లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నేను నీ తండ్రి దేవుడను

కీ.శే. యన్‌. దానియేలు గారు

నిర్గమ 31: 1-8

''నేను నీ తండ్రి దేవుడను'' దేవుడు మన తండ్రులను ఎరుగును. దేవుడు నీ తండ్రిని ఎరుగును. మోషే తండ్రిని ఎరుగును''.

''నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను'' మోషే తండ్రి పేరు చెప్పడానికి దేవుడు ఎందుకంత ముఖ్యముగా భావించాడు. దేవుడు మోషే తండ్రిని ఎరుగును. ఆయన ఒక దైవజనుడని ఎరుగును. విశ్వాసముతో నిండినవాడు. ఫరో పెట్టిన నియమమునకు వ్యతిరేకముగా మోషే తల్లిదండ్రులు అతనిని మూడు నెలలు దాచి పెట్టారు. వారు విశ్వాసము కలిగిన మనుష్యులు కాకపోతే మొసళ్ళు మోషేను తినివేసి ఉండేవి. ఈ లోకములో అనేకమైన మొసళ్ళు ఉన్నాయి. అవి పిల్లల ఆత్మలను నాశనం చేస్తాయి. కానీ చాలా మంది తల్లిదండ్రులు బహు నిర్లక్ష్యముగా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్య స్వభావము వలన అనేకమంది చిన్నపిల్లలు ఈ దినమున దెయ్యపు శక్తి క్రింద ఉన్నారు. వారి ఒక్క కోరిక ఏమంటే ఈ లోకములో ధనార్జన చేయడం.

మోషే తండ్రి ప్రార్థించే వ్యక్తి. నైలునదిలో పారవేయబడానికి బదులుగా మోషే తండ్రి ప్రార్థన ఫరో యొక్క భవనములోనికి పారవేసింది. ఆ కాలమునకు అతి శ్రేష్టమైన విజ్ఞానము మోషేకు దొరికింది.

సైతాను ఈ లోకమును పరిపాలిస్తున్నాడు. నీవు నాశనం చేయబడాలనేది ఒక్కటే అతని కోరిక యోహాను 10 : 10 ''దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చితినని మీతో చెప్పుచున్నాననెను''. సైతాను నీ బిడ్డలను నాశనం చేయవలెనని చూస్తున్నాడు. 15, 16 ఏళ్ళ వయస్సులో వాళ్ళను నాశనం చేయాలని చూస్తాడు. క్రీస్తు నందు వారి విశ్వాసము పాడు చేయబడిన తర్వాత వారు మరణము పొందినవారే. దేవుని వాక్యము పఠించని వారు సంఘములో పెద్దలైతే అక్కడ విశ్వాసము ఎదుగదు. కనుక బిడ్డల విశ్వాసము వారు మానవత్వములోనికి ఎదుగక ముందే, వారు వివాహ జీవితములో ప్రవేశించకముందే బిడ్డల విశ్వాసము నాశనము చేయబడుతుంది.

దేవుడు ఇశ్రాయేలును నడిపించుటకు ఒక విమోచకుడు కావాలని కోరాడు. ఆయన విశ్వాసము, నీతి, ఉండే గృహము కొరకు చూచాడు. విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ప్రతి దినము ప్రార్థించే వారు కావలెనని ఆయన కోరాడు. దేవుడు తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభువు నందు విశ్వసించే ఒక కుటుంబమును దేవుడు కనుగొన్నాడు. జ్యేష్ట కుమారుడు, జ్యేష్ట కుమార్తె దేవుని యందు విశ్వాసముంచారు. ఇక్కడ ఒక విమోచకుడు ఎదుగగల్గిన వాతావరణం ఉండింది. తల్లిదండ్రులు, అక్క, అన్న కొత్తగా పుట్టిన శిశువును ప్రార్థనతో కప్పారు. చిన్నబిడ్డకు భోజనము, శారీరకమైన జాగరూకత కంటే ఎక్కువ వారు ఇచ్చారు. ఆ బిడ్డకు విశ్వాసము నీతి దయ చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆయన బిడ్డను కాపుదల చేసాడు. దేవుడు అతనికి ఇహ సంబంధముగా మంచి విద్యను ఇచ్చాడు. ఐగుప్తులో నేర్చుకొనదగిన దాని కన్నా ఎక్కువ విద్య నేర్చుకోవలెనని దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు కొత్త వాతావరణంలోనికి వచ్చాడు. అక్కడ గొర్రెలు అతనికి స్నేహితులుగా ఉండినాయి. అది ఒక అడవి. ఇలాంటి స్థలములలోనే బాప్తిస్మము ఇచ్చు యోహాను, ఏలియా మరియు ఇతర లోతైన దైవజనులు విద్యాభ్యాసము చేశారు. అవిశ్వాసులైన మనుష్యుల సమీపములో జీవించడము అనేది గొప్ప అంటువ్యాధితో సమానము. ఇక్కడ అరణ్యములో దేవుడు ఆయనకు విద్య నేర్పించాడు. దేవుడు నీకు విద్య నేర్పించినప్పుడు నీవు అత్యున్నతమైన డిగ్రీని సంపాదించుకుంటావు. దేవుడు ఆత్మతో చెప్పాడు. ''మోషే నేను నీ తండ్రి ప్రార్థనలను మర్చిపోను. అవన్నీ నా యెదుట ఉన్నవి. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అబ్రహాముకు నేను చేసిన వాగ్దానము జ్ఞాపకము చేసుకుంటున్నాను. నా ప్రజల కన్నీళ్ళు నేను చూసాను. నేనే దేవుడను. నేను వారికి చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొంటున్నాను. నీ చెప్పులు విప్పు. ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణముగా విద్యాభ్యాసము చేసి ఒక పరిశుద్ధ స్థలము కొరకై వెతికాడు. దేవుడు అతనిని దర్శించి అతనితో మాట్లాడాడు. అతనికి ఆయన అభిషేకం చేసాడు. అనేకమైన సూచనలు అతడు మోషేకు ఇచ్చి ఆయన దేవుని వలన పంపబడ్డాడని ఇశ్రాయేలు ఒప్పుకొనునట్లుగా చేసాడు.

మూల ప్రసంగాలు