లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని తలంపులను విలువగా ఎంచుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తనలు 139 : 17 ''దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది.''

ఈ లోకములో అనేకమైన వాటిని మనము విలువైనవిగా ఎంచుతాము. కానీ కీర్తన కర్త దేవుని తలంపులను విలువైన వాటిగా ఎంచుతున్నాడు. నీ జీవితములో నీవు దేనిని విలువైనదిగా ఎంచుతున్నావు? దేవుని తలంపే మొట్ట మొదట లోకమును సృజించింది. ఈ లోకము ఉనికిలోనికి రాకముందు అది చిత్రకారుని యొక్క ఆలోచన నీ తలంపులు ఏమిటి? అవి దేవుని తలంపులా? అవి దేవుని తలంపులు అయితే నీ జీవితము అంతా బండ మీద కట్టబడుతుంది. నీ తలంపులను దేవుని తలంపులతో సరిచూసుకొనుటకు జాగ్రత్తపడుతున్నావా? కొన్ని వింతైన తలంపులు నీలోనికి రావచ్చును. అలాంటి తలంపులలో ఒక్క తలంపు నీ జీవితమును నాశనం చెయ్యగలవు. మన తలంపులు పూర్తిగా దేవుని తలంపులు అయి ఉండేటట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి ఆహాబును ఒక తలంపు పట్టుకొనింది. నాబోతు యొక్క ద్రాక్షతోటను పట్టుకోవాలని ఆశించాడు. అనేక రీతులుగా తన తోటను బాగుచేసుకొని ఉండవచ్చు కాని ఒక్క తలంపు తన కుటుంబము, రాజ్యము నాశనము అవడానికి కారణం అయింది. మీ తలంపుల గూర్చి జాగ్రత్తపపడండి. ఆహాబు కోరినటువంటిది తనకు లభించనప్పుడు తన భార్య అతనికి సహాయంచేయడానికి వచ్చింది ఒక జ్ఞానము కలిగిన భార్య భర్తను ఇలాగు అడిగి ఉండేది. ''అతని తోటను నీవెందుకు ఆక్రమించుకోగోరుతున్నావు? ఇది దేవుని తలంపా? కాకపోతే మన కుటుంబమును అది నాశనం చేయగలదు.'' కానీ ఆహాబు ఒక అన్య గృహమునుండి వివాహము చేసుకొనుటకు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె ఒక విగ్రహారాధికురాలు. ప్రభువు యొక్క మార్గముల విషయములలో ఆమె అతనికి ఆలోచన చెప్పలేక పోయింది. ఒక భార్య తన భర్తకు సరియైన మార్గములో సలహా ఇవ్వలేకపోతే కుటుంబము అంతయూ విరిగి విచ్చిన్నమై పోతుంది. నీతో పాలిభాగస్తురాలిని ఎక్కడ ఎన్నుకుంటూన్నావు? దేవుని వాక్యము పరిపాలన చేసే గృహము నుండా? మన క్రైస్తవ గృహములు దేవుని వాక్యము చేత పూర్తిగా ఆధీనములో పెట్టబడవుగానీ ఇంటి దగ్గర మనము లోకమును వెంబడిస్తాము. మనము అంటాము, ''అది దేవుని చిత్తము కావొచ్చు, సరే కాని మనము ఈ లోకములో ఉన్నాము. మనం జ్ఞానముగా నడుచుకోవాలి.'' ప్రజలు ఆలాగు జీవిస్తారు. దావీదు అంటాడు ''నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తము నాకు ఆశీర్వాదమే.'' నిజమైన క్రైస్తవుడు దేవుని తలంపుల మూట గాక వేరే ఏమికాదు. ఆ తలంపుల నుండి అతడు ఎన్నడూ ప్రక్కకు జారడు.

