లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని మార్గము

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తనలు 103 : 7

''ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనుపరిచెను.'' ఆయన తన మార్గములను తన క్రియలను మోషేకు, ఇశ్రాయేలుకు మట్టుకే వెల్లడిపరిచాడు. ఎందుకు, దానికి కారణం ఏమి. దేవుడు ప్రజలు అందిరికీ నేర్పించలేడు. వినడానికి సిద్ధముగా ఉన్నవారికి దానిని పొంది విధేయులు అయ్యే వారికి మట్టుకే ఆయన నేర్పించగలిగాడు. మోషే ఎవరు మోషేకు ఒక పవిత్రపరచబడిన కుటుంబం ఉండింది. అతని అన్న, అతని సహోదరి తక్కిన వారి నుండి వ్యత్యాసముగా ఉండినారు. ఆ గృహములో ఉండిన విశ్వాసపు మెట్టు ఎలాగు ఉండింది. అంటే దేవుడు ప్రవేశించి ఆయన చిత్తము కొరకు వారిని సిద్ధపరచగలిగిన రీతిగా ఉండింది. దేవుడు ఏశావుకు తన్ను తాను బయలుపరచుకొనలేకపోయాడు. కాని యాకోబుకు అయితే అలాగ చేయగలిగాడు. దానికి కారణం ఏమి ఇశ్రాయేలుకు దేవుడు తన కార్యములను బయలు పరిచాడు. ఇశ్రాయేలీయులు అబ్రహము యొక్క సంతానము. వారు నమ్మినటువంటివి వారి అలవాట్లు వేరుగా ఉండినవి. ఒక గృహము యొక్క వెనుక చరిత్ర చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రుల యొక్క జీవితము వారి విశ్వాసము చాలా ముఖ్యమైనది. మోషే యొక్క తల్లిదండ్రులు చాలా వేరుగా ఉండినారు. దేవుడు మోషే వంటి వ్యక్తిని వేరే ఏ ఇతర గృహములోనికి ఇవ్వలేకపోయాడు. దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. ''నేను లోకములోనికి పంవలసిన ఒక ప్రవక్త ఉన్నాడు''. ''నేను ఎక్కడకు అతనిని పంపగలను. స్నానికుడైన యోహానును ఎక్కడకు పంపగలను'' అని అడుగుచున్నాడు. ఆయన అతనిని ఏ యాజకుని గృహములోనికైనా పంపగలడా? జకర్యా జీవితం పరీక్షించబడింది. దేవుడు అతనిని అతని భార్యను దేవుని ధర్మశాస్త్రానుసారంగా పరిపూర్ణులుగా తెలుసుకున్నాడు. వారు పరిపూర్ణులు అని దేవుడు చూసాడు. వారు ధర్మశాస్త్రము నమ్మడమే కాక దానిని అవలంభించారు. అది వారి జీవిత విధానముగా మారిపోయింది. విశ్వాసము మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. బిడ్డలు ఆ వాతావరణము లోనికి వచ్చినపుడు వారు విశ్వాసమును తీసుకుంటారు. తల్లిదండ్రులు దేవునిని జాగ్రత్తగా వెదికి భయముతో వణుకుతూ ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నించినపుడు గొప్ప వ్యక్తుల్ని పెంచడానికి సిద్ధపడుతున్నారు. వేరే ఏ ఇతర గృహములోనికి స్నానికుడైన యోహానును దేవుడు పంపలేకపోయాడు. ఆ గృహములోనికి యోహాను రావడం హఠాత్‌ సంభవము కాదు. దేవుని క్రియలు హఠాత్‌ సంభవములు కాదు. దేవుని తలంపులు ఉన్నతమైనవి. ఆయన క్రియలలోనికి జ్ఞానము, తీర్మానము ఆయన క్రియలోనికి వెళతాయి.

మోషే తన తల్లి దగ్గర నుండి సంపాదించిన కలవరములు ఫరో ఇంటిలో కూడా అతనిని ఉంచలేదు. ధనికులు అయిన వారితో మనం సంబంధం కలిగిఉన్నప్పుడు లేక మనమెట్టు కన్నా చాలా ఉన్నతమైన మెట్టు వారితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం త్వరలో మన మార్గములను వారి మార్గాలలోనికి అనుగుణ్యము చేసుకుంటాము. ఒక ధనికుని కారులో ప్రయాణము చేస్తూ ఆయనతో సంభాషణ పెట్టుకోవడం నీకు హాని కలిగిస్తుంది.

దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్ష పరచుకోవడం కారణం ఏమిటంటే నీ జీవితంలోని నీవు పెద్ద విషయములుగా ఎంచుకున్నటువంటివి దేవుని దృష్టిలో పెద్ద విషయములు కావు. మోషే ఎలాంటి వాడు. ఆయన ప్రతి దినము దేవుని కలుసుకోగలిగిన వ్యక్తి. ఆయన ఇశ్రాయేలుకు దేవుని ధర్మశాస్త్రమును అందించిన వాడు. దేవుని సన్నిధి యొక్క తాకుడు ఆయన శరీరాన్ని ఆరోగ్యంగా 120 ఏళ్ళ వయస్సు వరకు కాపాడింది. కీర్తనలు 106:23 ''అప్పుడు ఆయన - నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింప జేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను'' గొప్ప ప్రత్యేక లక్షణము చూడండి. అందరూ అది చేయలేరు. దేవుడు ఇశ్రాయేలు అందరినీ నాశనం చేయబోవుతున్నాడు. ''వారిని నాశనం కానివ్వండి'' అని ఒకడు ఆలోచించవచ్చు. కాని మోషే అలాగు లేడు. మోషే ఖాళీ స్థలంలో నిలబడ్డాడు. '' నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి వేయుము'' అని అన్నాడు. ఆయన గొప్ప ప్రత్యక్షతలను ఇచ్చుటకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఈ భాగమును చదివితే ఆయన పూర్తిగా న్యాయవంతుడని గ్రహింపు అవుతుంది.

యెహేజ్కేలు 22:30 ఖాళీ స్థలములో నిలబడ గల వ్యక్తి కొరకు దేవుడు వెదుకుతున్నాడు. తన జీవితమునే ఆధారముగా పెట్టి ఆత్మీయ పోరాటము జరిపాడు. కాని అలాంటి వారిని దేవుడు కనుగొనలేడు. మన కటుంబము వైపు చూసినప్పుడు దేవుడు చాలా దు:ఖ పడతాడు. మన క్రైస్తవ కళాశాలలు వీటిని నేర్పించవు. యాకోబు పెనూ యేలు దగ్గర దేవుని చెయ్యి విడిచి పెట్ట్టడు. లోకస్థుడైన యాకోబు ఆ స్థితికి రావడం ఒక గొప్ప విషయం. ఆ ప్రత్యేకమైన రాత్రి జరిగిన విషయములన్నీ తన చిన్న కుమారుడైన యోసేపుకు వల్లించి యుంటాడు. ఆ రాత్రిలో అతడు సంపాదించిన కుంటితనము గూర్చి ప్రశ్నలన్నిటికి జవాబు ఇచ్చి ఉంటాడు. దేవదూత అతనితో మాట్లాడిన విషయాలను గూర్చి అతనితో చెప్పి ఉంటాడు. ఇదంతా యోసేపు మనస్సులో నాటుకు పోయింది. నీ బిడ్డలతో నీవు చెప్పే దేవునితో నీ మొట్టమొదటి అనుభవం ఓ గొప్ప దీవెన.

మూల ప్రసంగాలు