లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

యోసేపు ఫలించెడి కొమ్మ

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఆది కాం|| 49 : 22 '' యోసేపు ఫలించెడి కొమ్మ''

నీవు ఫలించెడి కొమ్మవైతే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నా తోటలో ఒక చెట్టు ఫలించాలని 10 సం|| కాచుకొని యుండినాను. కానీ ఏ పండ్లూ కనబడలేదు. కనుక దానిని వంట చెరుకుకై కొట్టివేయమన్నాను. అది సులువుగా నరికి వేయబడింది. ఏ క్రైస్తవుడు అయినా తన జీవితంలో సంపాదించిన డబ్బును ఖర్చుచేయవచ్చు. అతడు ఒక ఇంజనీరు అయి ఉండవచ్చు. కానీ అతని జీవితం యొక్క విలువ వంట చెరుకుతో సమానం. యోసేపు వంట చెరుకు కాదు కానీ ఒక ఫలించెడి కొమ్మ. ఆ కొమ్మ నుండి తండ్రి, తన సహోదరులు, ఇతర బంధువులు ఫలములు భోంచేస్తూ ఉండినారు. ఆయన జీవితంలో వచ్చిన ఫలములు వారిని బ్రతికించినవి. ఐగుప్తు అంతటికి, చుట్టుప్రక్కల ఉండే దేశానికి కూడా భోజనం దొరికింది. ఐగుప్తు దేశము అంతయూ దానిచుట్టు ప్రక్కల దేశం కూడా ఆహారం దొరికింది. ఈ నాటికినీ గొప్ప అతడు ఒక ఫలించెడి కొమ్మ, యౌవనస్థులకు వృద్ధులకు అతడు మంచి ఉదాహరణగా ఉండినాడు. ఆయన బలమైన మాదిరి, యాకోబు తన సొంత కుమారుడు ఒక ఫలించెడి కొమ్మగా ఉండడం చూసాడు. అతడు చాలా సంతోషించాడు. అతని కుమారుడు అతని గృహాన్ని కరువు కాలంలో కూడా నింపాడు. నేను విశాఖపట్నంలో పక్షవాయువుగల ఒక వ్యక్తిని కలుసుకున్నాను ఆయనకు ఒక మంచి కుమారుడు ఉండినాడు. వస్తు సంబంధమైన అవసరలు అన్నీ అతడు తీర్చాడు. కూనూరులో ఒక వ్యక్తి పూచీలేని ఒక కుమారుని గూర్చి నాతో చెప్పాడు. నేను అతనిని అడిగాను. ''మీకు కుటుంబ ఆరాధన ఉన్నదా? నీ కుమారునికి దేవుని వాక్యం నేర్పించావా?'' దేవుని వాక్యం భోదించుట ఆరంభించారు. దేవుని వాక్యమే పిల్లలు ఫలించేదిగా చేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులకు దేవుని వాక్యం నేర్పించే ఆశ లేదు. తమ పిల్లలకు దేవుని వాక్యము మిమ్ములను ఫలించేదిగా చేస్తుందని చెప్పరు. దేవుడు హోషెయాలో ఇట్లు చెప్పుతున్నాడు. ''నీవు నా నిబంధనను మరచిపోయావు. నేను నిన్ను మరచిపోతాను''. దేవుని వాక్యం నీ హృదయ అంతర్భాగములో లేక పోతే నీ జీవితంలో ముఖ్యమైన విషయాలగూర్చి దేవుడు శ్రద్ధ వహించడు.

ఇంగ్లాండులో ఉన్న పురాతన వంశం, దేవుని వాక్యం మీద విశ్వాసము ఉంచారు. ఇప్పుడైతే వారు తుపాకుల మీదను ఆటంబాంబుల మీదను తమ దృష్టిని ఉంచుతున్నాడు. ఆ దినములలో వారు జాతీయ విపత్కాలముల గూర్చి ఒక ప్రార్థనా దినమును ఏర్పాటుచేసేవారు.

దేవుని వాక్యముపైన విశ్వాసము ఉంచని కుటుంబము నాశనము అవును. దేవునియందు విశ్వాసము ఉండదుగాని కాలేజీలలో సీట్ల కొరకు పెద్దగా దేవునికి ప్రార్ధన చేస్తారు. ఒక జిల్లా న్యాయాధిపతిగారు తన జీవితం నుండి దేవునిని వదలివేశారు. చాలా కష్టపడి అతడు క్రైస్తవ భూ స్థాపనకు ఒప్పుకున్నాడు. అతడు ఒక వంటచెరుకు వలే ఉపయోగించే క్రైస్తవుడు.

మన బిడ్డలు మృదువైన వయస్సులో ఉన్నప్పుడు మనం వారికి దేవుని వాక్యం అందించాలి. ద్వితి. 11 : 18-20 వరకు, బిడ్డలను నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు వారిని త్వరగా సమాధికి సిద్దముచేస్తున్నారు. అనేక క్రైస్తవ గృహములలో దేవుని యెడల భయభక్తులు లేవు. సినిమా, పాప సహితమైన ప్రేమ పిల్లలకు నేర్పించును. నవలలు వ్యభిచారమును నేర్పించాయి. నా కళాశాల దినముల నుండి దేవుడు నన్ను చెడుగునుండి కాపాడినాడు. దేవుని వాక్కు నా చేతులలోనూ నా హృదయంలోనూ ఉండినవి.

