లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీ విశ్వాసపు మెట్టు ఎంత ?

కీ.శే. యన్‌. దానియేలు గారు

లూకా 21:11 ''కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.''

క్రీస్తు కానుకపెట్టెను, ధనికులు అయిన వారిని చూసాడు. వారి హృదయములలోనూ, వారి విశ్వాసములోనూ ఎంత భాగము దేవుని కానుక పెట్టెలోనికి వెళ్ళుతుందో ఆయన అంచనా వేసినాడు. అనేకమంది దేవునికి ఇస్తారు కానీ వారు ఇచ్చేదానిలో విశ్వాసము ఏమీ కనబడదు. దేవుని రాజ్యమును విస్తరింపచేయడానికి వారు ఇచ్చే దానిలో ఏ భాగమును సహాయము చేయదు. నీవు ఇచ్చే దానిలో ఉన్నటువంటి నీ విశ్వాసము ఎంతమట్టుకు ఉన్నది? అది నీవు వేసే డబ్బుతో పాటు అది కూడా వెళ్ళుతుందా? విలియంకేరీ భారతదేశమునకు వచ్చాడు. ఆయన దగ్గర డబ్బు లేదు. ఆయనకు సహాయం చేయడానికి బ్రిటిష్‌ రాజ్యము వారు తొమ్మిది వేలు రూపాయలు ఇచ్చాడు. కానీ అది ఆయనను ఒక కళాశాల నిర్మించుటకు గానీ, ఒక అచ్చుయంత్రం కొరకు కానీ, దేవుని సేవ కొరకు కానీ సహాయం చేయదు, ఆయన కష్టపడి పని చేసి ఆరు లక్షలు సంపాదించాడు. నీవు ఇచ్చుటలో విశ్వాసపుమెట్టు ఎంతమట్టుకు? అనేకమంది దేవునికి డబ్బు ఇస్తారుకానీ దానితో వారు తృప్తిపడి పోతారు. ఆ ఈవులను దేవుడు చూస్తారు. కానీ దానిలో విశ్వాసం లేదని ఆయన దు:ఖిస్తారు. పరీక్షలు వచ్చినప్పుడు వాటి ద్వారా నీవు వెళ్ళ వలసి వచ్చినప్పుడు నీలో విశ్వాసం లేనట్లు నీవు చూసుకుంటావు. ఒకప్పుడు కేరీ దగ్గర డబ్బు లేకుండా ఉండింది. ఆయన ఒక పరాయి దేశములో ఉండినాడు. ఒక వ్యాపారస్థుడు తన గృహములోనికి తీసుకొని ఆయనను చూసుకున్నాడు. అక్కడనుండి ప్రభువుకు సేవచేయడం ప్రారంభించాడు. ఎక్కడకు వెళ్ళితే అక్కడొక దీవెనగా ఉండినాడు. విశ్వాసము కలిగినవాడు ఎక్కడకు వెళ్ళినా సరే ఒక దీవెనగా ఉంటాడు. ఆయన పేదవాడు అయినప్పటికీ అది ఆశీర్వాదాన్ని నిలుపు చేయదు.

అనేక రకములైన సేవకులు మనకుండినారు. కొంతమంది వారికి వచ్చే కూలి నిమిత్తము పాటుపడ్డారు. దేవునికి మనతో పాటు సేవ చేయడానికి పూనుకున్నారు. అనేక సం||లు సేవచేసిన వారు తన ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు నిరాశకు లోనయ్యారు. తాను బాగానే సంపాదించాడు కానీ తన భార్య జబ్బున పడింది. అతడు మనలను విడిచిపెట్టి వెళ్ళిబాగా డబ్బు సంపాదించగలిగిన స్థలము ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. అతడు బాగానే సంపాదించాడు కానీ అతని భార్య జబ్బున పడింది. అతడు తన మట్టుకు తాను బంగారం అనే దెయ్యం చేత పట్టుబడ్డాడు. మనతో ఉండిన సమయం విలువైనదిగా యెంచిన మరి యొక సేవకుడు సువార్తను తన గ్రామమునకు తీసుకు వెళ్ళాడు. తన ప్రజలకు ఎంతో దీవెన తెచ్చాడు. ఈ సేవలో తన సొంత డబ్బు వినియోగించాడు.