యెషయా 51:16 '' నీ నోట నా మాటలు ఉంచి.'' 7,8 వచనములు ''నీతి అనుసరించు వారలారా! నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచు కొన్న జనులారా ఆలకించుడి.'' నీవు దేవుని వాక్యము హృదయములో పెట్టుకొంటే ఆశీర్వాదము. ఒక తరము నుండి మరియొక తరమునకు వెళ్ళుతుంది. మనము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మన బిడ్డలు, బిడ్డల బిడ్డలును దాని ద్వారా మేలు పొందాలని ఆశిస్తాము. కానీ నీవు దేవుని వాక్యమును నీ హృదయములో ఉంచుకొని దేవుని ఆజ్ఞలకు నిన్ను నీవు ఆధీనములో పెట్టుకొని ఉంటే ఆశీర్వాదము తరతరములకు వ్యాపించును. నీ యిల్లు కూలి పోవచ్చును గానీ దేవుని వాక్యమునకు నీవు విధేయుడవు అవుట ద్వారా నీవు నిర్మించిన ఆశ్రయము ఎన్నటికీ తప్పిపోదు.

అబ్రహాము దేవుని వాక్యమును విన్నాడు. అతడు అన్య గృహములనుండి వచ్చాడు. కానీ దేవుడు అతనిని పిలిచినప్పుడు అతడు విధేయుడు అయినాడు. అతని అన్య తలంపులలో ఒక్కొక్కటి తీసివేయబడి దేవుని తలంపులు ఆక్రమించినాయి. అబ్రహాము దేవుని వాక్యమును అందుకున్నాడు. అతడు గృహమును నిర్మాణం చేసుకున్నాడు. ఆ గృహము ఆశ్చర్యకరమైనది. ఈ దినము వరకూ అది నిలచియున్నది.

అతని తర్వాత 400 సం|| ఫరో అతని పిల్లలను తన బానిసలుగా చేసుకోవాలని ఆశించాడు. దేవుడు ఫరోను హెచ్చరించాడు, ''దేవుని జనాంగముతో నీవు ఏమి చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. నీవు వారిని హింసించితే దేవుడు నీ పిల్లలను నాశనం చేస్తాడు. నీ సైన్యము అంతానాశనం అయిపోతుంది.'' ఒక రాజు తన సైన్యాన్ని పోగొట్టుకుంటే దేని మీద అతడు ఆధారపడతాడు? దేని మీదా కాదు.

నెబుకద్నెజరు ఇశ్రాయేలీయులను కఠినమైన రీతిగా సానబెట్టవలెనని చూసాడు. అతడు కొన్ని మార్గములలో వెళ్ళితే నీతిమంతుని విధేయత, క్రమశిక్షణ అవిధేయులైన ఇశ్రాయేలీయులకు నేర్పించాలని దేవుడు నెబుకద్నేజరును ఏర్పాటు చేసుకున్నాడు. రానైయున్న పరిస్థితిని దేవుడు యిర్మియాకు బయల్పరిచాడు. ''అక్కడ నీకు నేర్పిస్తాను. ఇప్పుడైతే నేర్చుకునే పరిస్థితిలో లేరు. బబులోను దేశములో మీరు ఉన్నతమైన జాతిగా ఉందురు.'' అని దేవుడు చెప్పాడు, అబ్రహాము పిల్లలకు దేవుడు ఇచ్చే ప్రకటనలు ప్రత్యేకమైనవి. వారి జీవితము వారు చుట్టూ ఉన్నవారి జీవితములకంటే బాగున్నది. దేవుడు తన నిజస్థితిని బబులోను రాష్ట్రంలో బయలు పరచుటకు షద్రమ్‌కు, మేషకు అబెద్నగో అనువారిని వాడుకున్నాడు. దేవుని తలంపులు వారు అక్కడ ఘనపరిచారు. నీవు క్రైస్తవుడవు అయితే నీపైన ఉన్నవారు మర్యాద చేస్తారు. నీవు ప్రభువును ప్రేమించే కోడలవు అయితే నీ అత్తగారు నీ మాటలు ఘనపరుస్తారు. ఒక బడిలో ఒక కళాశాలలో నీవు పని చేసేవాడివి అయితే నీపై నున్నటువంటి వారు ప్రభువు నీతో ఉన్నాదని గుర్తెరిగి నిన్ను ఘనపరుస్తారు. నేను ఇటువంటివి జరగడం చూసాను. నీవు దేవుని తలంపులతో నిండిన వాడవైతే నీవు ఉన్నచోట ఒక నాయకుడిగా ఉంటావు. పరి పౌలు ఒక పెద్ద ఓడలో ఉండినాడు. అతడొక ఖైదీగా వెళ్ళుతున్నాడు. కానీ అతడు ఓడను నడిపించే వాడిని నడిపిస్తున్నాడు. పౌలుకు ఖగోళశాస్త్రం ఏమన్నా తెలుసా? ఒక ఓడనడిపించుటలో అవసరమైన నడుపుదల ఇవ్వగలడా. కానీ అతడు చెప్పింది నెరవేరుతూ ఉండింది. ప్రారంభములో ఓడనడిపించేవాడు అతని సలహాను ధిక్కరించాడు. కానీ చివరికి పౌలు యొక్క మాటలే వారిని నడిపించడం ఆరంభించినవి.

