లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

శోధనను ఎదిరించుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఆదికాం 3 : 4 ''మీరు నిశ్చయముగా మరణించరు''

మన మొట్ట మొదటి తల్లిదండ్రులు సాతాను యొక్క స్వరము విన్నారు. ఆ దురాత్మ వారి దగ్గరకు ఎందుకొచ్చాడు? అవ్వ నిషేదించబడిన పండు దగ్గర నిలబడి యుండింది. ఆమె పండ్లను గమనించింది. దాని వాసన ఇష్టపూర్వకముగా ఉండింది. ఆ పండు తినడానికి మంచిదా కాదా అని ఆమె తన జ్ఞానమును ఉపయోగించింది. నీవు ఒక శోధనకు ఎదురుగా నిలువబడినప్పుడు దానిని అక్కడ ఒదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీవు అక్కడ నిలబడిదాని గురించి వాదన చేయకూడదు. దాని ఆకర్షణకు నీవు తట్టుకోకపోవచ్చు. సాతాను శోధనను చిత్రీకరిస్తాడు నీవు శోధనకు సమీపముగా వచ్చినప్పుడు సైతాను నిన్ను కనిపెడతాడు. అది చెడ్డ స్నేహితుల గుంపు అయితే వారి దగ్గరకే వెళ్ళకూడదు. నీవు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ప్రజలకు నేను ఒక ఆశీర్వాదముగా ఉండగలనా అని ఆశీర్వాదించాలి. అవ్వ ఆ చెట్టు సమీపముగా వచ్చింది. సైతాను దాన్ని గమనిస్తూ ఉండినాడు. బైబిలు నీకొక విషయమును గూర్చి తప్పు అని చెప్పితే అది కొన్ని పరిస్థితులలో ఉండవచ్చును, అని వివాదము చేయవద్దు. సైతాను నీ హృదయమును గమనిస్తూ ఉన్నాడు. అవ్వ దుష్టత్వము గురించి ఆలోచించే విషయములో మహాతెలివిగల వారితో ఆమె వాగ్వాదము చేయగోరింది. ఈ స్త్రీ యొక్క అవిధేయత ద్వారా ఎంత గంభీరమైన దుష్ట పరిణామములు ఏర్పడినవో! ఒకసారి నేను కళాశాలకు వెళ్ళేటప్పుడు ప్రభువు నాతో చెప్పారు. ఒక ప్రత్యేకమైన ఇంటిని దాటి వెళ్ళవద్దని. వెంటనే నేను నా దారిని మార్చాను. అది చాలా చుట్టు దారి అయినా ఫరవా లేదు. నా తరగతిలో చదువుతున్న ఒకడు ఆ ఇంటి పాపములో పడ్డాడు. అతని జీవితము నాశనం అయిపోయింది. నీవు పాపపు ఇంటిని దాటి కూడా వెళ్ళ వద్దని దేవుడు చెప్పుతున్నాడు.

నీవు ప్రార్థనలో తగ్గినప్పుడు నీవు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళతావు. నీవు అలాంటి తప్పుడు స్థలములకు వెళ్ళినప్పుడు నీవు సంతోషముగా ఒక ప్రార్థన గుంపులో కలుసుకోలేవు. నీ పాపము ఒప్పుకొనుటకు బదులుగా నీవు వివాదము చేస్తావు. నీ కొరకు ఎలాంటి శోధనలు కాచుకొని ఉన్నాయో సైతాను ఏ రీతిగా నిన్ను నాశనము చేయాలని ఎదురుచూస్తున్నాడో ఎరుగుదువా? ప్రార్థనకు నీయందు ఆశ లేనప్పుడు నీవు నాశనమునకు వెళ్ళుతున్నావని నిశ్చయమైన గుర్తు.

దేవుని గొప్ప ఏర్పాటులు తాను నిలువకూడని స్థలములో నిలుచుట వలన ఒక స్త్రీ పాడుచేయుచున్నది. ఆదాయు, హవ్వలు ప్రతిదినము దేవునితో సహవాసము చేస్తూ ఉండినారు. అలాంటి సహవాసము చేకంగా మారిపోవచ్చు. ఇది జరిగినప్పుడు అపాయకరము వారు సాయంకాలము వరకు కనిపెట్టి దేవునితో ఆ విషయమును గూర్చి చర్చించి యుండవచ్చు. కానీ సైతాను యొక్క పద్దతి ఎప్పుడూ తొందరపాటు. నేను చేసిన ప్రతిదానికి దేవుడు నన్ను శెలవు తీసుకోమనేవా. ఎప్పుడైతే నేను అలాగుచేసానో మా జీవితములో అపజయము అనేది లేదు. ఆదాము హవ్వలు సౌందర్యవంతమైన ఆ ఉద్యానవనమును పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో ఉండే సౌకర్యమును గూడా.

సైతాను యేసు దగ్గరకు కూడా వచ్చాడు. ఆ సమయానికి క్రీస్తు 30 సం|| ఆత్మీయముగా ఎదిగాడు. 40 దినములు ప్రార్థనలో గడిపాడు. సైతాను దేవుని వాక్యమునే వాడి ఆయనను ఓడించాలని చూసింది, కానీ క్రీస్తు సైతానును ఓడించాడు. తిమోతి.

మోసపుచ్చే ఆత్మలు ఉన్నాయి. నీ జీవితములో కొంత విజయము వచ్చినప్పుడు మోసపుచ్చు ఆత్మలు సలహాదారులుగా వస్తాయి - వెలుగుదూతలవలే. వాటి వెనుక నిన్ను నాశనం చేయగల నల్లని ఆత్మలు వస్తాయి. నేను చిన్నపిల్లవానిగా ఉండినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేసిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. కాని వారు పాపములోకి వెళ్ళి పోయారు. అలాంటి ప్రజలు దేవుని పల్లలందరినీ సందేహించి నమ్మలేరు.

నీవు ఎలాంటి సహవాసములో ఉన్నావు? ఏ ఇంటిలో నీవు ఉన్నావు? ఎవరితో సంభాషిస్తున్నావు? యౌవన దశ నీ ఆత్మీయ జీవితమును వృద్ధిచేసుకోవడానికి ఒక శ్రేష్టమైన సమయము. నీవు శాశ్వతముగా పాపమును ద్వేషించాలి. ప్రార్థన అంటేవిసుగ వద్దు. నీ ప్రార్థన బలము రానున్న దినములలో అనేక ఆత్మలకు బలముగా ఉంటుంది.

నీవు పాపము చేసినప్పుడు నీవు క్షమాపణ అడుగుతావు. నీవు క్షమించబడవచ్చు కాని నీవు ప్రతిసారీ అలాగు చేసినప్పుడు నీవు కొన్ని ఆత్మలను పోగొట్టుకుంటావు. కొన్ని సార్లు నీ బిడ్డలనే మనము ఆయనకు విధేయులము అయినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనయందు ఉంటాడు.

మూల ప్రసంగాలు