లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఉజ్జీవింపజేసే శక్తిగా దేవుడు మనలను మార్చును

కీ.శే. యన్‌. దానియేలు గారు

యిర్మియా 33:1-11,యెహెజ్కేలు 36:36
''దేవుడు ప్రేమయైయున్నాడు. ఆయన ఉజ్జీవింపజేసే శక్తి. పాపములో జన్మించిన మనము నాశనం చేసే శక్తులుగా ఉన్నాము. మనమెంత విద్యావంతులమైననూ ఎంత ధనికులమైననూ మనం నాశనం చేసే శక్తులమని మరచిపోరాదు. ఒక వ్యక్తిని నీవు నీ యింట్లో నివసించటానికి తీసుకొనినప్పుడు అతడు ప్రభువును ఎరిగితే తప్ప అతను నాశనం చేసే శక్తిగా ఉంటాడు. నీ బిడ్డలు అపాయంలో ఉన్నారు. దేవుడు మనుష్యులను సృజించే శక్తులుగా మార్చడానికి చేతయినవాడు. ప్రారంభంలో వారిని పట్టుకొని సిలువ యొద్దకు తీసుకొని వెళతాడు. అక్కడ వారు పాపులమని గ్రహిస్తారు. నీవు పాపివని గ్రహించుట ఒక గొప్ప ప్రకటన. నీకు ఏ మంచి చేయడానికి చేతకాదు. నీవు నాశనం చేసే శక్తివి.

క్రీస్తు తన యొద్దకు 12 మంది శిష్యులను పిలుచుకున్నాడు. కాని వారిలో ఒకడు నాశనం చేసే శక్తిగా మారాడు. దావీదుకు అనేకమంది కుమారులు ఉన్నారు. వారిలో చాలా సౌందర్యవంతమైనవాడు ఒక నాశనంచేసే శక్తిగా మారాడు. ఎవరు కూడా తన స్వశక్తి చేత నిలిచియుండే దానిని నిర్మించగల శక్తిగలవాడు కాడు. మానవ స్వభావం చాలా చిక్కైనటువంటిది. అది పాపపు స్వభావం. ఒకడు నేను పాపినని గ్రహించాలి. అతడు చేసిన పాపములన్ని అతని హృదయం మీద లిఖించబడియున్నవి. ఈ పాపములు అతనికి దుష్ట స్వభావమునిచ్చును. కాని మనము సిలువ యొద్దకు వచ్చినపుడు పాపులమని గ్రహిస్తాము.

సిలువలో ఒక శక్తి ఉన్నది. అవి నీకు పాపినని గ్రహించే శక్తి నిస్తుంది. ఇదొక గొప్ప లాభం. నేను పాపినని గ్రహించుటకు నాకు చాలా కాలం పట్టింది. భారతదేశములో మనము ''అందరము పాపులమే'' అని చెప్పుతాము. కాని ఇంకా కొంచెం ప్రశ్నించినప్పుడు మేము భయంకరమైనపాపులము కాదు అంటాము.

నేను గుడికి వెళ్ళేవాడిని. నాకు దేవుని వాక్యము తెలుసు క్రమశిక్షణ కలిగిన సంఘంలో పెంచబడ్డాను. నేను మంచి కుర్రవాడిని అనుకున్నాను. నేను పాపినని ఎవరూ నాకు నచ్చచెప్పలేకపోయారు. కాని నేను దానిని గ్రహించినప్పుడు అది నాకు ఎంతో లాభకరముగా ఉండింది. దేవుని ఆత్మ పాపముల ఒప్పుకొనుమని నాకు చెప్పాడు. ఆత్మ నడిపింపులకు నేను విధేయుడనయ్యాను. నేను దేవుని వాక్యమును ప్రేమించటం ఆరంభించాను. అది నా హృదయ అంతరంగములో ప్రవేశించింది. ఆటలలో నాకున్న నైపుణ్యతను బట్టి నేను గర్వించాను. నేను కుస్తీపట్టేటటువంటి ట్రిక్కులను బట్టి నేను అతిశయించాను. నేను బలమైన వాడినయినట్టు పిల్లలు నాతో చెప్పారు. కాని నేను పాపినని ఎవరూ నాతో చెప్పలేదు. ఒక దైవజనుడు బోధించేటప్పుడు నేను ఘోరపాపినని ఒప్పింపజేసాడు. నేను నాశనకరమైన శక్తినని నేను ఎన్నడూ గ్రహించలేదు. నేను నా తండ్రికి అవిధేయుడనుగా నుంటిని. నేను ఆయనకు తలనొప్పిగానుంటిని. నేను నా తల్లిదండ్రులను సంతోష రహితులనుగా చేసాను. నేను నాశనకరమైన శక్తి.

