లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

క్రీస్తునందు విజయము

కీ.శే. యన్‌. దానియేలు గారు

ప్రకటన 19:7,8

ఈ సన్నపు నార బట్ట అనగానేమిటి? అది పరిశుద్దుల నీతి. దేవుని సంఘము పెళ్ళి కుమారుని సన్నిధిలో నీ నీతిని బట్టి తన్నుతాను అర్హురాళ్ళుగా చేసుకొనును. 16 వచనం. క్రీస్తు రాజులకు రాజుగానూ ప్రభువులకు ప్రభువుగానూ ఉండుట చూసి ఆశ్చర్యపోతావు. నీ ప్రభువు నిజముగా ప్రభువు. నీవు రాజు అని పిలచినవాడు నిజముగా రాజులకు రాజు. నీవు అనేక రాజులను ప్రభువులను చూసి యుండవచ్చు. కాని క్రీస్తును ప్రభువులకు ప్రభువుగానూ రాజులకు రాజుగానూ నీవు చూస్తావు. అత్యున్నతుడు అయినవానిని నీవు ఏర్పరచుకున్నావు. నీ జీవితములో గొప్ప విజయము దొరకడం నీవు చూస్తావు. ఒకానొకదినమున నీవు చెప్పుతావు, ''క్రీస్తును నేను ఏర్పాటు చేసుకొనుటలో పొరపాటు చేయలేదు, ఇతరులు ఈ లోకములో గొప్పవాటిని ఏర్పాటు చేసుకొనుచుండగా నీవైతే అత్యున్నతుడైన వానిని ఏర్పాటు చేసుకున్నావు.'' నీవు అతి దీనమైన మార్గమును ఏర్పాటు చేసుకున్నావు అయితే అది అత్యున్నతమైనది. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చూసి ఎంత సంతోషిస్తావు! నీవు ఏర్పాటు చేసుకున్నవాడు సృష్టిలో అత్యున్నతుడు. నీవు ఆయనకొరకు బాధనొంది. ఆయన కొరకు నిన్ను నీవు కాదనిపించుకుంటే అది నీకు గొప్ప తృప్తినిస్తుంది. ఇప్పుడు ఆయన తన్నుతాను బలపరచుకుంటున్నాడు. నీవు ఆయనకు లొంగి, ఆయనతో ఒకడివి అయి ఉంటే ఆయన ప్రభువు అయి ఉండుట చూసినప్పుడు ఆయనతో పరిపాలన చేస్తావు. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. ఆమె ధరించుకొనుటకు పెళ్ళి కుమార్తెగా నీతిని ఒక సన్ననారబట్టగా ధరించుకున్నది. అది నా నీతి. నా నీతి ఆయన పెళ్ళి కుమార్తెను అందముగా చేసినది. ఆయన కృపను బట్టి ఆలాంటి పరిపూర్ణతను నేను సంపాదించుకున్నాను. సంఘము నీ జీవితము ద్వారా అలంకరింప బడడం చూస్తావు. ఆయన కృపను బట్టి నేను అంత పరిపూర్ణతను సంపాదించుకున్నాను. నూతనజన్మ సమయమందు మనము ఆత్మ ద్వారా జన్మిస్తాము. | యోహాను 3:9,14 నీవు దేవుని వలన జన్మించినావు ఆత్మవలన మట్టుకుకాదు. మనము నూతన జన్మపొందినప్పుడు ఆత్మవలన జన్మిస్తాము. మనము పరిపూర్ణులమైనప్పుడు మనము దేవుని వలన జన్మిస్తాము. మనము దేవుని ప్రేమతో నింపబడి యుంటాము. సమస్తమును జయించేశక్తి నీప్రేమ యే, ఆయన పెళ్ళి కుమార్తె ధరించవలసిన వస్త్రములను నీవు ఇస్తావు. ఆమె నీ పరిశుద్ధతను, నీ ప్రేమను, పరిశుద్ధపరచు నీ కృపలను ధరిస్తుంది.

నీవు సంఘమును అలంకరించబోవుచున్నావను విషయము మర్చిపోతావు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము ఇవి నిన్ను ముట్టవు. వీటికి స్థలము లేనటువంటి ఉన్నతమైన స్థానమునకు నీవు ఎదిగిపోతావు. ఒకప్పుడు వాటితో నీవు పోరాడి నేను జయించలేనని అనుకున్నావు. అనేక మంది క్రైస్తవులు కొన్ని మెట్లలో నిరాశ చెందుతారు. కాని క్రీస్తు నందు ఎలాంటి నిరాశ లేదు. నీవు జయిస్తావు. నీవు జయించవలసి ఉన్నావు. అది రూపాంతరము. నీ ప్రభువు ఒక విజయము సంపాదించాడు. దేవుని నీతితోనూ, దేవుని ప్రేమతోనూ నీవు నింపబడియుండు. అప్పుడు నీ నీతి తెల్లని నార బట్ట వలె అగును. నీ జీవితములో పోరాటములు ఉంటాయి. ఆత్మీయ జీవితములో పోరాటములు మంచిదే. యాకోబు చాలా కాలం ఓడిపోయాడు. కానీ చిట్ట చివరలో గెలిచాడు. ఓటమి నిన్ను ఆవరించునట్లు కనబడు సమయములో నేను జయిస్తాను. అని నీవు చెప్పుతావు, నీవు ప్రేమించలేని వారిని నీవు ప్రేమించి తీరతావు. పరిశుద్ధ జీవితం విషయములో నీవు ఓడిపోయినచోట నీవు జయిస్తావు. | యోహాను 3:24 నీ విశ్వాసమును నీవు వదలిపెట్టవద్దు. గట్టిగా పట్టుకో. పోరాటము పోరాడు. విజయము నీది. దేవుడు నీవు పరిపూర్ణుడవుగా ఉండవలెనని ఆయన ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడవు అవ్వాలని కోరుతున్నాడు. ''నీకిచ్చుటకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శక్తి నాకు ఇవ్వబడింది.'' అని క్రీస్తు చెప్పతున్నాడు.

