లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

మీ దేవుడు ఎవరు?

కీ.శే. యన్‌. దానియేలు గారు

దానియేలు 2:46,27

''మరియు రాజు - ఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే! నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములో బయలు పరచువాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను.'' ఒక గొప్ప రాజు దీనిని గ్రహించాడు. ఆయన అతను చెప్పేమాట నిజముగా గ్రహించి చెప్పుతున్నాడా! కలల భావము తెలిసెకోవడానికి, మరచిపోయిన కలను సంపాదించుటకు దానియేలుకు వర్ణనాతీతమైన శక్తిఉంది. అతని జీవితమును పరీక్షించి అతని విద్యా విషయములో జయమును గుర్తించి రాజు పై సత్యమును గూర్చి గ్రహించాడు. బబులోను యౌవనస్థులు దాని యేలువంటి వారు కాదు. ఈ లోకములో క్రైస్తవత్వము తప్ప పరి, దేవుని గూర్చి తెలియపరిచిన మతం ఇంకొకటి లేదు. ఉన్నతమైన వారిలో కూడా పరిశుద్ధమైన జీవితము లేదు. నాయకుడు యౌవనస్థులను పరిశుద్ధ జీవితంలోకి నడిపించక లేక పోవడం చూస్తే చాలా విచారం వేస్తుంది. లింగ సంబంధమైన వాటిని గూర్చి నీకు బలహీనత ఉన్నట్లయితే అనేకమైన వాటిలో నీవు పొరపాట్లు చేస్తావు. ఈ లోకములో సత్యము గ్రహించిన నెబుకద్నెజరు వంటి రాజులు, నాయకులు లేరు. ఈ లోకములో గొప్పవారు అయిన వారు క్రీస్తును గూర్చిన జ్ఞానము లేకుండా ఉండినారని చెప్పలేము. వారు దానిని ఎరిగినారు. వారు దాన్ని దాచిపెట్టారు. మనుష్యులు క్రీస్తును వెంబడిస్తారేమో అని భయము వారికుండింది. ఈ విధముగా దేశమునకు వారు చాలా నష్టము కలుగజేస్తారు. బాధ్యత కలిగిన మనుష్యులు ఈ దినములలో బాధ్యత కలిగిన పదవులు అవసరమని మనుష్యులు చెప్పుతారు. కానీ మనకు స్వంత ప్రాముఖ్యమును వెదికే వారు ఉన్నారు. వారు సత్యమును దాచిపెట్టేస్తారు. మన దేశమునకు ఇలాంటి వారు గొప్ప శత్రువులు, వారు విధ్యావంతులై యుండవచ్చును గానీ వారు ఆత్మీయ మనుష్యులు కారు.

నెబుకద్నెజరు సత్యమును ఒప్పుకున్నాడు. కానీ అతను మారుమనస్సు పొందలేదు. అతడు దాని యేలును ఆరాధించాడు గానీ దానియేలు యొక్క దేవునిని కాదు. మనుష్యులందరూ దానియేలు యొక్క దేవుని ఆరాధించాలని ఆజ్ఞాపించాడు గానీ ఆయన ఆదాధించలేదు.

దానియేలు 3:1 రాజగు నెబకద్నెజరు బంగారు ప్రతిమనొకటి చేయించి బబులోను దేశములోని ''దూరా'' యను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువది మూరల ఎత్తును, ఆరు మూరల వెడల్పునైయుండెను.'' ఇక్కడ అతడు ఒక దేవుని సృష్టిస్తున్నాడు. అనేక మంది క్రీస్తును ఈ రీతిగా తమ పెదవులతో ఆరాధిస్తారు కానీ వారి హృదయములను ఆయనకు ఇవ్వరు. దేవుడు భవిష్యత్తు గూర్చి ఒక ప్రకటన చేసినప్పటికి నెబుకద్నెజరు ఒక దేవుని సృజిస్తున్నాడు. దానియేలు 4:30. ''రాజు-బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభువు ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.'' ఇక్కడ ఈ మాటలలో నిజమైన మనుష్యుడు కనబడుతున్నాడు. ఒక మనుష్యుడు క్రీస్తు దగ్గరకు రాక పోవడానికి అతని గర్వమే కారణం. దేవుని కంటే తానేగొప్పవాడ్ని అనుకుంటాడు. తన రాజరికమునందున్న గొప్పతనమును బట్టి నెబుకద్నెజరు గొప్ప బబులోనును నిర్మించినట్లుగా భావించాడు. మానవుని గర్వము తన్నుతాను తగ్గించుకోదు? ''నేను ఒక పాపిని కాని అంతగొప్ప పాపినికాదు.'' నీ గర్వమును బట్టి నీవు పశ్చత్తాపపడాలి. తల్లిదండ్రుల పాపమునుబట్టి పశ్చత్తాపపడాలి. అప్పుడు వారు దేవుని తట్టి తిరుగుతారు. నెబుకద్నెజరు తన దేవుడు దేవుండ్లకు దేవుడు అని చెప్పాడు కానీ తన్నే ఒక దేవునిగా చేసుకొని మనుష్యులందరూ ఆయనను ఆరాధించవలెనని కోరాడు, ఆయన సృజించిన దేవున్ని షడ్రక్‌, మేషక్‌, అబెద్నగో అనువారు ఆరాధించడానికి నిరాకరించారని అగ్నిగుండములో వేయుటకు ఆజ్ఞాపించాడు. ఇది భయంకరమైన వేషధారణ. నేను పూర్తిగా పాపాత్ముడను అని చెప్పుటలో విరిగి నలిగిన స్థితి ఏమీలేదు. దేవుడు ఆయనను అరణ్యములో ఉన్న జంతువులతో జీవించేటట్లు చేసాడు. అది అతని గర్వము యొక్క ప్రతి ఫలము. అతని కుమారుడు తప్పిపోయాడు. దేవుడు తన తీర్పును అతనికి వ్యతిరేకముగా వ్రాశాడు. నేను ఒక మంచి క్రైస్తవుడను అని నిన్ను నీవే అభినందించుకొను చున్నావు. జాగ్రత్త! ఈ విధముగా అభినందించుకొనుట ద్వారా నీ కుటుంబమును నాశనమునకు నడిపించుకొంటావు. అది దేవుని వలన కలిగినది కాదు. నిన్ను నీవు తగ్గించుకో! రాబోయే దినములలో నీ కుటుంబము పొందేటటువంటి బాధలు నీ తప్పుడు భక్తిని బట్టియే.

మూల ప్రసంగాలు