ప్రతిపాపి ఒక నాశనకరమైన శక్తి. ఒక పాపి తన పాపముల కొరకు పశ్చాత్తాపపడకపోతే తన కుటుంబమును నాశనం చేసుకుంటాడు. తన కుటుంబమును జ్ఞానయుక్తముగా నడిపించినట్లు కనిపించవచ్చు. లూకా 5ః8లో పరలోకపు వెలుగు పేతురు హృదయములోనికి ప్రవేశించడం చూస్తాము. క్రీస్తు సాన్నిథ్యంలో నిలవడానికి పనికిరాను అని అనుకున్నాడు. ఆ సమయం నుండి అతడు వ్యత్యాసమైన వ్యక్తిగా మారాడు. అతడు గొప్పవాడుగా మారతాడని క్రీస్తు ప్రవచించాడు. పేతురు తాను పాపినని గ్రహించినప్పటి నుండి ఇది ప్రారంభమైంది. పరి అగస్టీన్‌గారు తాను పాపినని గ్రహించినప్పటి నుండి ఆయన ఒక గొప్ప శక్తిగా మారాడు.

నీ పరిస్థితిని నీవు ఎరుగకపోయినట్లయితే నీవు నీబిడ్డలను నాశనంచేస్తావు. సృజించే శక్తిగా ఉన్న దేవుని ప్రేమ నీ ద్వారా పనిచేయదు. వట్టిమాటలు చెప్పే వ్యక్తిగా నీవు మారిపోతావు. యూదా!! 10-13 వరకు. నీవు ఎరుగని వాటి విషయమై నీవు పెద్ద సంభాషణలోనికి దిగవచ్చు. మనుష్యులు ఎరుగని వాటి విషయమై చెడు మాట్లాడవచ్చు. క్రైస్తవులు తమ యొక్క మాటల్లో అజాగరుకులైయున్నారు. నీవు ఒక న్యాయవాదివైయున్నందుకు నీవు దేవుని వాక్యమును బోధించి ఒక వ్యక్తి న్యాయతీర్పు తీర్చుటకు వీలులేదు. దేవుని ఉగ్రత నీ మీదకు వచ్చును. 2 పేతురు 2:11-14 వరకు ''వారు తమ సొంత దుర్నీతిలో నాశనమగుదురు'' క్రైస్తవుల మధ్య దేవుని బిడ్డలను దూషించుట. సామాన్య విషయంగా మారింది. అది శిక్షను తెచ్చునని వారు ఎరుగరు.

సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులైన వారు కూడా ఈ కారణమును బట్టి నాశనం చేయబడుచున్నారు. ఒకడు తన మాటలలో జాగ్రత్తగా ఉండవలెను. నీ వేరులోను నీ ఫలములోను రెండు సార్లు నీవు మరణిస్తావు. నీ పొరుగువాడు నీ కన్నా అధికమైన ఫలము ఫలించినప్పుడు నీవు సంతోషం లేని వాడవుగా ఉంటే నీవు సిగ్గుపడవలసియున్నది. నిజమైన దేవుని సేవ చేసే మనుష్యుని మీద నీవు రాళ్ళు విసురుదువా. దానిని బట్టి అనేక కుటుంబములు బాధనొందినవి. ప్రజలు మరణించడం నేను చూసాను. ఇదొక విచారకరమైన విషయము. రానున్న అపాయమును బట్టి దేవుని వాక్యము మనలను హెచ్చరించుచున్నది.