ధనికులు దేవుని సేవలో తమ్మును తాము ఖాళీ చేసుకుంటే వారు నింపబడతారు. దేవుడు వారిని గొప్ప సంతోషముతో నింపుతారు.

ప్రజలు దేవునికి అర్పించే సమయములో క్రీస్తు వారిని గమనిస్తూ ఉండినారు. ఒక విధవరాలిని చూసాడు. ఆమె నిజముగా విధవరాలే కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారికి భర్తలు ఉన్నారు. వారి భర్తలు జీవించి ఉండగానే వారి స్త్రీలు విధవరాండ్రవలే ప్రవర్తిస్తారు. వారి భర్తలు వారిని ప్రేమించడమో, లేక వారి మీద లక్ష్యముంచడమో చేయరు. వారికి తొందరలు కలిగినప్పుడు ఎవరికి మొర్ర పెట్టవలెనో తెలవదు. ఇదే పరిస్థితిలో ఉన్న మరి కొందరు ఉన్నారు. వారు దేవుని యెదుట సణగరు. వారు దేవునియందు విశ్వసిస్తారు. ఆ తొందరను దేవుడు రానిచ్చినాడు అని వారు అనుకుంటారు. యేసు క్రీస్తు వారి ప్రక్కన ఉన్నాడు. కనుక, ''నేను దేవున్ని ఈ పరిస్థితులలో ఎలా మహిమపర్చగలను''. అని వారు అనుకుంటారు. పండిత రామా భాయి భర్త చనిపోయాడు. అప్పుడు ఆమె విధవరాలు మాదిరిగా ప్రవర్తించిందా? ఆమె నిరాశపడిందా? ఆమె ప్రార్థనలద్వారా ఎంతమంది మిషనరీలు ఉజ్జీవింపబడ్డారు? ఆమెకు ఉండిన విశ్వాసము చాలా గొప్పది. ఒక పరిశుద్దురాలయిన స్త్రీ ప్రార్థించేటప్పుడు ఎంత ఆశ్చర్యకరము. దూతలు సహితము ఈలాంటి స్త్రీకి విధేయత చూపించును. ఒక భర్తను పోగొట్టుకున్నట్లయితే అది పెద్ద విపత్తు కాదు. ''నేను దేవునికి సేవ చేయగలను. నేను ఆ హృదయం మీద నమ్మకం పోగొట్టుకున్నాను. నా బిడ్డలు దేవునికి విధేయులు అయ్యేటట్లు నేను నేర్పిస్తాను.'' వారు చెప్పగల్గినదానికి ఇదొక సూచన.

సామెతలు 4:25 ''నీ కన్నులు ఇటు అటు చూడక సరిగానూ, నీ కనురెప్పలు నీ ముందర సూటిగానూ చూడవలెను.'' నీ హృదయమును గురించి జాగ్రత్త తీసుకో ఈ విధవరాలు తన హృదయమును జాగ్రత్తగా చూసు కొనింది సోలోమోను అయితే తన హృదయమును జాగ్రత్తగా చూసుకోలేదు. పేరోదు ఒక పెద్ద దేవాలయమును నిర్మించినప్పుడు శిష్యులు క్రీిస్తు ప్రభువుకు రాళ్ళను చూపించారు. క్రీస్తు చెప్పాడు ఒక దినమున ఈ రాళ్ళన్నీ బద్దలగు పేరోదు ఒక వ్యభిచారి.ఒక నరహంతకుడు అయినప్పటికీ ఆయన దేవాలయమును కడుతూ ఉండినాడు. పాపములో జీవించేవారు సంఘమునకు డబ్బు ఇస్తే వారి మాదిరి ఎంతో నష్టము కలిగిస్తుంది. కనుక దేవుడు ఆ అర్పణను అంగీకరించడు. యౌవనస్తులందరూ మాదిరిని చూసి ప్రభావితులౌతారు. ప్రార్థనా మాసమయిన జూన్‌ వచ్చింది. మనం ఏడ్చి ప్రార్థన రాత్రింబవళ్ళు చేయాలి.

