లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

విశ్వాసములో ఎదుగుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఆదికాం 22:1-22 వరకు

''తెల్లవారినప్పుడు అబ్రహం లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలికొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను''. అబ్రహాము కనపర్చిన గొప్ప విశ్వాసము నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది. విశ్వాసములో ఈ మెట్టుకు లేవడానికి అబ్రహాముకు 50 సం||లు పట్టింది. ఒక వ్యక్తి విశ్వాసములో ఎదిగే కొలది అనేక మెట్లు దాటి వెళ్ళాలి. విశ్వాసము ఆరంభించవచ్చును గానీ ఆ విశ్వాసములో ఎదగటానికి సమయము పడుతుంది. అబ్రహము తీసుకోవాల్సిన మొదటి అడుగు ఏమంటే తన సొంత ప్రజలను వారి దేవుళ్ళను విడిచిపెట్టడమే. మారుమనస్సు పొందినప్పుడు మనం తీసుకున్నటువంటి అడుగు పెద్దదిగా కనపడియుండవచ్చు. యౌవనస్థులకు అది బంధువులను లోక సంబంధమైన ప్రీతిని విడిచిపెట్టడమే. అది ఒక గొప్ప అడుగు. దేవుడు దానిని విలువగా ఎంచుతాడు. నీవు ఎల్లప్పుడూ నీ సమర్పణను గూర్చి తలవంచినట్లయితే నీవు వర్థిల్లవు. నేను నా ఉద్యోగమును విడిచిపెట్టి ఆయన సేవలోనికి వచ్చుటకు దేవునికి విధేయుడనయినప్పుడు దేవుడు నాతో నేను చేసిన కార్యమును గూర్చి తలంచవద్దని భవిష్యత్తులో నేను చేయవలసిన దానిని గూర్చి ఆలోచించమని మెళకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. తన దేశమును తన ప్రజలను విడిచిపెట్టినప్పుడు అబ్రహాము ఇంకా అనేకమైన ఇతర అడుగులు వేయవలసి వచ్చింది. దేవుడు అతనికి ఒక వాగ్దానము ఇచ్చాడు. ''నిన్ను దీవించు వారిని నేను దీవించెదను. శపించు వారిని శపించెదను'' తరువాత త్వరలోనే ఒక కరువు వచ్చింది. దేవున్ని అడగకుండా ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అది అనుభవం లేక. నీవు నీ సమస్తమును విడిచి దేవున్ని వెంబడించినప్పుడు నిన్ను నీవు దేవుని పరిపూర్ణ చిత్తంలో కాపాడుకోవలెను. ఫిలిప్పీ 3:13 ''సహోదరులారా నేనిది వరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు'' పరి|| పౌలు తాను ఏమి చేసినాడో వాటి గురించి ఆలోచించలేదు.

దేవుడు నీకు అనేకమైన దీవెనలు ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆయనను వెంబడించుటకు సమస్తము విడిచిపెట్టావు. అబ్రహము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు సిగ్గు కరమైన పరిస్థితిలోనికి వెళ్ళాడు. ఆ సిగ్గుకరమైన పరిస్థితిలోనికి అబ్రహాము తన్ను తాను తీసుకొని వెళ్ళాడు. కాని దేవుడు ఐగుప్తు రాజును శిక్షించి అబ్రహామును విడుదల చేశాడు. నీ ఆత్మీయ జీవితములో అవకతవకల వలన ఇతరులు బాధ నొందగలరు, దేవుని యొద్ద నుండి నీవు సంపాదించేటటువంటి నీతి అది ఫలించును. నీ శత్రువులు శిక్షించబడుదురు. నీ అవసరతను బట్టి వారు బాధ నొందుతారు. ప్రజలు నీకు వ్యతిరేకంగా వెళ్ళినపుడు వారు బాధ పడకూడదని ప్రార్థన చేయి. ఒక దుష్టుని మరణమును బట్టి మనము సంతోషించకూడదు.

మరియొక విషయములో అబ్రహాము దేవుని చిత్తము నుండి తప్పిపోయాడు. అతడు ఐగుప్తును నుండి ఒక స్త్రీని పనిమనిషిగా తెచ్చాడు. చివరకు ఆమెను భార్యగా తీసుకున్నాడు. ఆ దినములలో అది తప్పుగా భావించబడలేదు. కాని అది దేవుని చిత్తము కాదు. అది గృహములోనికి బేదాభిప్రాయాన్ని తెచ్చింది. కాని దేవుడు అబ్రహామును తన భార్యకు విధేయుడు కమ్మని హాగరును ఆమె కుమారుని పంపి వేయమని సెలవు ఇచ్చాడు. అతడు విధేయుడు అయినాడు. తదుపరి గొప్ప ఆశీర్వాదములు పొందాడు. అతడు పొరపాట్లు చేసాడు. కాని అబ్రహము ఎదిగాడు. అతని విశ్వాసము బలమైనది. మన పొరపాట్లను మనం పరీక్షించుకోవటం మంచిది. నేను దేవుని చిత్తములో నుండి తప్పిపోయిన విషయములలో బాధపడుతున్నాను. ఒక విషయంలో మనం దేవుని చిత్తమును తప్పిపోయినట్లయితే దాని ఫలితములు చాలా సంవత్సరములు మనలను వెంటాడుతాయి. అబ్రహాము తన కుమారుని అర్పించే వరకు ఎదుగుతూ ఉండినాడు.

మనము నిలకడగా ఎదగాలి. దేవుని పిలుపు అకస్మాత్తుగా రావచ్చు. మనము సిద్ధముగా ఉండాలి. ఆయన నీకు ఇచ్చే పని నీ జీవితమునకు అపాయకరముగా ఉండవచ్చు. నీ పొరపాట్లతో నీవు దేవునిని నమ్మకంగా వెంబడిస్తే విశ్వాసమందు నిన్ను పై అంతస్థులోనికి తీసుకొని వెళతాయి. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు నేను సిద్ధముగా లేను. దాని గూర్చి విచారపడుతున్నాను. నీవు అలాగు ఎన్నటికీ ఉండకుందువు గాక! విశ్వాసములో ఎదగడానికి ప్రతి తరుణమును నీవు వినియోగించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు అద్భుతకరమైన తర్ఫీదు ఇస్తాడు. దేవుడు అబ్రహామును లోకమంతటికీ దీవెనగా చేస్తానని చెప్పాడు.

మూల ప్రసంగాలు