యోసేపు ఏలాగా ఫలించెడి కొమ్మగా మారాడు? తండ్రియొక్క మాదిరి లేకుండానా? లేదు. తండ్రియైన యాకోబు ఇటీవలెనే ఇశ్రాయేలుగా మారాడు. ఒక యువరాజులాగా దేవునితో కుస్తీపట్టాడు. యాకోబు తండ్రి పరిశుద్ధుడైన మనుష్యుడు అయినప్పటికీ యాకోబు మోసము అవలంబించడానికి నేర్చుకున్నాడు. అతని తల్లి శీలము అతని శీలము మీద పని చేసింది. రిబ్కా మట్టుకే యాకోబు తన మేనమామగారి ఇంటికి పరుగెత్త వలసి వచ్చింది.

అతడు క్రొత్త స్వభావంతో పరుగెత్తుతున్నాడా? లేదు. మోసకరమైన స్వభావముతోనే అక్కడ అల్లుడు, మామగార్ని మామగారు అల్లుడ్ని, మోసం చేసుకున్నారు. కుమార్తెలు యాకోబు పక్షం వీలుకరముగా ప్రవర్తించారు కానీ అది గొప్ప కీడును తెచ్చింది. యాకోబు హృదయంలో మోసం ఉన్నందు వల్ల ఇంటిలో సమాధానం లేదు.

నీలో (నూటికి) ఒక్క శాతం మోసం ఉన్నప్పటికీ నీవు దేవుని ఆశీర్వాదమును పూర్తిగా పొందలేవు. ఒకానొక దినమున నీవు సిగ్గుపరచబడతావు. హృదయము దేవునితో సరిగా లేనప్పుడు నీకు బలముగానీ, ధైర్యముగానీ ఉండవు అప్పుడు యాకోబు గ్రహించుకున్నాడు. తనచిక్కుగల జీవితానికి దేవుడు ఒక్కడే నిరీక్షణ అని. మనలో అనేక మందిమి యాకోబువలే ఉన్నాము. దేవుడు ఒక్కడే మన నిరీక్షణ అని మనం గ్రహించడం లేదు. యాకోబు స్వనీతి పరుడు. అతడు ఒక దర్శనం చూసాడు. సైతాను కూడా కొంతమందికి దర్శనాలు ఇస్తాడు. కొన్ని ప్రార్థనలకు జవాబులు కూడా ఇస్తాడు.

పరిశుద్ధుడైన దేవునిని యాకోబు ఎన్నడూ నమ్మలేదు. అతనికి దేవుని స్వభావము తెలియలేదు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాప పడుతుండినాడు. ఎందుకు? ఒక ప్రక్కన కోపముతో నిండిన తన సహోదరుడు పగతీర్చుకొనుటకు వస్తున్నాడు. మరియెక ప్రక్కన తన మామగారు బావమరుదుల కనిపిస్తున్నారు. ఈలాటి పరిస్థితి వచ్చేవరకు అతడు దేవుని వెదకకుండా ఆలస్యము చేసాడు.

పశ్చాత్తాపము శరీరము, ఆత్మ పరమాత్మలకు ఒక ఆశీర్వాదముగా ఉండును. యాకోబుకు దేవుడు ఒక పశ్చాత్తాపమునిచ్చాడు నిజమైన పశ్చాత్తాపము రక్తమును కూడా శుద్దీకరించును. నీ బిడ్డలలోని పాపము వృద్ధి అవటం సైతాను చూస్తున్నాడు. నీవు నీ పిల్లలను నాశనం చేయగలవు. పరిశుద్ధాత్మ సహాయముతో నీవు పశ్చాత్తాప పడితే నీ శరీరములో ప్రతిభాగము మార్పునొందుతుంది. నీ మనస్సు కూడా మార్పు చెందుతుంది. యోబు 20:11 పాపము నీ ఎముకలలోనికి కూడా ప్రవేశించును. క్రీస్తు యేసు నందు విశ్వాసమును పశ్చాత్తాపము అతిశ్రేష్టమైన మందులు.

2కొరింధి 7:1 యాకోబునందలి అపవిత్రాత్మలు తొలగిపోయినవి. ఇప్పుడు ఆయనలో పరిశుద్ధాత్ముడు మట్టుకే ఉన్నాడు. యోసేపు బాల్యమునుండి ప్రవక్త. అతని సహాదరులు వచ్చి అతని కాళ్ళ మీద పడ్డారు. ఫరోమంత్రులు నమస్కరించారు. అతడు జారత్వము నుండి పారిపోయారు. ఈ పాపమును గూర్చి జాగ్రత్తగా ఉండి దాని నుండి తప్పించుకొనేవాడు లోకములో ఒకదీవెనగా ఉంటాడు. దేవుడు మన కొరకు ఒక పశ్చత్తాప దినమును ఏర్పాటు చేసాడు. నిన్ను నీవు తగ్గించుకొని పశ్చత్తాప పడినట్లుయితే దేవుని కోరిక నెరవేర్చేవాడివి అవుతావు.

మూల ప్రసంగాలు