దావీదు సొలోమోనుకు సలహా ఎంత ఇవ్వగలడో అంత ఇచ్చినాడు, కానీ సొలోమోను హృదయము ఆయన వివాహము చేసుకున్న స్త్రీల ద్వారా లాగి వేయబడింది. తన హృదయమును జాగ్రత్తగా చూసుకొమ్మని దావీదు సొలోమోనుకు హెచ్చిరిక ఇచ్చాడు. నీ హృదయము ఎలాగు ఉన్నది? ఆమె రెండు కాసులు అందులో వేసినప్పుడు విధవరాలి హృదయము పరిపూర్ణముగా ఉండింది. ఆమెకు ఉండినది అంతా రెండుకాసులే ! నీవు సమస్తమును ఇవ్వగలవా ? ఎక్కడో ఒక మూలలో నీవు ఇవ్వలేనిది దాచిపెట్టాలని ఆశిస్తావు. విధవరాలు తన హృదయములో చెప్పింది.'' దేవుడు నాతో ఉన్నాడు అంతే చాలు.'' నీవు వార్త పత్రికలు చదివేటప్పుడు నీ హృదయమును భద్రముగా చూసుకుంటావా? ఎగువ తరగతికి చెందిన ప్రజలతో నీవు కలిసి తిరిగేటప్పుడు వారు వేసుకునే వస్త్రములు, వారి జీవిత విధానము నిన్ను ఆకర్షిస్తుందా? వారి వలే ఖర్చు చేయుటకు నీవు డబ్బును అప్పు తీసుకుంటావా? నీలో ఏదోలోపం ఉంది. నీ హృదయము గురించి భద్రం. అది దేవుని ధననిది. దాని లోనుండి గొప్పపాటలు రావచ్చు. అవి లోకములో ఉండే ప్రజలందరినీ ఉత్తేజపరుస్తాయి. వెస్లీగారు వ్రాసిన కీర్తనలు గొప్పవి. నా కొరతలు ఈ కీర్తనలలో వెలువరించబడ్డాయి. నేను మోకరించి ప్రార్థన చేసేటట్లుగా చేసాయి.

మన విశ్వాసము ఎక్కడ ఉన్నది? ఈ విధవరాలు తన విశ్వాసములో గట్టిది. క్రీస్తు దానిని గుర్తించాడు. నీవు విశ్వాసములో బాగా ఉంటే దేవుడు దానిని గుర్తిస్తాడు. మనము ఈ పట్టణమునకు వచ్చినప్పుడు దేవుడు ఈ వాగ్ధానము మనకు ఇచ్చాడు. 2 దివృ 7:15 ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకను దృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థముకాదు. నా భార్య నేను చేసిన దీనమైన ప్రార్థనలు ఈనాడు నెరవేరుతున్నాయి. విశ్వాసపుమెట్టు నీ ప్రార్థనలో ఉండుటను బట్టి అది పోగొట్టకొనకూడదు. దేవుని కన్ను నీ గృహము మీద ఉన్నది. దావీదు దాన్ని ఒకసారి పోగొట్టుకున్నాడు. నీవు కూడా పోగొట్టుకోవచ్చు. నిజమైన విశ్వాసం ఎన్నడూ దేవునితో ఉండే సంబంధమును పోగొట్టుకొనదు.

