లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెషయా 9: 6, 7 వచనం

''మనకు ఒక శిశువు పుట్టెను'' మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన సమాధాన కర్తయగు అధిపతి. తన భుజము మీద రాజ్యభారము మోయును. ఈ విధముగా ఆయన క్రమేణ చెప్పుతూ వచ్చారు. సత్యం, కృప ఆయన యందు ఏకమైయున్నవి. కృప సత్యం భరించడానికి వీలుగా చేస్తుంది. కొంతమంది సత్యవంతులైన వారు ఉంటారు. వారు చాలా కఠినులుగా వారుంటారు. ఈయన దేవుడు, సత్యము, కృప అను రెంటితో నిండియున్నాడు. యోహాను 1:14 ''ఆ వాక్యము శరీర ధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెదను. ''(మనము ఆయన మహిమను చూచితే మా తండ్రి వలన జన్మించిన వాని యొక్క మహిమ) ఆయన లోకము యొక్క భారము అంతటిని మోస్తాడు. ఆయన పూచీ వహిస్తాడు. మానవుని యొక్క పాపము అంతయు భరిస్తాడు. ఆయన తన మీద పాపము యొక్క శిక్షను భరిస్తాడు. ఈ విధముగా మానవుని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ పరుస్తాడు. క్రీస్తు నందున్న ఉన్నత జీవితము నందు లభించే గొప్ప సంతోషము పొందకుండా చేస్తాడు. దీనికి కారణము పాపము అనే వ్యాధి. సిలువ మనలను పాపము నుండి, మన పాప స్వభావము నుండి విడుదల చేస్తుంది.

మన పాపము భరించే క్రీస్తు మనలను పరిశుద్ధాత్మ నడిపించుబడి కొరకు సిద్ధపరుస్తారు. పరిశుద్ధాత్ముడే లోకమంతటి భారమును మోస్తాడు. క్రీస్తు పేరు మనము ఉచ్చరించునప్పుడు నరకం యొక్క ద్వారములు మన ఎదుట నిలువబడలేవు. ఈ నామమున మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. ఆయన మంచి ఆలోచన కర్త. అది పరలోకపు ధన నిధులకు తెరవమని చెప్పేది. పవిత్ర హృదయముతోను, మంచి మనస్సాక్షితోను అది ఉచ్చరించబడినప్పుడు ఇది జరుగుతుంది. ఆయన పేరు ఆలోచన కర్త. 2 దిన వ'' 9:23 ''దేవుడు సాలోమోను యొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూ రాజులందరును అతని ముఖ దర్శనము చేయగోరిరి'' భూలోకపు రాజులందరు దేవుని వలన నేర్పించబడి వాని యొద్దకు వచ్చిరి. 2 దినవృ 9:3, 4 ''షేబదేశపు రాణి సులోమోనుకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను అతని సేవకులు కూర్చొండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను యెహోవా మందిరము నందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయము నొంది రాజుతో ఇట్లనెను''. ఆయన జ్ఞానము విషయమై ఆమె ఆశ్చర్యపడెను.

క్రీస్తు ఒక అద్భుతమైన ఆలోచన కర్త. ఆయన నీకు, నాకు కూడా ఆలోచనలను ఇస్తుంటాడు. ''సోలోమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు'' నిన్ను ఎన్నడూ తప్పుదారిని నడిపించని పరిపూర్ణమైన ఆలోచనకర్త ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆలోచనను ప్రతి దినము వెదుకు మనము ధన్యులమైయున్నాము. కృపాసత్యములు ఆయన యందు ఒకదానినొకటి ముద్దాడెను. ఇశ్రాయేలీయులు ఈ గొప్ప శక్తి వంతమైన దేవుని వినుటకు గడగడలాడారు. ఇప్పుడు ఆయన కృపా సత్యముల రూపములో కనబడుచున్నాడు. ఆయన కృపా ప్రేమ రూపమున అగుపడుచున్నాడు. ఆయన ఆలోచనలలో తప్పేమీ లేదు. క్రీస్తు నీ హృదయమును మార్చి ప్రేమతో దానిని పూర్తిగా నింపుతాడు. ఆయన ఇచ్చే ప్రభుత్వము పెరుగుతూ పోవును. ఏదీ దానిని ఆపలేదు. నీవు ఆ ప్రభుత్వములో ఒక సభ్యుడిగా ఉంటావా. నీవు హెచ్చగుదువు. ఆయన వెలుగును ప్రేమను విస్తరింపజేసే చలనము. ఆ చలనములో ఒక భాగముగా నీవు ఉందువా. నీవు నిత్యుడవు అయి ఉంటావు. తమ దేవుని నెరుగువారు గొప్ప కార్యములను సాధించెదరు. దానియేలు 11:32 ''ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదురు'' నీయందున్న శక్తి నీది కాదు, సర్వశక్తి మంతునిది కనుక గొప్ప కార్యములను సాధించెదవు. నీవు సాధువుగాను, దీనుడవుగాను ఉంటావు గాన సర్వశక్తిమంతుడవై ఉంటావు. ఇది దైవ సంబంధమైన స్వభావము. ఆయన గుణగణములన్నింటిలో నీవు భాగము వహించుదువు. అంతేకాక ఆయన సర్వశక్తిమంతత్వములోనూ.

మూల ప్రసంగాలు