ఈ సహవాసంలో మనము ఓటమిని ఎదురుచూడవద్దు. నీతి విషయమైన గ్రహింపు మనలను పట్టుకుంటుంది. ఇటీవల జరిగిన రిట్రీటులో మనము ఎలాంటి ఐకమత్యము గమనించినాము. ఎంత సమాధానముగా మనము జీవించినాము? అది దేవునికి సంబంధించినది కాదా? దేవుడు వాతావరణం తన అదుపులో పెట్టుకొని చల్లగా ఉంచాడు. | యోహాను 4:7,12 మనము ఒకరినొకరము ప్రేమించుకొంటే దేవుడు మనయందు నివసిస్తాడు. దేవుడు నీయందు జీవించడానికి నీవు అలవాటు పడితే నీ వ్యక్తిత్వము అంతా మార్పు చెందుతుంది. ఒకప్పుడు అసాధ్యములనిపించినవి ఇప్పుడు సాధ్యపడతాయి. ఎక్కడయితే నీవు ప్రేమించలేకపోయావో నీవు ప్రేమించడం ప్రారంభిస్తావు, ఎక్కడైతే నీవు విశ్వాసమును ప్రయోగించలేకపోయావో అక్కడ నీవు విశ్వాసమును ప్రయోగిస్తావు. నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచినప్పుడు నీకు ఓటమి లేదు. నీకు నీవు చెప్పుకో, ''నాకు ఓటమి లేదు, నేను ఒక ఎత్తు నుండి మరియొక ఎత్తునకు పోవుదును. పరిశుద్ధులు వెళ్ళిన స్థలమునకు నేను వెళ్ళతాను. నేను పరిశుద్దుల వారసత్వమును అందుకుంటాను. నేను దేవుని చిత్త ప్రకారము జ్ఞానమందు ప్రార్థన చేస్తాను. ఒకానొకదినంబున పరిపూర్ణత చూస్తాను. నా ప్రభువుతో చేతిలో చేయివేసి నడుస్తాను. అప్పుడు ఆయనతో నేను ఒకటవుతాను. ''ఇది నీ నిరీక్షణ కానివ్వండి | యోహాను 5:4 దేవుని ప్రేమతో నీవు నిండి యున్నప్పుడు దేవుని పరిశుద్ధతతో నీవు అలంకరించబడతావు. ఇలాగు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె సౌందర్యముగా కనబడుతుంది. 14వచనం. నీ విశ్వాసము పరిపూర్ణమైన స్థితికి వచ్చే మెట్టును నీవు అందుకుంటావు. ఒక యౌవనస్థునిగా ప్రార్థనలో ఆయన చిత్తప్రకారము నేను అడిగినాను. ఆయన కృప ద్వారా నేను కోరుకొన్న విజయము దొరికింది. నేను అపజయం పొందుతూ ఉన్న సమయములో ఆయన నన్ను పై కెత్తి ఆయనే నన్ను నడిపించాడు. నేను నీ గురించి నిరాశపొందను. ఎందుకంటే నా ప్రభువును నీవు ఏర్పాటుచేసుకున్నావు. నీవు ఓడిపోయే సమయములో ఆయన నీకు సహాయము చేయడానికి వస్తాడు. | యోహాను 5:15. ఇది గ్రహించుట చాలా కష్టం. బెవిన్‌టన్‌ అనే వ్యక్తి చనిపోతూ ఉండిన సమయం ఉండింది. డాక్టర్లు ఆయనను విడిచిపెట్టారు. ఆ సమయంలో ప్రతివారిని తనగది విడిచిపెట్టి వెళ్ళిపోమ్మన్నాడు. ఆయన మూర్చిల్లుతూ ఉండినాడు. కాని వచనం మీద తన వేళ్ళుపెట్టి ప్రార్థించాడు. మనము ఏమిడిగిననూ ''మనం కావలసిన వాటిని పొందుతామని మనం ఎరుగుదుము.'' మూర్చపోవడం ఆగిపోయింది. అతడు తిరిగికోలుకున్నాడు. ఈ వాక్యము మీద తన వ్రేళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూనే ఉండినాడు. అకస్మాత్తుగా స్వస్థత వచ్చింది. పడక మీద నుండి ఎగిరి గంతువేసాడు. ఆయనను చూసుకుంటూ ఉండిన ఆమె భయపడింది. క్రీస్తు అతనిని స్వస్థపరిచాడు. మనము ఎన్నడూ నిరుత్సాహపడకూడదు. కానీ ప్రతి బలహీనత మీద విజయము కోరుకోవాలి. పరిపూర్ణుడవుగా ఉండు! పెండ్లి కుమార్తెకు సన్నపునారబట్టి నీవు అందించు. నీ ప్రభువు నిజముగా ప్రభువు అని గ్రహించు. నీ వ్యక్తిత్వంలో ఈ విశ్వాసం ఎంత తేటగా కనబరచుకొంటుంది! ఎంత ధైర్యం, ఎంత నీరీక్షణ, ఎంత సంతోషంగా నీవు ఉంటావు! నీవు ఆజ్ఞలకు విధేయుడవు అవుతావని చెప్ప. నీ శతృవులను ప్రేమించు. నీ యజమానునివలే ఉండు! సంపూర్ణ విజయమునాదే అని చెప్పు!

మూల ప్రసంగాలు