లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దైవ జీవితము యొక్క తాకుడు

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఎజ్రా 6:14 '' యూదులపెద్దలు కట్టించుచూ, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారశీకదేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి''.

మనము ఒక పని ప్రారంభించవచ్చు. దాన్ని ముగించకపోవచ్చు. ''సహవాసం యొక్క సేవను ప్రారంభదశలో చూసాము. ఈ సేవ ముగింపు మనంచూస్తామా'' ఈ ప్రశ్నను నన్ను నేనే అడుక్కుంటాను.

అన్యరాజైన కోరేషు దేవుని ఆలయము కట్టడానికి పురికొల్పబడ్డాడు. ఆయన యెరూషలేములోని దేవాలయమును కట్టడానికి యెవరు? ఒకాయన ఉండినాడు. ఆయన తన కాలమును బట్టి ఈ బలమైన రాజుల యొక్క దృష్టిని దేవుని వైపునుకు మరల్చాడు. వారు దేవాలయము కట్టడం ముగించారు.

బాల్య దశనుండి దానియేలు పరిశుద్దుడుగా ఉండడానికి కష్టపడి పనిచేయడానికి నిశ్చయింయుకున్నాడు . అతడు బబులోనులో ప్రార్థించే వ్యక్తులు గల ఒక సహవాసం కట్టాడు. మీ జీవితములో నీవు ఏమైననూ సరే దేవుని మహిమార్థం నీ పనిలో మంచివాడివిగా ఉండాలి. నీవు పరిశుద్దుడవుగానూ, దేవుని కొరకు ఒక సహవాసం కట్టేవాడివిగా ఉండాలి.

దానియేలు 6:26 ''నా సముఖుమున నియమించిన దేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు. ఆయనే యుగయుగములుండు వాడు. ఆయన రాజ్యము నాశనముకా నేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును'' జీవముగల దేవునియందు విశ్వాసమునకు ప్రజలను నడిపించాలని రాజు ఆజ్ఞ అయినట్టుగా కనబడింది. దానియేలు యొక్క పూచీ కోరేషు పరిపాలన యందు కూడా కనబడింది. 50 వేల మంది ప్రజలు జెరుబ్బా బెలువెంట వెళ్ళి యెరూషలేములో దేవాలయమును బలిపీఠమును కట్టవలెనని ప్రయత్నించినారు. వారు మొట్టమొదట బలిపీఠమును బాగు చేసారు. దేవున్ని ఆరాధించడం ప్రారంభించారు. మనం ఒక బలిపీఠం దగ్గర ఆరాధిస్తున్నామా? నీ కళాశాలలో నీ ఆఫీసులో నీ గృహములో, నీ బాధ్యత నిత్యము ఉండును. నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకుంటున్నావా?

బబులోను రాజులకు దానియేలు తన దేవుని గొప్పవానిగా చేశాడు. ప్రజలు పని ముగించారు. కాని దానియేలు తన బాల్య దినములలో ప్రారంభించాడు. రాజు గారు సిద్దపరిచిన ఆహారమును ఆయనకు అప్పగించినప్పుడు ఆయన వద్దన్నాడు. అది దేవునియందు అతనిని నిర్మాణము చేయదు. నీవు ఇష్టపూర్వకముగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా వెళ్ళితే నీ అంతము ఎక్కడ? నీ అనారోగ్య విషయము నీకు గ్రహింపులేకపోయే విషయములో దేవుని నిందించవద్దు.

నెబుకద్నేజరు దేవుని ఆలయములో పాత్రను ఎత్తుకొనిపోవుట ద్వారా ఒక గొప్ప కార్యము చేస్తున్నట్లుగా అనుకొన్నాడు. ఏం జరిగింది. తన తర్వాత రాజ్యము ఏలవలసిన వానిని నాశనం చేసింది. నెబుకద్నేజరు మరణించాడు. దేవుని కార్యములను నీవు తేలికగా ఎంచుతావా? నీవు దేవుని సేవలోనికి సిద్దపాటు లేకుండా వెంటనే చేరుదువా? నీవు ఒక ప్రార్థనా గుంపులో మారుమనస్సు లేకుండానే చేరతావా? నిన్ను నీవు ఆ పనికి తగనివానిగా చేసుకుంటావు, జాగ్రత్త! నీ చేతులు శుభ్రముగా లేకపోతే నీవు దేవుని కార్యముల మీద నీ చేతులు వేయవద్దు జాగ్రత్త!

మనము నిర్మిద్ధాము, మనము పని ముగిద్ధాం. మనము దాన్ని సమర్పిద్ధాం. నీవు పనిచేస్తున్నావుగానీ మొట్టమొదట క్రీస్తులో నిన్ను నీవు కట్టుకో.

మూల ప్రసంగాలు