లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా ఎదుట పెట్టుకొందును

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తన 16.

దేవుని బిడ్డకు కలిగే టటువంటి లోతైన భావములు ఈ కీర్తన ద్వారా బయటకు తేబడుచున్నవి. 8వ వచనంలో '' సదా కాలము యెహోవాయందు నా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వ మందున్నాడు గనుక నేను కదల్చబడను''. నా కళాశాల చదువు దినాలలో దేవుడు నా కుడి పార్శ్వమందున్నట్లుగా గ్రహించాను. తర్వాత దినములలో కూడా నా జీవిత దినములన్నిట ఆయన కృపను బట్టి ఇది నా జీవితములో సత్యము. ''ఎల్లప్పుడూ నీకు ముందుగా'' నీ స్నేహితుల మధ్య, నీ శత్రువుల మధ్య నీ ఆటలలో, భోజనపువేళలో నేను నిద్రించే టప్పుడు ఇది సత్యము. ''నా కళ్ళెపు పగ్గములు రాత్రిజాములందునను నాకు నేర్పించును.'' దేవుని వాక్యమును నీ హృదయములో ఉంచుకున్నప్పుడు నీ నిద్రలో అవి నీకు నేర్పించును. ఉదయము శరీరము యొక్క కళ్ళెపు పగ్గాలను పట్టుకొని ఉంచును. నీ హృదయము దేనినైతే విలువగా ఎంచునో జాగ్రత్తగా కాపాడునో అది నీ శీలమును నిర్ణయించును. నీ హృదయములో విలువైన వాంచగా దేనినైతే నీవు పెట్టుకొందువో అది నీ క్రియలను నడిపించును. దేవుడు అబ్రహముకు రాత్రి సమయంలో మాట్లాడి నక్షత్రాలను చూపెట్టాడు. ఆయన కొరకు నీవు వాంచించే వాంఛలను లోతుగా చేస్తాడు. దేవుని వాక్యము మీద నీవు ధ్యానించాలి. దేవుని గూర్చిన తలంపులు దేవుని వాక్యము. నీ అంతరంగ పురుషుని మీద క్రియ చేసి నీ వ్యక్తిత్వము అంతటిని ఆయన కొరకైన వాంఛతో కప్పును. ఆయన అక్కడ దానిని ఉంచాడు. నీ జీవితం అంతా విజయముగా ఉంటుంది. నీ ఆత్మీయ ఆశలను క్రిందికి లాగడానికి ప్రయత్నించే నీ శరీరేచ్ఛలు, నీ యౌవన దినములలో అత్యధికంగా ఉంటాయి. అది నిజమైన పోరాటం జరిగే సమయం. దేవుడు నీలో ఒక ముఖ్యమైన భాగము అయితే నీవు జయిస్తావు.

నీ ఆస్తి దేవుడే. నీ పిత్రార్జితము దైవ సంబంధమైన స్వభావము. సిలువలో మరణించిన వాని స్వభావము లోకమును జయించే స్వభావం. ఈ స్వభావము కల్గిన వారు లోకమును జయిస్తారు. దేవుని తలంపుతో ఆయన స్వభావముతో నింపబడినట్లయితే నీవు ఎన్నటికినీ కదల్చబడవు. వారిని ఖైదులో పెట్టవచ్చు. కాల్చవచ్చు. చంపవచ్చు, కాని వారిని కదల్చలేవు. దేవుడే వారి ఆస్తి. 5వ వచనం. ''యెహోవా నా స్వాస్ధ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు''. దేవునిని త్రాగి ఆయన స్వభావమును త్రాగటం దావీదు చెప్పే విషయం. దేవుడు నీ స్వాస్ధ్య భాగము, ఆయన నీ స్వాస్థ్య భాగమును కాపాడుతున్నాడు. దావీదు తన లోతైన తలంపులలో ఔన్నత్యముగా వెళ్ళుతున్నాడు. 6వ వచనం. ''మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను''. దేవుడు తనకు కొలిచి ఇచ్చిన భూభాగము అతిశ్రేష్టమైన స్థలములలో ఉన్నది.

నీవు అడుగు పెట్టు ప్రతిచోట నీకు జయము దొరుకును. దేవుడు నాకు నా యౌవన దినములలో ఈలాంటి విజయాలు దయ చేసాడు. నేను వెళ్ళిన ప్రతి కళాశాలలోనూ అత్యున్నతుడుగా నేను ప్రదర్శించాను. యౌవనస్థులు నా యొద్దకు ఆకర్షించబడ్డారు. మీరు ఆ రీతిగా జయించాలి. యౌవనస్థులారా మీరు ఎన్నడూ కదల్చబడరు. నీవు ఓడిపోవు, మీ విశ్వాసము గౌరవించబడుతుంది. దేవుని దృష్టిలో పవిత్రముగానూ, పరిశుద్ధముగా నిన్ను నీవు కాపాడుకో.

