లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నా కన్నులు తెరువుము

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తన 119:18

''నేను నీధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.'' ఎలాంటి ఆశ్చర్యకరమై విషయములను మనము బైబిలునందు కనుగొనగలము! మనం దేవుని వాక్యము చదివేటప్పుడు నీవు ఒక పాపివి అని నీకు అర్థం తెస్తుంది. ఈ గ్రహింపులో గొప్ప మేలు ఉంది. నీవు తప్పులు చేసేవాడివి నీవే అని నీవు తెలుసుకోకపోతే ఈ మనిషినీ ఆ మనిషిని నిందిస్తావు. నీ భార్య పిల్లలను నిందిస్తావు. నీవు చీకటిగల దేశములో నివశించుచున్నావు. నీవు సైతాను యొక్క చేతులలో ఉన్నావు. నిన్ను నాశనము చేయడమే అతని పని, పాపములో జీవించుచున్న అనేకమంది యౌవనస్థులు నన్ను తమ మార్గములోనికి లాగాలని చూసారు. అది దేవుని మార్గముకాదు. కనుక నేను వారిని వెంబడించలేదు, బైబిలులో గొప్పధనము ఉన్నది. నీ పాపములు క్షమించబడితేనే తప్ప నీవు ఆ ఐశ్వర్యాన్ని చూడలేవు. నీ పాపములు నీవు ఒప్పు కొన్నట్లయితే నిన్ను క్షమించి శుద్దీకరించడానికి సిద్దముగా ఉన్నాడు.

నేను ఒక పాపిని అని చాలామంది చెప్పుతారు. వారు తమపాపమును ఒప్పుకొని, మనస్సాక్షిని శుద్దీకరించుకోరు. మనము పాపులమని ఒప్పుకుంటే సరిపోదు. మనము మన పాపములను ఒప్పుకోవాలి, మేము పాపులము అని చెప్పుకొనుటలో ప్రయోజనము ఏమీలేదు. ఒక స్త్రీ వచ్చి క్రీస్తు పాదములు కడిగింది. ఈలాగు ఆమె తన పాపములు ఒప్పుకొంటూ ఉంది. ఇంకా పాపములు ఒప్పుకోవడం అవసరం లేదు. ఎందుకంటే ఆ పట్టణం అంతటా ఆమె పాపములు ఎరుగుదురు. దేవుని వాక్యము నా పాపమును తేటతెల్లంచేసింది. నేను ఒప్పుకున్నాను ఆమెకు శుద్ధమైన మనస్సాక్షి దొరికింది. దేవుని యొద్ద నుండి ఒక వాగ్దానం నీకు దొరికిందా? నీ పాపములను చూసుకోవడానికి నీ కనులు తెరవబడ్డాయా? నీ ధనాగారం ఏమిటి? దేవుని వాగ్దానములు నీ దగ్గర ఉన్నాయా? సైతాను నీ కన్నులకు గుడ్డితనం కలుగజేసాడు. దేవుడు వాటిని తెరిచేటట్లు సెలవియ్యి. నీ పాపము తీసివేసుకో, అప్పుడు నీ గృహమునుండి బయటకు వెళ్ళే ప్రతిదీ ఆశీర్వాదం అవుతుంది. దేవుని యందు అధ్భుతకరమైన విషయాలు నీ కొరకు దాచబడిఉన్నాయి. దేవుడు నాకు ఒకే విషయం నేర్పాడు - నేను ఏకాంతముగా వెళ్ళి ప్రార్థనచేయుట. ''దేవుని సమయమును దేవునికి ఇచ్చివేయ్యాలి - నేను వెళ్ళి దేవుని కలుసుకోవాలి. నా తప్పిదములను నేను తెలుసుకొనుటకు సహాయం చేసాడు.

దేవుడు నన్ను పవిత్రునిగా చేసి యోసేపువలే చేస్తానని ఒప్పుకొన్నాడు, యోసేపుకు ఉండిన ధనము నాకు అక్కరలేదు, నా ప్రభువు మానవులందరికన్నా ధనవంతుడు, ఆయన నాకు కావాలని కోరాను. ''మా తండ్రి'' అని నేను ప్రార్థించేటప్పుడు నిజముగా నేను ఆయనను తండ్రి అని భావిస్తాను. గలతీ 5 : 22, 23 దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఆత్మ ఫలమేమనగా, ప్రేమ సంతోషము, సమాధానము దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము, ఇట్టివాటికి విరోధమైన నియమమేదియూ లేదు.

సాలు రాజయ్యాడు, అతడు రాజ్యము మట్టుకే చూసాడు, తన కుమారులకు ఆ రాజ్యము మట్టుకే కోరుకున్నాడు. అతడు దేవుని కొరకు వాంచించలేదు - తన కొరకు, తన కుమారుల కొరకు ఆయనను సొంతముచేసుకొనుట. తన కుమారులు యౌవనస్థులుగా చనిపోయారు.

యౌవన స్త్రీ నీ ధనము నీ పుస్తకములో ఉన్నది. నా కళాశాల దినములలో అనేకమైన వాగ్దానములు పొందాను. అవి ఇప్పుడు నెవవేరుతున్నాయి. మనలో ఎంతమందిమి దేవుని రాజ్యములో అడుక్కుతినే వారిమిగా ఉన్నాము. మనము ఇది అది భూ సంబంధమైన ఈపుల కొరకు అడుగుతాము. కాని నిజమైన ఆయన ధనముకొరకు అడుగము - ఆయన వాగ్దానములు, మూడు ఎం.ఎ. డీగ్రీలు, 2 పి.హెచ్‌.డి డీగ్రీలు కలిగిన ఒక వ్యక్తి నాదగ్గరకు అడుక్కుతినేవాడిగా వచ్చాడు. ఆయనకు ఉండిన విశ్వాసపులేమి గొప్పది. నీవు పశ్చత్తాప పడితే నీకు ధనము కాచుకొని ఉన్నది. నీవు ప్రభువును ఎరిగితే ఎంత ధనవంతుడి వో! క్రీస్తు కలిగిన వారు నిజముగా ధనవంతులు, ప్రార్థనచేద్దాం - ''బైబిలులో ఉన్నటువంటి ధనమును చూడడానికి నా కన్నులు తెరువుము''.

మూల ప్రసంగాలు