లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

భయము మీద విజయము

కీ.శే. యన్‌. దానియేలు గారు

అ.కా 12 : 6

తెల్లవారుజామున నిశ్చయమైన మరణం పేతురు, కొరకు కనిపెడుతూ ఉండగా పేతురు ఇద్దరు సిపాయిల మధ్య హాయిగా నిద్ర పోతున్నాడు. ఇది దేవుని పిల్లల గుర్తు. వారి తలమీద అపాయం కాచుకొని యున్నప్పటికీ వారు నిద్రపోగలరు. వారికి తొందరపాటు ఏమీలేదు. దేవుని సమాధానము వారి హృదయములలో ఉంది. దేవుని ప్రేమ కలిగిన కాపుదల వారికి ఉందని వారు విశ్రాంతి తీసుకుంటారు. మనము బాల్యము నుండి ఈ దినాలలో అనేకమైన వాటికి భయపడడం నేర్పించబడ్డాము. ఈ భయమును సైతాను ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యమయిన క్రైస్తవ జీవితము మనయందు చిన్న బిడ్డకుండే విశ్వాసం దేవునియందు కలిగిస్తుంది. ఇదో గొప్ప దీవెన. ఆత్మీయ ఎదుగుదలకు ఇదొకగుర్తు. తన శిష్యులలో ఉండిన భయము కలిగించే స్వభావం క్రీస్తు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పేతురు ఒక చిన్న బిడ్డ తన తల్లి చేతులలో పడినిద్ర పోయినట్లుగా గాఢముగా నిద్రపోతున్నాడు అతను చంపబడబోయే సమయములో పాప రహితమైన హృదయము మనము కలిగియుండి, ఎరిగీ ఎరగకుండా పాపమునుండి కాపాడు కోవాలనే స్వభావం మనలో ఉండగా మనమీ విశ్వాసములోనికి ఎదుగుతాము. భయము దేవుని వలననైనదిగాదు. ప్రక 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్దికులందును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము.'' భయపడే వారితో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అది నేరం చేసినట్లుగా కనబడుతుంది. నీవు విశ్వాసములో అభివృద్ధి చెందకపోతే దేవుని ఎదుట తప్పించుకో లేవు. భయము సహజప్రేరితమైనదని నీవు చెప్పలేవు అనేకమైనటువంటి సహజప్రేరణలు దేవుని ఆత్మాధికారము క్రిందికి తేబడగలవు. నీ హృదయములో ద్వేషమును, కోపమును దాచుకోలేని స్థితికి ఒకనాడు నీవు వస్తావు. నీ హృదయం, కోపమును దాచుకోలేని స్థితికి ఒకనాడు నీవు వస్తావు. నీ హృదయం, మనస్సు శరీరము పరిశుద్ధపరచబడతాయి. వ్యభిచారులును, భయముగల ప్రజలును దేవుడు ఒకే రీతిగా ఎంచుతున్నాడు, విశ్వాసమునకు సంబంధములేని చీల్చిచింపేటటువంటి భయము ఉన్నది. మనము ముందుకు సాగి దేవుని చిత్తం చేయాలి. దేవుని యందలి విశ్వాసం నీలో పెరిగిన కొలది నీ జీవితములోని విలువ కూడా పెరుగుతుంది.

నీ ప్రార్థన దిన దినము తీవ్రముగా తయారవ్వాలి. నీకు ఇప్పుడు ఉండే కొద్ది పాటి విశ్వాసముతో తృప్తిపడకూడదు. నీవు ప్రభువునందు గొప్ప విశ్వాసముతో ముందుకు ఎదగాలి. ''నీ హృదయమంతటితో యెహోవాయందు విశ్వాసముంచు. నీ బుద్ధి మీద నీవు ఆధారపడవద్దు.'' ఈ మెట్టుకు పేతురు అందుకున్నాడు. నీవు ప్రార్ధనకు ఇవ్వబడే అవకాశములను నిర్లక్ష్యం చేసి అకస్మాత్తుగా దేవుని యందు విశ్వాసము కావాలంటే రాదు. నీవు ఎదగడానికి ఇవ్వబడిన అవకాశములను సద్వినియోగం చేసుకోనకపోతే తొందర కలిగినప్పుడు విశ్వాసం దొరకదు. సైతాను మనలను వణికించి మన భయములను ఇతరులకు కనబడేటట్లు చేయాలని ఆశిస్తాడు. మన లోతులేని స్థితిని అందరికీ కనబడేటట్లు చేస్తాడు, ప్రార్థన నీ యందు గొప్ప కార్యము జరిగిస్తుంది. ఈ వ్యక్తిత్వమును ఐక్యపరిచి త్రిత్వముతో ఒకటిగా అవునట్లు చేస్తాడు.

మూల ప్రసంగాలు