నీయందు నీవు నాశనకరమైన శక్తులు కలిగి ఉన్నావు. నీవు దేవుని రాజ్యమును కట్టలేవు. నీవు క్రీస్తు దగ్గరకు వస్తే ఆయన నీకు దీనుడవుగా ఉండమని నేర్పిస్తాడు. నీ హృదయమును శుద్ధీకరించుకోమని చెప్పుతాడు. నీవు నీ పాపములు ఒప్పుకొనవచ్చును. కాని అది సరిపోదు. రక్షణ అంటే పాపములు క్షమించబడటం మట్టుకు కాదు కాని పాపము నుండి విడుదల అని సుందర్‌సింగ్‌ గారు బోధించాడు. మనలో చాలామంది మీ పాప క్షమాపణ పొందే వరకు వెళ్తాం. ప్రార్థన అనేది మనము ఎత్తుగా వెళ్ళవలసినటుంటి ఒక పద్ధతి. నీవు శోధన వెంబడి శోధన జయిస్తావు. ఒకనాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడతావు. ధనాపేక్ష నీలో పూర్తిగా చచ్చిపోతుంది. శరీరం యెడల ప్రేమ కూడా చచ్చిపోతుంది. 1 యోహాను 2:14-16 వరకు ఒకడు లోకమును ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ అతనిలో లేదు.

నీవు పాప క్షమాపణతో నిలిచిపోతే నీవు గొప్ప ఆశీర్వాదమును అందుకోలేవు. నీవు దేవుని వాక్యమందు ధ్యానించాలి. నీ దుష్ట స్వభావము నుండి నిన్ను విడిపించగల శక్తి దేవుని వాక్యము ద్వారా వచ్చే శుద్దీకరించే శక్తి మీద ఆధారపడి ఉంటుంది. యెహోషువ 1:8 రాత్రింబవళ్ళు దాని మీద ధ్యానించండి! అప్పుడు నీవు దేవుని మనస్సు పొందుతావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేవి నీలో నుండి పూర్తిగా తీసివేయబడతాయి. వ్యర్థత్వం ద్వారా క్రైస్తవులు నాశనం చేయబడుతున్నారు. నీవు నీ హృదయమును పదేపదే పరీక్షించి దానిని సరిచేసుకోవాలి. అప్పుడు నీవు సృజించే శక్తిని పొందుతావు. నీవు నాశనమైన స్థలములను తిరిగి నిర్మించగలవా? యెహెజ్కేలు 36:35 దేవుడు శిథిలమైన స్థలములను తిరిగి నిర్మించగలడు. లోతు అను పేరు గల మనుష్యుడొకడుండినాడు. అతడు సృజించే శక్తిగా లేడు. అతని లోపల ధనాపేక్ష ఉండినది. అబ్రహముతో ఉండినాడు గాని జీవి రహస్యమును నేర్చుకొనలేదు. ఒక నాశనకరమైన స్థలమునకు తన కుటుంబమును నడిపించినాడు. పరలోకపు వెలుగును మనము కలిగి ఉండాలి. నాకొక బంధువు ఉండేవాడు. అతను నాతో ఉన్నంతకాలం సరిగా నడిచేవాడు. కొంతకాలైన తరువాత దేవుని భయం లేనటువంటి ఒక స్థలంను దర్శిస్తూ ఉండేవాడు. కళాశాలలో మేమిద్దరం కలిసి చదువుకున్నాము. ఒకే రూపములో కలిసి జీవించే వాళ్ళము. నా యెడల మర్యాదగా ప్రవర్తించేవాడు. క్రమంగా తన సొంతమార్గం ఏర్పాటు చేసుకోవటం ప్రారంభించాడు. నేను అతని గురించి దు:ఖపడ్డాను. అతని అంతమేమౌతుంది? నా ప్రజలు నాతో చెప్పారు. ''అతను బాగానే యున్నాడే. అతని గురించి నీవెందుకు దు:ఖపడతావు'' ఒక దైవ జనుడు సమయమునకు ముందే అన్ని విషయములు చూస్తాడు. నా స్నేహితుడు భక్తిహీనమైన కుటుంబములో వివాహము చేసుకున్నాడు. అతడు వర్థిల్లినట్లు అగపడ్డాడు. కాని పది ఏళ్ళ క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. దేవుని భయంలేని పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీవు దేవుని నిమిత్తం ఏమైనా నిర్మించినావా, లేదు! క్రైస్తవుడు ఎక్కడకు వెళ్ళినా పాడైన స్థలములను బాగు చేస్తాడు. వాటిని ఏదేను వనమువలే తయారు చేస్తాడు.

