లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవునితో సన్నిహిత సంబంధము కలిగి యుండుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

ద్వితి. 30:19, 20

దేవుడు నీతో నీ ముందు జీవమును, మరణమును పెట్టుచున్నాను. దేవుని వాక్యములో నొప్పిని తొలగించేది ఒకటి పెట్టాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయనకు సత్యమును అనుగ్రహించినాడు. దేవుడు చెప్పాడు '' అబ్రహాము నా ఆప్తమిత్రుడు''. ఆయన దేవుని వాక్యమును ఎంత లోతుగా నమ్మినాడంటే అతడు తన తర్వాత తన పిల్లలకు దేవుని వాక్యమును నేర్పుతాడని నిశ్చయముగా ఎరిగియున్నాడు. దేవుడు అబ్రహాము యొద్దనుండి దేనినీ దాచలేక పోయాడు. పరలోకమందును భూమి మీదను పరిపాలించే సర్వశక్తుడైన దేవుడు నేను దేనిని ఒక మానవుని యొద్ద నుండి దాచలేకపోయానని చెప్పడం ఒక అసాధారణమైన సంగతి. దేవుడు దానిని అర్థంలో చెప్పడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచాడు. దేవుడు అబ్రహామును నమ్మి అతనిని ఎన్నికలోనికి తీసుకోగలిగాడు. అది చాలా గొప్ప విషయము! వేర్వేరు విధములుగా మనము విశ్వసించడం విషయమై తలుస్తాము.

ఆలయమునకు వెళ్ళు ప్రతి వాడు తాను దేవుని నమ్ముచున్నానని నమ్ముతాడు. వారం పొడుగునా అబద్ధాలు ఆడతాడు. నీవు దేవునియందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు ఆయన స్వభావమును గ్రహించుకుంటావు. అబ్రహాము దేవుని యొక్క స్వభావమును గ్రహించుకుంటూ ఉండినాడు. అబ్రహాము తన కుమారుని అర్పణగా అర్పించబోయే సమయములో మనము దేవుని స్వభావమును ఆయనలో చూస్తున్నాము. దేవుని యందు నమ్మకముంచి తన కుమారుని అర్పించగలిగిన వాడు ఒక్క మానవుడైనా ఉన్నాడని దేవుడు సంతోషించగల్గినాడు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన తర్ఫీదులో దేవుడు గొప్ప విజయాన్ని అబ్రహాము జీవితంలో చూస్తాడు అబ్రహాముతో విశ్వాసం ప్రారంభం అయింది. ఆయన తన పిల్లలకు దానిని ఇచ్చాడు.

అబ్రహామునందున విశ్వాసము తన బిడ్డలకు ఇచ్చుటకు దేవుడు ఒక ధర్శ శాస్త్రమును నియమించాడు. దేవుని వాక్యములలో అమోఘమైన శక్తి ఉన్నది. దానిని అంగీకరించి విధేయుడైనప్పుడు వారు వర్ధిల్లిరి. వారి విశ్వాసమునకు తగిన మెట్టులో వారు వర్ధిల్లారు. ఇంగ్లాండు దేశం కొంత వరకు దేవుని వాక్యమును వెంబడించారు కనుక వర్థిల్లారు. నీతి ఒక దేశమును వర్ధిల్లజేయును. సామెతలు 14:34 ''నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము''. ఇంగ్లాండు దేశం తక్కిన దేశములకన్నా పైకి ఎత్తబడింది. ఇది సృష్టించేది శక్తిగల వాక్యము. తమ హృదయములలోనికి విధేయత ద్వారా దేవుని వాక్యమును అంగీకరించేవారు ఆ సృజనాత్మకమైన శక్తిని పొందుతారు. అది పాపమును లేకుండా తీసివేయును.

