లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నాతో ప్రభువా అని పిలుచుప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు

కీ.శే. యన్‌. దానియేలు గారు

మత్తయి 7:1-29

''ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగానీ''.

క్రైస్తవత్వము చిట్ట చివరగా దేవుని చిత్తము చేయుట అనే దానికి తగ్గించబడింది. దేవుని వాక్యమును సులువుగా దాటిపోవడానికి వీలులేదు. ఒకని వృత్తికిని, అతని జీవితమునకును మధ్య ఎంతో బేధము ఉన్నది. కొన్నిసార్లు ప్రార్థన సాధనగాను, అనుకరణగానూ మారిపోతుంది. మనము పద సముదాయమును నేర్చుకొని వాటిని వాడతాము. క్రైస్తవ సంఘము దానితో నిండియున్నది. మనము ఆయనను ప్రభువా అని పిలుస్తున్నాం. ప్రభువు అంటే సంపూర్ణమైన యాజమానుడు అని అర్థము. ఆయన మనకు సంపూర్ణముగా యజమానుడుగా మారినప్పుడు దేవుని రాజ్యము యొక్క ప్రత్యేక అధికారములు మనవగును. నీ మాటలలో నీ క్రియలలో ఇతరులతో నీకుండే సంబంధములో నీవు కుడికి గానీ, ఎడమకుగానీ ఆయన చిత్తములేకుండా తిరగలేని వాడివైతే దేవుని రాజ్యము యొక్క అధికారములు మనవగుతాయి. ఆ రాజ్యము ప్రత్యేక అధికారములును, పూచీలను కలిగినది. మనము ఇరుకైన మార్గము ద్వారా ప్రవేశించవలెను. పశ్చత్తాపము మన మానసికస్థితిని దేవునిని నమ్మి విధేయులము అయ్యేస్థితికి తెస్తుంది.

అధ్బుత కార్యములు చేసి దయ్యములను వెళ్ళగొట్టి యేసునామమును వినియోగించుకొని ఇవి అన్నీ చేయవచ్చు. కానీ మనము ఆయనను ప్రభువుగా చేయము. మనము దేవునిని సంపూర్ణ యజమానునిగా చేసినట్లయితే మనము సంపూర్ణముగా పరిపాలించే వారమవుతాము, మోషే దేవునిని సంపూర్ణ యజమానుడిగా చేసుకున్నాడు. మోషేే సంపూర్ణమైన పరిపాలకుడు అయ్యాడు. ఆయన, యెహోషువ దేవుని వాక్యమును ధ్యానించి దానికి విధేయులు అవ్వాలని దేవుడు శెలవిచ్చాడు. సృష్టి సహితము దేవుని రాజ్యము యొక్క పద్దతులను అనుసరించే వారిని గమనిస్తుంది.

అమెరికాలో సుళువుగా నిన్ను వారి తీరము మీద నిలువడానికిగాని, అక్కడ నివశించడానికి గానీ ఒప్పుకోదు. అమెరికా పురవాసులుకు అనేకమైన అధికారములు ఉంటాయి. తగినటువంటి కాగితములు చూపించకుండా నీవు ఆ దేశములో ప్రవేశించలేవు. దేవుని రాజ్యములో ప్రవేశించగోరు వ్యక్తి కచ్చితముగా మారు మనస్సు పొందాలి. నీ హృదయమంతటితో ఒక్క అడుగు ముందుకువేసే ఆయన తొమ్మిది అడుగులు నిన్ను ముందుకు తీసుకువెళతాడు. ఆయన కృపలో నిన్ను మోసుకు వెళ్ళతాడు. ఆయనే నిన్ను మోసేవారు. ఇక నీవు జీవించేది నీవు కాక క్రీస్తే నీయందు జీవించుచున్నాడు అని నీవు జాగ్రత్త తీసుకుంటావు. పనిచేసేవాడివి నీవు కాదు. క్రీస్తే నీయందు పని చేస్తాడు.

మార్కు 10:19, 20 ''నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. దొంగిలించవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియునుగదా అని అతనితో చెప్పెను. అందుకతడు బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను''. ఈ ధనికుడైన పరిపాలకుడు చిన్ననాటినుండి ఆజ్ఞలకు విధేయుడనయ్యానని ఒక తప్పుడు తృప్తి కలిగి ఉండినాడు. ప్రజలు అనేక సం||క్రితము మారుమనస్సు పొందినట్లుగా తప్పుడుగా భావిస్తారు. దానికి నిరూపణ ఎక్కడ? ఇది యొక్క ప్రత్యేక అధికారము కలిగిన జీవితము, నీవు దేవుని రాజ్యమునకు ఒక సభ్యుడవు. క్రీస్తును, ఆయన తండ్రియు వచ్చి నీతో నివాసము చేయుదురు. సంపూర్ణమైన విధేయత ద్వారా మనము ఈ ప్రత్యేక అధికారములను అనుభవిద్ధాం. మనుష్యులు నిన్ను తిట్టి, నిన్ను హింసించినప్పటికీ దేవుని వాక్యమునకు విధేయుడవు కమ్ము. ఎవరో నిన్ను సంతోషము, విజయము గల స్థానంబునకు ఎత్తడము నీవు గమనిస్తావు.

మూల ప్రసంగాలు