నీవు ఒక గ్రామంలో నివాసం చేయవచ్చు. దేవుడు నిన్ను అక్కడ ఎందుకు పెట్టాడు. ఆ స్థలం నిర్మాణం చేయడానికి, మొట్టమొదటిగా నీవు దేవుని వాక్యాన్ని ఆ స్థలమందు విత్తాలి. అది చేయకపోతే ఆ స్థలం దుర్మార్గ స్థలం అయిపోతుంది. దుర్మార్గులు అయిపోతారు. లోతు సొదొయకు వెళ్ళినాడు. దానిని మార్చాడా? అక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడా లేదు! డబ్బు సంపాదించటం కోసం అక్కడకు వెళ్ళినాడు. అతడు దుష్టుడైన మనుష్యుడు కాదు. అతడు అబ్రహముతో ఉండినాడు. తన చుట్టూ ఉన్నవారు చెడుగా మాట్లాడేటప్పుడు చూసి విచారించాడు. కాని నిశ్చయమైనదేదీ వారి కివ్వలేకపోయాడు. దేవుడు సొదొమను నాశనం చేయ్యాలనుకున్నప్పుడు అబ్రహము నిమిత్తం దేవుడు అతనిని రక్షించాడు. తన కుటుంబంతో రక్షింపబడలేకపోయాడు. అతని భార్య చనిపోయింది. బిడ్డలిద్దరూ దుష్టులైపోయారు. ప్రజలకు దేవుని ఎరుగవలసిన రీతిగా ఎరుగకపోతే వారి అంతము ఇలాగే ఉంటుంది.

నీవు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు దైవభక్తి తీసుకురా. నీవు ఒక కోడలివి అయి ఉంటే నీవు ఆ కుటుంబం లోనికి ప్రవేశించి దేవుని శక్తితో ఆ యింటిని నీతిలోనికి పైకి ఎత్తాలి. దేవుని వాక్యమునకు విధేయులు అవుటకు కూడా వారిని పైకి ఎత్తాలి. దేవుని వాక్యమును ఆ కొత్త యింటికి తీసుకువెళ్ళి దేవుడు చెపుతున్నాడు. ''నా పేరు పెట్టి పిలువుము'' దేవున్ని పిలుచుట నేర్చుకున్నావా. నేను విద్యార్థిగా ఉండినప్పుడు నాతో కాలేజీలో చదువుకున్నవారు అనుకున్నారు. నేను ప్రార్థన చేసినంతగా చేయనక్కరలేదని. కాని దేవుడు నాకు నేర్పించింది ఏమంటే నేను నివశించుచున్న హాస్టలును నేర్చు మార్చవలెనని. ఒక సంవత్సరము లోపల సువార్త అంటే సిగ్గుపడిన వారు నేను బోధించడానికి వెళ్ళినపుడు నాతో కూడా వచ్చారు. నేను మోకాళ్ళ మీద నా బైబిలు చదివినప్పుడు వారు చూసి నవ్వేవారు. యిర్మియా 33:3 ''నాకు మొర్రపెట్టుము. నేను నీ కుత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులకు నీకు తెలియజేతును''. దేవుడు నీ కొరకు గొప్పవి, శక్తివంతమెనవి నీ నిమిత్తము దేవుడు ఒక గొప్ప విషయమును దాచియుంచినాడు. నీవు యెహోవా నామమున ఎలాగు ప్రార్థన చేయవలెనో ఎరుగవలెను. నీవు మారుమనస్సు పొందవలెను. మోహము, వ్యర్థత్వము నిన్ను విడిచిపెట్టిపోవలెను. ఇవి నాశనకరమైన శక్తులు.