విధవరాలి హృదయము దేవుని దగ్గర ఉండింది. ఇలాంటి స్త్రీని ఏ ప్రార్థన గుంపులో అయినా మంచిది. జాన్‌వెల్ల్సీ గారు పరిశుద్ధపరచబడిన కొందరు మనుష్యులను కలిగి ఉండినాడు. వారు దేవునితో ఎంత సమీపముగా నడిచినాడు అంటే వారితో తన్నుతాను పోల్చుకోలేను అని చెప్పినాడు. వారి పరిశుద్ధతను చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇలాంటి స్త్రీ ఒక ధనాగారములాంటిది. ఒక స్త్రీ దేవునిని గట్టిగా పట్టుకుంటే ఆమె యధార్థ పరురాలుగా ఉండగలదు. ఒక మనుష్యుడు దేవునిని ప్రేమించే ఒక స్త్రీని భార్యగా పొందగల్గితే అతను ఒక గొప్ప ధనాగారమును సంపాదించుకొనినట్లు. విధవరాలు ప్రభువుతో సరిగా ఉండింది. రెండు కాసులు ఆమె అర్పించటానికి వచ్చినప్పుడు ఆ ముఖము ప్రకాశిస్తూ ఉండి ఉండవచ్చు. ఆమె క్రీస్తును చూసినప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉండిందో మనము చెప్పలేము.

క్రీస్తుకు డబ్బు అవసరము లేదు, కానీ ప్రజలు కానుకలు వేస్తుండగా గమనించాడు.ఈ విధవరాలు తన దగ్గర ఉండిన రెండు కాసులు వేసినప్పుడు ఆమెను మెచ్చుకున్నాడు. క్రీస్తు మన హృదయము వైపుకు చూస్తాడు. యెహోషువ సూర్యుడు నిలుచును గాక అని చెప్పినప్పుడు దేవుడు అతనితో ఉండినాడు. అతని హృదయము దేవునితో సరిగా ఉండింది. అతని స్వరము దేవుని స్వరము.

నీ హృదయము ఎలాగున్నది? నీవు గుడికి వెళ్ళినప్పుడు నీ మనస్సు ఎలాగున్నది? ఆలయములో నేను గడిపిన సమయము ఎల్లప్పుడు కూడా విలువైనదిగా ఎంచును. మనము సంపూర్ణముగా పవిత్ర పరచబడుదుమా? జకర్యా 3:7,4:14, ఒక భార్యా భర్తలు దేవుని చేత ఈలాగు అంగీకరించబడితే అది ఒక దీవెనెల నీవు నిరాశ పడే విషయము ఏమీ లేదు. క్రీస్తు తిరిగి లేచినాడు. ఆయన నీతో ఉన్నాడు. నీ హృదయమును పూర్తిగా దేవునికి ఇచ్చివేయి. ఈ విధవరాలు తన సమస్తమును దేవునికి ఇచ్చింది. నీ హృదయమును నీవు శుద్దీకరించుకొంటూ ఉంటే నీవు నీ గృహాన్ని శుద్దీకరించు కుంటావు. నీ బిడ్డలు ఒకరి వెనుక ఒకరు మార్చబడతారు. ఏ హాని నీకు ప్రవేశించదు. పరలోకపు గోడలు నీ చుట్టూ కట్టుకో గలవు. కొంతమంది విధవరాండ్ర బిడ్డలు బలవంతులైన మనుష్యులు అయ్యారు. కొంతమంది యౌవనస్థులు లేచి నీ గృహమును మార్చనీమ్ము. నీ హృదయమును శుధ్ధీకరించుకుంటూ ఉండు. నీ ద్వారా పరలోకపు కృపలు శక్తీ వచ్చును. మనుష్యులు నిన్ను ఎదిరించలేరు. భక్తిహీనులైన తల్లిదండ్రులు నీ భక్తికి ఎదురు చెప్పలేరు. విజయమునీది. నీవు దేవుని వాక్యమందు నమ్మిక యుంచు చున్నావు.

మూల ప్రసంగాలు