''నీ తలంపులు నాకెంత ప్రియములు. నేను వాటిని ఎంత గౌరవము చేయుచున్నాను?'' వాటిని నీవు ఘనముగా ఎంచుచున్నావా? నీవు ఉదయకాలమున ఒక వాక్యము చదివినప్పుడు దానిని ఒక అలవాటుగా చదువుచున్నావా? దేవుడు నీ తలంపులు తీసివేసి తన తలంపులతో దానిని నింపకోరుతున్నాడు. నీవు ఎదిగేకొలది ఆయన తలంపులతో ఇంకా ఎక్కువగా నింపబడతావు. ఒక చిన్నబిడ్డగా నీవు 5% దేవుని వాక్యం తీసుకోవచ్చు 15 సం|| వయస్సులో 20% తీసుకోవచ్చు. 25 సం||ల వయస్సులో దేవుని తలంపులలో 50% తీసుకోవచ్చు. ఇశ్రాయేలు రాజులు దేవుని వాక్కులను వ్రాయవలసిందిగా ఆజ్ఞ అయింది. దాని ద్వారా వారు దేవుని వాక్యమును తెలుసుకుంటారు. ఒక దేశములో రాజు దేవుని వాక్యము ఎరిగి ఆ జ్ఞానముతో దానిని నడిపించ గోరితే ఒక విధముగా ఆ దేశము వర్థిల్లుతుంది. 99 ఏళ్ళవయసులో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ''అబ్రహామా నా తలంపులలో నూరుశాతం ఇంకా నీకు గ్రాహ్యముకాలేదు.''