విలియంకేరి, లివింగ్‌స్టన్‌ యొక్క జీవితములు చదవండి. వారి జీవితములో వ్యర్థత్వము కనబడదు. సైతాను నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు జాగ్రత్త! నీకు పవిత్ర హృదయం శుద్దమైన మనస్సాక్షి ఉంటే అప్పుడు దేవునికి ఈలాగు ప్రార్థన చేస్తావు. ''ప్రభువా పరిస్థితులు ఈలాగు ఉన్నాయి. నన్ను ఏమి చేయమంటావు''.

ఒకసారి మా హాస్టలులో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య పోరాటం వచ్చింది. నేను హాస్టలులో చేరినప్పుడు దేవుడు చెప్పాడు. ''ఈ నూరుమంది విద్యార్థులకు నీవు పాస్టరువి. ఈ నూరు మంది విద్యార్థుల కొరకు ప్రతి సాయంకాలము దేవునికి మొర్రపెట్టేవాడిని. ఒక తీవ్రమైన సంఘర్షణ వచ్చినపుడు నేను ప్రిన్సిపల్‌ గారిని కలుసుకున్నాను. ఆయన నా మాటలు ఆలకించాడు. నా సలహా తీసుకున్నాడు. ఈ పరిస్థితిని చూసుకొమ్మని నాకు అప్పజెప్పాడు. చీలిక బాగు చేయబడింది? మీ ప్రిన్సిపాల్‌గారు నీ మాట విన్నారా? ఆయన ఎదుట మంచి మాదిరి పెట్టావా? నేను హాస్టలులో ఉన్నంత కాలం క్రీస్తు మహిమ పర్చబడ్డాడు. నీవు ఎక్కడ ఉన్నప్పటికి నీవు దేవునికి మొర్రపెడితే ఆయన గొప్ప వాటిని నీకు చూపెడతాడు.

నీకు అపజయం అనేది లేదు. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసునా? దేవుని కొరకు ఏమీ సంపాదించలేకపోతున్నావు. ఎందుకు నీవు దేవునిని పిలవడం లేదు. శుద్దమైన మనస్సాక్షి కలిగియుండుము. దేవుని నామము ఎత్తి పిలువు. నీవు ఒక గ్రామంలో ఉన్నప్పుడు అంతా ఒంకరటింకరగా ఉంటే దేవునికి ప్రార్థన చేయుట ఆరంభించు. అప్పుడు అన్నియు సరియైన క్రమమునకు వస్తాయి. నీ ఆటస్థలానికి కావాల్సినంత నీళ్ళు లేకపోతే ప్రార్థన చేయి నీకు అది లభిస్తుంది. సమస్తము క్రమములోనికి వస్తుంది. పచ్చిక బయలులో మాకు పచ్చని గడ్డి లేకపోతే మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మాకు వర్షాన్ని పంపిస్తాడు. ప్రార్థన చక్కపర్చలేనటువంటి కార్యము ఏదీ లేదు. నీవు ఎక్కడికి వెళ్ళితే అక్కడ సమాధానాన్ని తెస్తావు. దేవుని వాక్యమును ప్రజలకు నేర్పించు.