తమ బిడ్డలు దేవుని యందు విశ్వాసము ఉంచి దేవుని వాక్యమునకు విధేయులు కావలెనని ఆశించేవారు నిజముగా తల్లిదండ్రులు అయి ఉన్నారు. నేను తిరిగి పుట్టినప్పుడు నా తండ్రి చెప్పాడు. ఇక చాలును. నా కుమారుడు రక్షించబడ్డాడు. దేవుడు అతనిని జాగ్రత్తగా చూసుకుంటాడు''. నేను ఆయన మాటలలో ఉండే ప్రాముఖ్యతను గ్రహించకపోతిని. దేవుడు నన్ను ఏలాగు జాగ్రత్తగా చూసుకున్నాడో నేను గ్రహించుచున్నాను. ప్రతి తండ్రి, తల్లి తమ పిల్లలను దేవుని చేతులకు అప్పగించాలి. ఇది దేవుని యందు భయము నేర్పించుట ద్వారానే సాధ్యము. నా స్కూలులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు తమ అవసరల నిమిత్తము దేవుని వైపు చూసారు. ప్రతిదానికి తల్లిదండ్రులవైపు చూడక దేవుని వైపుకు చూసే పిల్లలు గొప్పలాభము పొందుదురు. ఒక సేవకుడు తన యజమానుని వైపుకు లేక యజమానురాలివైపుకు చూడక దేవుని వైపుకు చూసువారు గొప్ప ఆశీర్వాదము పొందుతారు. యజమానుని తృప్తి పరిచే విధము ఒక్కటే కాక దేవుని వైపుకు చూడడం అనేది గొప్ప ఆశీర్వాదము.

నీవు దేవుని వాక్యమును విశ్వసించినప్పుడు అది నీ జీవితము మీద ఒక ప్రత్యేకమైన ప్రభావము చూపిస్తుంది. అది నీ నరములను బలపర్చి నీ ఆరోగ్యము పెంచును. నీ రక్తము గూడా పవిత్రపరచబడుతుంది. నీ మనస్సు తేటగా ఉండును. దానిని బట్టి వ్యతిరేకమైన తలంపులను తృణీకరించును. శరీరములో కలిగే వ్యతిరేకమైన ఉద్రిక్తస్థితులపై జయము దొరుకును. వ్యతిరేకమైన ఉద్రిక్తతలు త్రోసివేయబడి సానుకూల ఉద్రిక్తతలు వృద్ధి పొందించబడును. ఇవి నీ శరీరమును నిర్మించును. ఇవి దీర్ఘాయుషుకు మార్గము.

నూజివీడులో కూటములు జరిగినప్పుడు ఒక వ్యక్తి సాక్ష్యము ఇచ్చాడు. అతడు తలనొప్పితోనూ, ఆస్తమా (ఉబ్బసవ్యాధి) క్షయ రోగముతోనూ బాధపడేవాడు. అతనొక శానిటోరియంకు వచ్చాడు. అక్కడ నుండి మన కూటములకు వచ్చి వాక్యము విన్నాడు.'' నీవు దేవుని వాక్యము యొక్క అధికారము నమ్మలేదు. నీవు దేవుని వాక్యమును తృణీకరించావు. నీ జీవితమును అనారోగ్యములోనికి లాగుకొని వెళ్ళావు కాని ఆపదవచ్చినప్పుడు నీవు ఊరికే ఏడుస్తావు.'' ఈ మాటలు వినగానే అతనికి గ్రహింపు కలిగినది, ఈ పరిస్థితి ఎందుకు అతనికి సంభవించినదో గ్రహించుకున్నాడు. అతడు దేవుని వైపుకు తిరిగాడు, దేవుడు అతనిని స్వస్థపరిచాడు, నా కుటుంబములో ఏదైనా హానివచ్చినప్పుడు నన్ను నేనే నిందించుకుంటాను. నేను నా హృదయమును పరిశోధించుకుంటాను. దేవుడు నా తప్పిదములను నాకు చూపిస్తాడు.. ''నీవు, నీ మాటలలో సరిగాలేవు'' అని ఒక సారి నాకు చెప్పాడు. నేను దారి చూపే వాని గానూ నాయకుని గానూ ఉన్నాను. నా మాటలు గూర్చి నేను బహు జాగ్రత్త గా ఉండాలి.

ద్వితి 32:46,47 ఈ వాక్కును బట్టి నీవు వర్ధిల్లు తావు. అది నిన్ను అదుపులో పెట్టుకొనును.

దానియేలు తన నీతిని బట్టి రాజును అతని అధికారం క్రింద పెట్టుకోగలిగాడు. అతడు సింహపు బోనులో నుండి తప్పించబడినప్పుడు అతడు దైవజనుడని గ్రహించారు. దేవుని పది ఆజ్ఞలను చదవనివాడు నీయందు దానిని చదువును. నీవు విధులలో నడిచేటప్పుడు ప్రజలు నీలో చూస్తారు.

