లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

విశ్వాస ఫలములు

కీ.శే. యన్‌. దానియేలు గారు

''ప్రభువునైన నేను దాన్ని కాపాడుదును. నేను దానికి ప్రతిక్షణం నీరుకట్టుదును. ఎవరూ దానిని నష్టపరచకుండునట్లు దివారాత్రములు దానిని కాపాడుదును.

మనము బలవంతుడైన రక్షకునికి చెందిన వారము అని మీరెరుగుదురు. ఆయన మన కాపుదలను చూసుకొంటాడు. కాపాడతాడు. ప్రతిక్షణం నీరుకడతాడు. నేను బైబిలు చదివిన కొలది దేవుని విశ్వాస్యతను రుచి చూసినవారి జీవితాలను చదివినప్పుడు నా హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. అబ్రహాము యోసేపు, మోషే, ఏలియా లోకమును గానీ, లోకమిచ్చు మహిమను గాని వెదకలేదు. వారు ఆయనను సజీవుడైన దేవునిగా వెతికారు. ఆయనయందున్న విశ్వాస్యతను చూసారు. ప్రత్యేకముగా దానియేలు తొంబై ఏండ్లకు విశ్వాసముంచి తన ప్రజల కొరకు ఉపవాసముండి ప్రార్థించుచూ వారి జీవితములలో దేవుని వాగ్దానం నెరవేర్చబడుట, చూసాడు. వారికి సహాయం చేయుటకు కోరెషును లేపాడు. మనకు సహాయం చేయునిమిత్తము అన్యజనులను దేవుడు లేపగలడు. దేవుడు వారికొరకు చేసిన ఒప్పందమును రీతిగా వారిమీద వర్షింపజేసాడు మన శత్రువులు మనలోనే ఉన్నారు. మన బయట లేరు. పాతవ్యక్తి తిరిగి లేవకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థచేయుడి. మనకు వెలుపట ఉండేవారు మనకు హాని చేయలేరు. మనం దీనులమై యుండి, హృదయం శుద్ధీకరించబడి యుంటే పరలోకం మనద్వారా ప్రవహించడానికి తగిన కాలువను చూడగలదు.

ఐన్‌స్టీన్‌ భౌతిక సిద్ధాంతములను కనుగొన్నాడు. వాటిద్వారా విస్తారమైన భౌతిక శక్తి విడుదల చేయబడింది. దేవుడు నీ ద్వారా అంతకన్నా గొప్ప ఆత్మీయ సూత్రముల ద్వారాను గొప్ప వర్తమానములన ద్వారాను నిన్ను ఉత్తేజపరచగలడు. ''నా ఆజ్ఞలను గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువానిని నా తండ్రి ప్రేమించును. నేను అతనిని ప్రేమించుదును. నన్ను నేనుఅతనికి బయలు పరచుకొందును''. ''కాని మీరైతే దేవుని రాజ్యమును మొదట వెదకండి అప్పుడు తక్కిన వన్నియు మీకు ఇవ్వబడును.'' ఇవిగొప్ప సూత్రాలు, వాటిని మీ జీవితములలో నెరవేర్చబడనియ్యండి.

మా యింటిలో ఉన్న కొన్ని వస్తువులను మేము విక్రయించి రిట్రీటునడపలెనని ఆశించాము. కాని కుండలోని ఆహారముగానీ, బుడ్డిలోని నూనెగానీ అయిపోలేదు. నేను దేనిని అమ్మవలసిన అగత్యతరాలేదు. ప్రార్థనే మా నిజమైన ఆధారం. పూచీ తీసుకోనే మనుష్యులమైన మాకు దానిని పరిపూర్ణముగా నెరవేర్చడానికి దేవుడు సహాయం చేసాడు.

తన సొంతవాటిని వెదికే వాడు అంతకంతకూ చిన్నవాడయిపోయి తుదకు ఎవరికీ కనబడకుండా పోతాడు. దేవుని రాజ్యము కొరకు తన్నుతాను వ్యయపరచుకొనేవాడు అంతకంతకూ గొప్పవాడై తన హృదయము లోకమంతటినీ చుట్టుకొనేవరకు ఎదుగుతుంది. కాలంతములను విశ్వాసము దృష్టిలోపెట్టుకొనును. కాలంతములను చూపించు సూత్రములను అది తెలుసుకొనును. మోషే క్రీస్తు కాలమును చూసాడు. ''వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పెట్టించెదను. అతని నోట నా మాటల నుంచుదును. నేనుఅతనికి. ఆజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. ''(ద్వితి 18:18) మోషే క్రీస్తును దూరం నుండి చూసాడు.

''రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.'' (యెషయా 27:6) ఇశ్రాయేలు చిగిర్చిపూయును అని అన్నాము గానీ యాకోబు కాదు. యాకోబు మార్చబడినాడు, అతని ఫలములతో లోకం నిండిపోవును. దేవుడు మనతో ఉన్నాడు. దేవుని గ్రహింపు కల్గి క్రీస్తు గ్రహింపుకలిగి దివారాత్రములు బ్రతుకుట ఎంతగొప్ప సంగతి!. లోకము ఎన్నడూ చూడనటువంటి వాటిని మనము చూడడానికి ఎదురుచూడాలి. దివారాత్రములు దేవుడు నిన్ను కాపాడతాడు. ఈ సంవత్సరము మీరు సాగించవలసిన గొప్ప పోరాటము ఉన్నది. నీవు సాధారణమైన వ్యక్తివికాదని నీ నడవడిలో ప్రజలు చూడాలి. దేవుడు నిన్ను తన కంటిలో ఉండే కనుపాపవలే కాపాడతాడు కనుక నిన్ను ఎవరు ముట్టిననూ గొప్ప అదుర్పాటే పొందుదురు.

మనం ఆయనను నిరూపించడానికి అప్పగించబడినవారు, ఇక్కడనుండి వేరేస్థలమునకు వెళ్ళిన ప్రతివారం ఇతరులకు ఒక సవాలు కరముగా ఉండాలి. నీవు ఆయనకు సమీపముగా నడుపుము. నీవు ఇచ్చే ఫలములు లోకము అంతటినీ నింపును. నీవు చెప్పేప్రతిమాటకు ఎదిరించేవారు నీ ప్రియులే అయి ఉండవచ్చును. నీవు దేవుని ఫలములతో నిండినవాడవయితే నీ దగ్గర నుండి నేర్చుకోడానికి ఇష్టపడతారు. నీ విశ్వాసము ప్రతి ఆటంకమును విరుగగొట్టి జయశీలునిగా నిన్ను చేయును.

మూల ప్రసంగాలు