ఆదికాండం 17:1 మొట్ట మొదటగా మనము దేవుని వాక్యమును విలువగా ఎంచము. అది మనలోనికి ప్రవేశించదు. చీకటి మనలను చుట్టుకొనియున్నది. సైతాను దేవుని వాక్యము మనలోనికి ప్రవేశించకుండా చూసుకుంటాడు. అనేక క్రైస్తవ గృహములలో ఒక విధమైన చీకటి ఉంది. ఒకప్పుడు స్విట్జర్లాండులో ఒక యౌవనస్థుడు తన దేహం మీద వింతైనది ఎదగడం చూసాడు. స్వస్థత పొందాలని కోరాడు. ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి అతడు చెప్పినట్లు చేసాడు. అతడు స్వస్థత పొందాడు నిజమే కానీ ఒక దురాత్మ అతన్ని పట్టుకుంది. దేవుని వాక్యము గ్రహించకుండా అతని తెలివిని బంధించేసాడు. తర్వాత దేవుని వాక్యము గ్రహింపు కాలేదు. అతను స్వస్థత కొరకు ఎంత వెల చెల్లించాడు. దావీదు ప్రార్థిస్తాడు. ''నా యవ్వన దినముల పాపము నుండి నన్ను విడిపించు ప్రభువా'' చెడుతలంపులు అతనిపైన ఆధిపత్యం చేస్తున్నాయి. వ్యభిచారపు తలంపులు! అతడు పాపములో పడిపోతూ ఉండినాడు. అతడు మంచివాడుగా ఉండగోరినాడు కానీ ఉండలేకపోయాడు. తల్లిదండ్రులారా! మీరు దుష్టత్వమును వెంబడిస్తే మీ పిల్లలు పాపములో పడిపోతారు. ''నాకు చెడు తలంపులు వస్తున్నవి'' అని మీరు చెప్పుతారు. నిన్ను నీవు పరీక్షించుకో, కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలకు చాలా కీడు చేసారు. ఆ స్విట్జర్లాండు కుర్రవాడు మంచివాడు అవునట్లు వివాహము చేసుకున్నాడు. కానీ అతని భయంకరత్వము పెరిగిపోయింది. అతడు చనిపోవాలని ఆశించాడు. ఒకప్పుడు అతడు, అతని భార్య ఇద్దరూ జబ్బున పడ్డారు. అతని వ్యాధిలో అతడు ఇంకనూ ఒక మార్గము కొరకు వెదుగుతూ ఉండినాడు. దేవుడు అతని చేతులలోనికి ఒక కరపత్రం పంపించాడు. అప్పుడు సత్యము బయటికి వచ్చింది. అతడు దురాత్మల దగ్గర ఆలోచించడం ఒప్పుకొన్నాడు. దేవుడు అతనిని క్షమించాడు. అప్పుడు అతనికి విజయం వచ్చింది. క్రీస్తే మన విమోచకుడు. సిలువలో మనకు విజయమున్నది. తమ బిడ్డలకు సంహములవలే ఉగ్రులైయుండే తల్లిదండ్రులు తమ బిడ్డలను తప్పుదారిన నడిపించేవారు. నీ తలంపులు అన్నీ దేవుని తలంపులా? దేవుని తలంపులతో నీ తలంపులను చూసుకుంటున్నావా?

అబ్షాలోము జీవితములో చాలా త్వరగానే ఒక తప్పు తలంపుతో పతనం అయ్యాడు. అతనికి తండ్రి సింహాసనం కావాలని కోరాడు. అతనికి ధైవభయంలేదు. తప్పుగా ఎంచేవరకు దావీదు అతనిని ప్రేమించాడు. అబ్షాలోము తన తమ్ముని చంపివేసాడు. కానీ దావీదు అతని యెడల కనికరము కలిగి అతన్ని ముద్దుపెట్టుకున్నాడు. అది తప్పుడు ముద్దు. పశ్చత్తాపములేనటు వంటి కుమారునికి ఇచ్చిన ముద్దు. మనలో అనేకమందిమి ఆ రీతిగా మన బిడ్డలను ముద్దుపెట్టుకొని వారిని నరకమునకు నడిపిస్తాము. వారి మీద గమనము ఉంచాలి. వారు తప్పుడు తలంపులు గలవారై ఉంటారు, మా పిల్లలు మాట్లాడే కొన్ని మాటలు తప్పు, నేను వారిని దిద్దుతాను. అవి దేవునికి సంబంధించినవి కావు. వారికి కోపం రావచ్చు. కానీ, తలంపుల మీద మనం నవ్వులాటలకు వెళ్ళితే వారికి సహాయకరముగా ఉండము. తర్వాత నేను వారికొరకు ప్రార్థిస్తాను. దేవుడు ఆ తప్పుడు తలంపులు విడిచిపెట్టేటట్లుగా వారిని చేస్తాడు.