ఎస్తేరు ఒక శుభ్రమైన దేవుని బిడ్డ. ఆమె తన జీవితమును, తన శరీరమును దేవునికి ప్రతిష్ఠించెను. ఎవరైననూ తన శరీరము దేవునికి చెందినదని నిజముగా నమ్మినట్లయితే దేవుడు వచ్చి అతనిలో నివాసముంటాడు. దేవుడు ఒకనాటికి అతనిని వాడు కొనును. ఎస్తేరు దేవుని వాక్యాను సారముగా నడుచుకున్నది. ఎవరైననూ అలాగు జీవించినట్లయితే దేవుడు ఆ జీవితములోనికి నిశ్చయముగా వచ్చి అతనిని వినియోగించుకొనును. మనము ప్రాముఖ్యము కొరకు, డిగ్రీల కొరకు పెద్ద ఉద్యోగము కొరకు వెదుకుతాము. జిల్లా కలెక్టరులు, దౌర్భగ్యమైన మరణం మరణించడం చూస్తాను.

మొర్దెకై చెప్పాడు ''ఈ కారణమును బట్టి నీవు ఈ పరిస్థితికి వచ్చావు''. కొంతమంది మనుష్యులు మంచిని చూసి నిశ్చలమైన ఉద్యోగంచూసినప్పుడు అవి మాకే కావాలి అనుకుంటారు. వారు ఇక ఇతరులను గూర్చి ఆలోచించరు. పార్లమెంటులో క్రైస్తవ అంతస్థుల కొరకు పోరాడటానికి కొంతమంది భయపడతారు.

ఒక్క స్త్రీ, ఎస్తేరు ప్రజలందరి కొరకైన పూచీ వహించింది. దాని భావము విశ్వాసము, విశ్వాసమునందు ఎదుగుట. ఆమె మరణమైననూ జీవమైననూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దేవుని ప్రజల నిమిత్తమై రాజు ఎదుట నిలువబడింది. ఆమె దగ్గర నుండి ఎలాంటి అడుగులు ఎదురు చూసారో చెప్పలేము, ఇలాంటి ఇక్కట్లు కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకొంటున్నావా? 10 వేల మంది ఆత్మల రక్షణ నీ విశ్వాసము మీద ఆధారపడి ఉన్నది. ఎస్తేరు క్రీస్తుకు పూర్వం 476 సం||లో జీవించింది. అయిననూ క్రీస్తు వలె జీవించింది. దేవుడు శరీర సౌందర్యమును గొప్పగా ఎంచుతాడా? లేదు, ఆమె అంతరంగా సౌందర్యమునే ఆయన గొప్పగా ఎంచాడు. ఒక స్త్రీ సౌందర్యము, ఈ సౌందర్యంలో ఇమిడి ఉన్నాయి. దేవుని వాక్యము పఠించి దానిమీద ధ్యానించడంలో ఉన్నది. సామెతలు 31:30 ''అందము మోసకరము, సౌందర్యము వ్యర్ధము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును''. ఆమె తన అంతరంగిక సౌందర్యమును గూర్చి లోకమంతటికి నచ్చచెప్పుటలో గౌరవమైన మెట్టులో ఉంది. అత్యున్నతమైన అంతస్థుకు స్త్రీయత్వము ఎత్తబడింది. ఆమె స్వభావం ద్వారా ఎత్తబడింది.

హామాను దేవుని ప్రజలను నాశనం చేయడాలని కోరాడు, కాని దేవుని హస్తము అతని మీద బలముగా దిగి వచ్చినది. అతడు నిర్మించిన ఉరి మ్రాను నుండి అతడే వ్రేలాడ దీయబడ్డాడు. మహిమా ఘనతలు దేవుని యొద్ద నుండి వచ్చును. దేవుని వాక్యమును విశ్వసించువారు ఈ లోకమును పరిపాలించుదురు. పరిశుద్ధులు ఈ లోకమును పరిపాలించుదురు. నీవు వారిలో ఒకనివిగా ఉంటావా? అప్పుడు పాపమునకు నీలో చోటు ఉండకూడదు.

మూల ప్రసంగాలు