లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుడు నిన్ను దీవెనగా చేయవలెనని కోరుచున్నాడు

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఒక ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్తూ ఉండినాడు. ఒక వ్యక్తి ఆయనకు ఒక కరపత్రం ఇచ్చాడు. అందులో ''ఓ ఇశ్రాయేలు ఈ రీతిగా నేను నీకు చేయబోవుచున్నాను. కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి ''ఆమోసు 4:12. అతను ఆ కరపత్రం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. రెండు వారాలలో దేవుని కలుసుకున్నాడు. మంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు. మంచి అలవాట్లు ఉండినవి. దానిని బట్టి ఒకడు విజయవంతమైన జీవితం జీవిస్తాడని అర్థం కాదు. ఒకడు మారుమనస్సు పొందిన తర్వాత ప్రభువును కలుసుకోవడానికి ఒకడు భయపడడు. ఒకసారి ఒక ఆయన ప్రయాణం చేస్తున్న కారు జారి ప్రక్కనున్న కాలువలో పడింది. అది బోర్లా పడింది. కాలువలో నీళ్ళ క్రింద బోర్లాగా పడిన కారు క్రింద అతడు ప్రభువును కలుసుకోవడానికి ఒక తరుణం కొరకు అడిగాడు. రక్షించబడవలెనని ఆశించాడు. ఒకడు తిరిగి పుట్టిన తరువాత అతని ఎక్కడైననూ పెట్టవచ్చు. అతడు ఆ స్థలాన్ని మారుస్తాడు. దేవుడు ప్రతి భార్యను అడుగుచున్నాడు, ''నీవు నీ భర్తకు ఒక ఆశీర్వాదం తీసుకువచ్చావా. నీ పిల్లలకు నీ అత్తమామలకు దీవెన తెచ్చావా''. ఒక వేళ నీవు డబ్బులు తెచ్చియుండవచ్చును. నీ బంధువులకు ఒక వ్యర్థత్వం తెచ్చియుండవచ్చును. నీవు ఈ దినమున ఒక ఆశీర్వాదముగా ఉన్నావా. దేవుడు నిన్ను కలుసుకుంటే ఆయనకు నీవు ఇచ్చే జవాబు ఏమిటి. యౌవ్వనస్త్రీలు వివాహం చేసుకుంటారు. యౌవనస్థులు క్రీస్తుకు నిష్ప్రయోజకులు గాను చేస్తారు. వారు చాలా అర్హత పొందిన వారిని పెద్ద జీతం తీసుకునే వారిని వివాహం చేసుకోవాలని ఆశిస్తారు. లోకమే వారి అంతము.

నా కుటుంబం యొక్క విశ్వాసపు మెట్టును పెంచుతున్నానా? నా భర్తను విశ్వాసంలో పెంచుతున్నానా? దేవుని యందలి భయము ఒక ధనాగారం. యెషయా 33:6. దేవుడు మనవైపు చూసి మనలను కనిపెడుతూ ఉన్నాడు. జారత్వము వలననూ, వ్యభిచారము వలననూ మనం చాలా భయపడతాము. ''నేను శుభ్రముగా ఉంటిని'' అని నీవు చెప్పగలవా? వివాహమునకు ముందు నీ శరీరాన్ని దుర్వినియోగము చేస్తావు. అప్పుడు నీవు నీ వివాహ జీవితములో ఎలాగు సంతోషించగలవు. ''నన్ను ఒక యోసేపుగా చేయి'' అనేది నా హృదయవాంఛగా ఉండింది. ఆహారం మీద దేవుని కాపుదల కానీ, ఆశీర్వాదము గాని నేను అడుగలేదు. యోసేపు క్రూరులైన తన సహోదరులను ప్రేమించాడు. నీవు అలాగు ప్రేమించగలవా. మనం మన గృహముల గురించి జాగ్రత్తగా ఉందాము.

కొన్ని గృహములలో దురాత్మలు ఉన్నవి. పురుషులకు అది తెలియదు. అందం వలననూ ద్రవ్యం వలననూ కొంతమంది పురుషులు వివాహము ఆడడానికి ఆకర్షింపబడతారు. అప్పుడు వారి జీవితకాలము అంత బాధపడతారు. కాని దేవుని వాక్యము నందు దేవుని వెదుకు వారికి అనంతమైన జ్ఞానము కలదు. దేవుడు మనలను బాధపెట్టవలెనని ఆశించడు. ఆయన మనలను బాధించుటలో సంతోషపడడు. ఒక ఉపాధ్యాయుడు నా దగ్గరకు ఏడ్చుకుంటూ వచ్చాడు. వారి స్థలంలో ప్రతిసారి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేయబడినప్పుడు అతను ఆ ఊరును విడిచిపెట్టుటకు ఏర్పాటు చేసుకుంటాడు. అతడు పారిపోయినప్పుడల్లా అతని కుమారుడు జబ్బు పడతాడు. తన కుమారుని బాధకు తానే కారణమని గ్రహించుకున్నాడు.

మనదేవుడు గొప్పదేవుడు. నీవు బిడ్డలతో నీవు ఏమి చేయదలచుకున్నావు. నీ బిడ్డలను దేవుని భయములో పెంచాలనుకున్నావా. అప్పుడు అటువంటి గృహములో నుండి గొప్పదీవెనలు ప్రవహించును. మన గృహం దేవుని మహిమను గూర్చి మాట్లాడునా. మీ కుమార్తె ఒక దీవెన అవునా. దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ''నేను నిన్ను ఒక గొప్ప దీవెనగా చేయుదును'' దేవుని యందు విశ్వాసం ఉంచుట ఒక గొప్ప దీవెన. ఈ గ్రంథములోని సత్యముల నుండి నేను ఎన్నడు తప్పిపోలేదు. దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను గూడా విడిచిపెట్టడు.

మూల ప్రసంగాలు