దావీదు తన జీవితం క్షేమముగానూ, దేవుని హస్తములచేత రక్షించబడినదిగానూ ఎదుగును. కానీ అబ్షాలోము ఎక్కడ ఉన్నాడు? దావీదు తన అధిపతులకు అబ్షాలోముతో మెల్లిగా క్రియ తన నిమిత్తము జరిగించమనికోరాడు. వారు అబ్షాలోమును రక్షించగలిగారా? దేవుని వాక్యము వారికి బోధించకపోయినట్లయితే ఏ శక్తియూ నీ పిల్లలను రక్షించలేదు. కొంతమంది యౌవనస్థులు వెళ్ళి దేవుని చిత్తమునకు వెలుపట వివాహము చేసుకుంటారు. ''నీవు ఎందుకు ఆమెను పెండ్లిచేసుకున్నావు.'' అని అడిగితే నేను ఆమెను మారు మనస్సులోనికి నడిపిస్తాను అని అంటారు. కానీ ఉన్న సత్యమేమంటే ఆమే నిన్ను మార్చేస్తుంది. అనేకమంది ఆలాంటి నియమమును బట్టి వారి మొదటి ప్రేమను పోగొట్టుకొన్నారు. వారిని తిరిగి సరి అయిన మార్గములోనికి నడపలేము దేవుని వాక్యముతో నింపబడియుండు.

యెషయా 51:21,22 దేవుడు నీ శతృవులకు ద:ఖము కలిగిస్తాడు. నీ గృహములోనికి నీ జీవితములోనికి ప్రవేశించాలని సైతాను ఎల్లప్పుడూ కాచుకొనియున్నాడు. కానీ నీవు దేవుని చిత్తమును వెదికినంత కాలము దేవుని వాక్యమును జాగ్రత్తగా పఠించి దానికి విధేయుడవు అయినంతకాలము నీ జీవితము మధ్యాహ్నపు ఎండవలే అంతకంతకూ ప్రకాశమానమవును. మనుష్యులు నీ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడుతుంటారు. దుర్మార్దుల తలంపులు అన్నీ పాడయిపోతాయి. దానియేలును పాడుచేయవలెనని ఆశించిన వారందరూ సింహపు నోళ్ళలో పడ్డారు. దుష్టుల తలంపులు అన్నియూ పాడై పోవును. బబులోను రాజు దానియేలు మాటలు వినడం ప్రారంబించారు. దానియేలు నెబుకద్నెజరును బలమైన రాజు అని భయపడక గద్ధించాడు. దానియేలు 4: 25-27.

నీవు దేవుని వాక్యమునకు విధేయుడవు యితే నీకు అంతకంతకూ ఎక్కువ అయిన ధైర్యము వస్తుంది. ఏలియా వలే నీవు ఆహాబుతో చెప్పినట్లుగా నా బోతు రక్తము ఏ స్థలమందు కుక్కలు నాకా యో అక్కడే నీ రక్తమును కుక్కలు నాకుతాయి, నిన్ను నీవు దేవుని వాక్య అధికారము క్రిందపెట్టుకో. అప్పుడు నీవు పాడైన స్థలములను తిరిగి కట్టుదువు. గొంగళిపురుగులు, చీడపురుగులు పాడుచేసిన సం||లను తిరిగి దేవుడు ఇస్తాడు. నిన్ను నీవు పరీక్షించుకో, దేవుని వాక్యములో ఎంత మాత్రము నీ జీవితమును ఏలుబడి చేస్తున్నావో చూసుకో. దేవుని వాక్యమయిన క్రీస్తు ప్రభువు నూరుశాతం నీ జీవితములో ఏలుబడి చేస్తున్నాడా. ''నేను ఎల్లప్పుడు నా తండ్రికి ఇష్టమైన విషయములనే చేస్తాను'' అని ఆయన చెప్పాడు. మనము అది చేయాలని కోరతాడు. ఆయన శిష్యులలో అనేక మంది ఇది చాలా కష్టమైనదని చెప్పి ఆయనను విడిచివెళ్ళారు. కాని పేతురు ఇలాగు చెప్పాడు. ''ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము. నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.'' యోహాను 6:68.

