లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నిన్ను నీవు తగ్గించుకొనుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

మీకా 6:8-16.

ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడడం చూస్తున్నాము. ''నీ దేవునితో దీనముగా నడుచుట.'' ఎలాంటి దీనత్వము దేవుడు ఎదురుచూస్తున్నాడు. విరిగి, నలిగిన హృదయము నుండి వచ్చు దీనత్వము, ఇదే నిజమైన దీనత్వము. స్వాభావికమైన మనస్సునుండి వచ్చు దీనత్వము. మరియొకటి కలదు. కానీ అది వేషధారణ. ''తప్పుత్రాచు, తప్పు రాళ్ళు ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా?'' ఈ ప్రజలలో కొంతమంది దీనులుకాని వారి ఇండ్లలో తప్పు త్రాసులు ఉన్నాయి. దేవుడు తప్పుడు కొలతలను ద్వేషించుచున్నాడు. మన ఇండ్లలో తప్పుడు డబ్బు పెట్టకొని భక్తిని ప్రదర్శించుట ప్రయోజనం లేదు. మన దీనత్వములో మనము సంపూర్ణులముగా ఉండాలి. విరిగి నలిగిన మనస్సుతో తన్నుతాను తగ్గించుకొనువానిని దేవుడు మెచ్చుతాడు. మన ఒప్పు కోలులో మనం సంపూర్ణులముగా ఉండవలెనని కోరుతున్నాడు. మన దీనత్వములో విరిగి, నలిగిన మనస్సును కోరుచున్నాడు.

ఒక క్రైస్తవుడు పగటి వెలుగులో బాహాటముగా జీవిస్తున్నాడు. అతనిలో దాచబడిన పాపము ఏదీలేదు. మన హృదయములు శుద్దముగా ఉండుట చాలామంచిది. నీ హృదయము దేవునితో సరిగా ఉన్నదా? కీర్తనలు 143:10 ''నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.'' మనము పూర్తిగా తిన్నగా నడవాలి. కీర్తనలు 143:8 ''నీయందు నేను నమ్మికయుంచి యున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సునే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.'' దేవుని వాక్కు నీయందు జీవించి నీతో మాట్లాడనీ. హృదయములో దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని వాక్యమునకు జీవము వచ్చును.

దేవుని వాక్యము మాట్లాడడం ప్రారంభిస్తుంది. దేవుని ఆత్మ దేవుని వాక్యమందు ఉన్నటువంటి దేవుని స్వరమును వినిపింపచేస్తుంది. దేవుని ఆత్మ నిన్ను తిన్నగా నడిచే స్థలమునకు నడిపిస్తుంది. ఒమ్రీ నీతిమంతుడు కాడు. అతడు కొన్ని సిద్ధాంతములు ఏర్పాటు చేసినాడు. అతని కుమారుడైన ఆహాబు దేశములోనికి బయలు ఆరాధన ద్వారా తప్పుడు జీవిత మార్గమును ఏర్పాటు చేసాడు. ప్రజలు ఒమ్రీ సిద్ధాంతములను వెంబడిస్తూ ఆహాబు యొక్క జీవిత విధానాన్ని బట్టి నడుచుకుంటూ ఉండినప్పుడు దేవుడు వారిని ఏలాగు ఆశీర్వాదించగలడు? నీ పాపములన్నిటినీ నీవు ఒప్పుకొన్నప్పుడు న్యాయమైన ఉద్దేశములోనికి నీవు నడిపించబడతావు.

మూల ప్రసంగాలు