుడు నీలో ఉన్నాడని వెంటనే తెలుసుకుంటారు. హృయము చాలా లోతైనది. పశ్చాత్తాపములో దాని త్రవ్వి ఎత్తినట్లయితే హృదయము పరిశుద్ధాత్మ నివశించే స్థలమవును. నీ పాపములన్నీ సంపూర్తిగా త్రవ్వి ఎత్తబడినప్పుడు నీ శరీరము క్రొత్తదవుతుంది. శరీరములో పాడైపోయిన స్థలములన్నీ క్రొత్తవి అవుతాయి. యోహాను 16:13 ''అయితే, ఆయన, అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగంతులను మీకు తెలియజేయును.'' యోవేలు 2:26,27 '' నా జనులు ఇకనెన్నెటికినీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు. నా జనులు ఇక నన్నెడును సిగ్గునొందక యుందురు.''

మూల ప్రసంగాలు