యెషయా 66:3,4 ''నాకిష్టము కాని దానిని కోరుకొనిరి.'' దేవుడు నీ ఏర్పాట్లు విషయము చూస్తుంటాడు. ఆయన అదిరిపోయి ఈ విధముగా చెప్పుతున్నాడు.'' అయ్యో నా బిడ్డలకు ఏమి సంభవించునో, మనము డంబమైన దుస్తులు వేసుకుంటాము. ఆ దుస్తుల ద్వారా సైతాను నీ మీద దాడి చేసినప్పుడు నీవు సైతాను మీద దాడి చేయగలవా? నీవు ఏదికోరుకున్నా దేవునితో సామీప్యతను అది ఆటంకపరచకూడదు. అందరూ ఘనంగా ఎంచే పదవిని నీవు అలంకరించవచ్చును. అప్పుడు దేవుని భయము లేని వారితో నీవు ఏకము కావచ్చును. ఒకానొకదినమున నీవు కూడ వారి వలే అయిపోతావు. దేవుని సేవకొరకు చాలాడబ్బు నీవు ఇవ్వవచ్చు. కానీ నిన్ను నీవు పోగొట్టుకుంటావు.

దేవుడు నీ కొరకు కలిగియున్న తలంపులను నీవు తెలిసికొనుట ఎంతమేలు అబ్రహాముకు పాలస్తీనాను దేవుడు చూపించినప్పుడు అది ఒక అరణ్య ప్రదేశము. లోతు ఒకమంచి స్థలమును ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఈ దినమున లోతు ఏర్పాటు చేసుకున్నా స్థలము మృత సముద్రముగా మారిపోయింది. ఒకానొక దినమున నీవు వారివలే అవుతావు. పక్షులు ఆ సముద్రము మీద నుండి ఎగురలేవు. ఆ నీళ్ళలో చేపలు ఏవీ బ్రతకవు. నీవు కూడా ఆలాగు అయిపోతావు. నీవు ఒక జీవములేని మృత సముద్రం అవుతావు. ఎందుకు? నీవు దేవుని చిత్తము కాని దానిని ఏర్పాటు చేసుకున్నావు.

ఇశ్రాయేలీయులు 400 సం|| ఐగుప్తులో గడిపిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికీ పాలస్తీన ఒక తోటవలే ఉండింది.

లోతు సొదమలో నుండి బయటకు వచ్చి అంతయూ పోగొట్టుకున్నాడు. అబ్రహాము గూడా ఐగుప్తులోనుండి బయటకు వచ్చాడు. దేవున్ని తన సొంత వారసత్వముగా పొందాడు. నీ జీవితము ఆలాగు ఉంటుంది.

పేతురు క్రీస్తును వదలిపెట్టలేదు. యెరూషలేములో అతడు ముఖ్యుడు అయిపోయాడు. అతని విధ్య ఏ పాటిది? అతని సాంఘిక అంతస్థు ఏలాగున్నది? అంత ఎక్కువగా లేదు. కాని పేతురు అయితే క్రీస్తు తలంపులను విడిచిపెట్టలేదు. తన్ను నిత్య జీవమునకు నడిపింపదలచిన తలంపులు ఎక్కడ దొరుకుతాయి? తాను కదిలి వెళ్ళిపోలేని స్థలానికి చేరుకున్నాడు. నీవు ఆ స్థలానికి వచ్చావా? ''ఏమి వచ్చినా సరే నేను దేవుని తలంపులు విడిచిపెట్టను. నా హృదయమును గృహమును బైబిలు ఏలుబడి చేయును. దేవుడు నాకు సహభాగస్థుని ఎవరినైనా ఇస్తే ఎల్లప్పుడూ ఆ వ్యక్తి దేవుని సేవలో పాలుపంచు కుంటాడు. ఆ వ్యక్తి దేవుని తలంపులను పాడుచేసే క్రొత్త తలంపులను తీసుకు రాకూడదు అని నీవు చెప్పగలవా?

మూల ప్రసంగాలు