కాపీయింగ్‌ ఎత్తివేయడానికి నేను చాలా ప్రార్థన చేసాను. మన క్రైస్తవ పాఠశాలలు గుణశీలతను పిల్లలకు నేర్పితే ఈ దేశము బాగుపడుతుంది. నీవు దేవుని కొరకు ఏమైనా నిర్మించినావా? ఈ దేశమును దాని గతికి నీవు విడిచిపెట్టకూడదు. అది దుర్భరమైన పరిస్థితిలో ఉంది. దానికి వెలుగు లేదు. ''నాకు పిలువుము'' అని దేవుడు చెపుతాడు. యెహోషువాయు, నెహెమ్యాయు దేవుని కొరకు గొప్ప వాటిని సాధించియుంటే అది వారు దేవుని నామము పేరిట పిలిచినారు గనుక. నీవు కూడా దేవుని నామము పేరిట పిలువుము. యెరూషలేము గోడలు విరిగిపోయినవని చూసినప్పుడు నెహెమ్యా కన్నీరు విడిచాడు. నీ సంఘము ఎలాగు ఉన్నది? నీ బిడ్డలు అక్కడ ఎదగాలి? మనం దేవా రాత్రులు దేవునికి మొర్రపెట్టాలి. నేను ఓ యౌవనస్త్రీని లేకపోతే బఠి కుర్రవాణ్ని అని చెప్పవద్దు. మనం నిశ్శబ్ద్దముగా ఉంటే త్వరలోనే మన సంఘము ఒక అరణ్యముఆ తయారవుతుంది.

పాపము వ్యభిచార గృహములలోను, యదార్థత లేనటువంటి స్థితి బడులలో ఉన్నవి. తిర్నతవేలిమిషన్‌ స్కూల్స్‌లో ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైన విషయములు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతము భారతదేశపు గవర్నమెంటు వారు క్రైస్తవ పాఠశాలలు మీద నమ్మకం లేకుండా ఉన్నారు. ఇది మనము దేవుని నామమును బట్టి ఆయనను పిలవకపోవడం వలన! ''నా పేరు పెట్టి పిలువుము'' అని దేవుడు సెలవు ఇస్తున్నాడు. నీవు చేయవలసిన బలమైన విషయములు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వాటిని నీకు చూపించలేడు. నీవు ఇంకనూ సిద్ధముగా లేవు. నీ వ్యక్తిత్వములోనికి దేవుని వాక్యము వెళ్ళలేదు. నీ దుష్ట స్వభావము నిన్ను విడిచిపెట్టలేదు.

నేను కొన్నిసార్లు దేవుని వాగ్దానములు నెరవేర్పును గూర్చి భయపడుతూ ఉంటాను. ''దేవుడు నాకనుగ్రహించే మంచి విషయములను నేను వినియోగించుకోగలనా? నేను యదార్థవంతుడిగా పరిపూర్ణుడుగా ఉండగలనా'' నేను జాగ్రత్తగా ఉన్నాను. నా హృదయమును నేనే పరిశోధించుకుంటున్నాను.

మీరందరూ దేవుని మొర్రపెడుతున్నారా. దేవుని వాక్యము మనలోనికి వెళ్తుందా? అది మనలను శుద్దీకరిస్తుందా? క్రైస్తవ పనివారు స్త్రీ పురుషుల మధ్య పనిచేయవలెను. మనలో పరిశుద్దత ఉన్నదా? ''నాకు మొర్రపెట్టుము'' నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవుని వాక్యమును పఠించు. దేవుని వాక్యముననుసరించి లేనిదంతా నీలో నుండి తీసివేయి. ఒకనాటికి నీవు మోషేగాను, యెహోషువగాను, పేతురువుగాను ఉంటావు. ఈ దేశము అలాంటి వారిని చూడాలి. ఈ సహవాసము ఎల్లప్పుడూ దేవుని నామము బట్టి ప్రార్థన చేసి బలమైన వాటిని చూసే ఫెలోషిప్‌గా ఉండాలి.

నీ స్థలమును నీవు ఏదేను వలే మార్చాలి. దేవుడు నిన్ను శిథిలమై పోయిన స్థలమును కట్టడానికి ఏర్పాటుచేసుకున్నాడు.

మూల ప్రసంగాలు