జకర్యా 12:8,9 '' ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తి హీనులు దావీదు వంటి వారు గానూ, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గానూ. జనుల దృష్టికి యెహోవా దూతల వంటివారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింప జేయ పూనుకొనెదను''. నిన్ను గూర్చి దేవుడు కలిగియున్న ఆశలు అత్యున్నతమైనవి. యెహోవా తన కుడి పార్శ్వమందు తనకు సలహా నిచ్చుచుండుట దావీదు చూసాడు. సంపూర్ణ సంతోషములోనికి దావీదును నడిపించింది ఇదే. ''నా శరీరము కూడా నిరీక్షణలో ఆనందిస్తుంది.'' ఆత్మ యొక్క కోరికలకు శరీరము ఒక శత్రువు, శరీరము ఆత్మలోనికి వచ్చి ఆత్మనే మురికి చేస్తుంది. నీతి విషయమై నీ జీవితపు గురి ఏమనగా నీ జీవితములో పరిపూర్ణత. ఇతరులను సంతోషములో పెట్టుట. సమర్పణ ద్వారా పరిపూర్ణత వచ్చును. నిన్ను నీవు సిలువ యొదుట తగ్గించుకొని ఆత్మీయమైన క్రమశిక్షణలో ఉండాలి సువార్తను ఇతరులకు అందించుట ద్వారా వారికి నిజమైన సంతోషము ఇవ్వగలము.

11వ వచనం. ''జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు'' మీ నిరీక్షణ ఇది అయి ఉండాలి. నీవు వృద్ధుడవు అవుతుండగా నీ జీవితపు విజయములను లెక్కించు, నీ యౌవన దినములలో దేవుడు నీ కుడి పార్శ్వమున ఉండక మన జీవిత భాగమును ఎన్నుకొనవలసిన రీతిగా ఎన్నుకొనకపోతే మన జీవితం ఎన్నడూ విజయవంతముగా ఉండదు. అతి శ్రేష్టమైనది నీకు ఇవ్వవలయునని దేవుని కోరిక. ఆయన ఓర్పు, దీర్ఘ శాంతము ఆశ్చర్యరీతిగా ఉంటాయి. మన స్వార్థమును బట్టి ఆయన ఉద్దేశములను నాశనము చేయుచున్నాము. దేవుడు చెప్పుతున్నాడు. ''రండి మనము వివాదము తీర్చుకుందాము''. మనకు స్వార్ధము అవిధేయత ఉన్నప్పటికినీ ఆయన విడిచిపెట్టబడిన దానిలో అతిశ్రేష్టమైనది తయారు చేయడానికి చూస్తాడు. దానిని మనకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఓర్పుతోనూ, దీర్ఘ శాంతముతోనూ మనలను కనికరిస్తాడు. మార్కు 12:24 '' అందుకు యేసు - మీరు లేఖనములను గానీ, దేవుని శక్తినిగాని యెరుగక పోవుట వలననే పొరపడుచున్నారు''. కొన్ని సార్లు ప్రజలు తమ వృద్ధాప్యములో దేవునికి తమ్మును తాము అప్పగించుకొంటారు. దేవుడు నీ జీవితములో మిగిలియున్న చిన్న ముక్కతో అతి శ్రేష్టమైన దానిగా చేయడానికి చూస్తాడు. దేవుడు మనలను మన యౌవన దినములలో కోరుచున్నాడు. నా అవిధేయతల ద్వారా ఆయన ఏర్పాట్లను పాడుచేసినందుకు నన్ను క్షమించమని దేవుని అడిగాను. మనము మారు మనస్సు పొందినప్పటికీ అనేక సార్లు ఆయనను దుఃఖపరుస్తాము. ఆయన ఉద్దేశములను పాడుచేస్తాము. మనం మార్పుచెందినా కూడా మనం ఆయన ఉద్దేశములను పాడుచేస్తాము. నా కళాశాల దినములలో నేను ఇంకా ఎక్కువగా ఆయనకు విధేయుడై యుంటే ఇంకా బాగుండును అని ప్రార్థించే వాడిని ఒకనాడు నా స్నేహితులలో ఒకని కి తన బంధువులలో ఒకామె మరణించినట్లు తంతివార్తవచ్చింది. వారి ఆదరణ కొరకు ప్రజలు ప్రార్థన చేస్తూండినారు. ఆమె బ్రతికేటట్లు ప్రార్థన చేయమని ప్రభువు నన్ను అడిగారు. నా స్నేహితులు యొక్క ఎగతాళికి నేను భయపడి ఆ విధముగా ప్రార్థన చేయలేదు, ఆమె నిజంగానే జీవించింది. తంతివార్తలో తప్పుగా ఇవ్వబడింది. నా పేరు పోతుందని దేవున్ని మహిమపరచలేదు. పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగండి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కుడి పార్శ్వమందు నిత్యము ఉండే సుఖములు ఉన్నాయి. దేవుడే నీ స్వాస్ధ్య భాగము.
మూల ప్రసంగాలు