లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

క్రీస్తు సిలువ

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెషయా 53 : 11

''అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నాసేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్ధోషులుగా చేయును''. క్రీస్తు సిలువ పెద్ద రహస్యం. లోకములో ఇతరులకొరకు శ్రమపడే యొక సిద్ధాంతం ఉన్నది. ఒక బిడ్డ బాధపడినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువబాధపడతారు. వారు ఆ బాధను తామే భరించి బిడ్డను వదలిపెట్టేలా చూస్తారు. దేవుడు కూడా తండ్రి అయి ఉండి మానవుని పాపఫలితమును తన కుమారుడైన క్రీస్తులో భరించాడు. క్రీస్తు ఆయన తన తలంపులలో కూడా పాపము చేయలేదు. ఆయన రక్తము సంపూర్ణముగా పవిత్రమైనది.

నీవు మారుమనస్సు పొందినప్పుడు ఆత్మీయముగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీవు ఒక మెట్టుకు వస్తావు. ఈ మెట్టులో నీవు ప్రతి చెడుతలంపును ఎదుర్కొంటావు. ఒక్కప చెడు తలంపుకూడా నీవు నిలువ నీయవు. యేసునామము పేరిట నీవు జయిస్తావు. క్రీస్తు అతి పరిశుధ్ధుడుగా మన ఊహకు అందనంతగా పరిశుద్దుడై యుండినాడు. లోక చరిత్రలో ఎక్కడా కూడా క్రీస్తును పోలిన వ్యక్తులను చూడలేము. క్రీస్తు ఇష్ట పూర్వకముగా మన పాపముతన మీద వేసుకున్నాడు. మన పాపముల శిక్షను ఆయన మీద వేయుటకు దేవునికి ఇష్టమైంది. ఒక మార్పు ఆయన తన నీతిని మన మీద వేసాడు మన పాపములను ఆయన మీద వేశాడు. మన పాపములను నిజంగా మనము ఒప్పుకొనినప్పుడు అవి వెంటనే క్షమించబడతాయి.

సృష్టియావత్తు ఆయన వాక్యమువల్ల జరిగింది. కానీ ఇప్పుడు క్రీస్తు మానవ శరీరముతో పరిమితిచేయబడ్డాడు. కానీ దేవుని యొక్క అనంతమైన శక్తిని నిరూపించాడు. క్రీస్తును ఓ అబద్ధికునిగా, ఓ దొంగగా, ఓ నరహంతకునిగా నిందించాడు. ఒక పాపిగా ఇష్టపూర్వకముగా చనిపోయాడు. విశ్వాసము ద్వారా నీవు సంపాదించుకొనే నీతి క్రీస్తు సిలువలో నీతినిబట్టి అంతులేనిదిగా ఉంటుంది. క్రీస్తు నోట ఏ బలత్కారములేదు. ఆయన బోధించినది ఆయన వెంబడించాడు. ఆయన చెడుకు తిరిగి చెడు చేయలేదు. మత్తయి 5 : 44 మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థించుడి.

క్రీస్తు సిలువద్వారా తప్ప ఎవరూ దీనిని వెంబడించలేదు. నీ పాపము నీలో ఉన్నంతకాలము నీవు రోమా 12వ అద్యాయమును గానీ కొండమీది ప్రసంగమును గానీ వెంబడించలేవు. కొండమీద ప్రసంగము క్రీస్తు సిలువను నమ్మిన ఒక మనుష్యుడు జీవించే సాధారణ జీవితము. ఈ జీవితము నీలో కననబడనప్పుడు నీవు విచారపడాలి. క్రీస్తు సిలువ యందు విశ్వసించనప్పుడు శరీరమునకు సంబంధించిన ప్రతిచర్యలు కూడా దురాత్మ యొక్క అధికారము క్రింద ఉన్నవి. కానీ క్రీస్తు సిలువయందు నీవు విశ్వసించిన దినమున విడుదల పొందావు. నీవు క్రీస్తు మరణమును జ్ఞాపకము చేసుకుంటే అది మన పరిపూర్ణతకు ప్రేరణ ఇస్తుంది.

ఆయన మరణమునకు కారణము మనము గ్రహించి దానిమీద మన తలంపులు నిలిపినట్లుయితే మనము పాప బంధకముల నుండి విడిపింపబడతాము - పరిశుద్దులుగాను, పరిపూర్ణమైన వ్యక్తులుగాను ఎదుగాడానికి దురాత్మకు మన మీద ఏ అధికారములేదు.

మూల ప్రసంగాలు