లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీ దేశములో నుండి వెలుపలికి వెళ్ళుము

కీ.శే. యన్‌. దానియేలు గారు

ఆదికాం 12:1
''యెహోవా - నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము''. అదే విషయమును, దేవుడు ప్రతి వ్యక్తికి చెప్పుతున్నాడు. మనము మన తండ్రి యింటిని అక్కడ ఆయన ప్రభువుగా లేకపోతే మనం విడిచిపెట్టాలని దేవుడు సెలవు ఇస్తున్నాడు. నీకు ఇంకా గొప్పతండ్రి ఉన్నాడు. గనుక నీతండ్రి ఇంటిని విడిచిపెట్టు. ఆయన నిన్ను భద్రపరచి నీకు ఆధారముగా ఉండి నిన్ను దేవుని బలిష్టమైన కుమారులలో ఒకనిగా చేయాలని చూస్తున్నాడు. నిత్యము నిలుచు పరలోకపు ఆస్తిని నీకు ఇవ్వాలని చూస్తున్నాడు. నిత్యము నిలుచు దేవునియందు నీవు విశ్వాసము నిలుపవలెనని ఆయన కోరుతున్నాడు. నీ బంధు జనులను విడిచిపెట్టు. విశ్వాసపు బంధువులను కలుసుకొనుటకు విడిచిపెట్టు. నీ దేశమును అది విగ్రహారాధన దేశము అయితే దానిని విడిచిపెట్టు. నీవు విగ్రహారాధన వాతావరణంలో ఉన్నట్లయితే దేవుడు దానిని విడిచిపెట్ట మంటున్నాడు. చీకటితో నిండియున్న బంధుజనుల మధ్య నీవు ఉన్నట్లయితే వారు నీ ఆత్మీయ జీవితమునకు సహాయపడరు. గనుక వారిని విడిచిపెట్టు. అది నీకు ఒక తేటయైన నడిపింపు. ఈ దినమున కూడా అనేకమంది క్రైస్తవులు హృదయము నందు కఠినులైయున్నారు. వారు ఇంకనూ పాతకాలపు అన్యుల అలవాట్లను అనుసరించుచున్నారు. నీవు ఆ యింటిలో ముందుకు సాగలేవు. దేవుడు నీకు తేటయైన నడిపింపు ఇచ్చినపుడు నీవు దానికి విధేయుడవు కావాలి. నీ విధేయతలో రాజీ పరిచేటటువంటివి గానీ సవరణను గాని వెంబడించవద్దు. దేవుని వద్ద నీ యొక్క జీవితమును ఆటంకపరిచే ప్రతి దానిని నీవు విడిచిపెట్టాలి. దీని భావము నీవు నీ బంధు జనులను ద్వేషించవలెనని కాదు. నీ బంధు జనులకు కలరా తాకి ఉంటే వెళ్ళి వారితో భోజనం చేయటం గాని వారితో నివసించటం గానీ చేయవు. నీవు అన్య జనులతో సులువుగా మాట్లాడే సులువుగా సంభాషించే అలవాట్లతో ఉంటే నీవు అపాయకరమైన తలంపులను తీసుకుంటావు. నీ బంధువుల ఇంట్లో స్పోటకము ఉన్నట్లయితే వారి ఇంటిని నీవు విడిచిపెడతావు. నీవు డాక్టరువు అయితే నీవు వారికి చికిత్స చేయటానికి మట్టుకు ఇంటికి వెళతావు.

మగపిల్లలు, ఆడపిల్లలు మారు మనస్సు పొందినప్పుడు వారి బంధువులను బట్టి వారు ముందుకు సాగరు. చిట్టచివరగా వారు ''దేవుని వాగ్దానం ఎక్కడ. విజయము ఎక్కడ'' అని పలుకుతారు. కాని దేవుడు ''నీవు నా మాటలకు విధేయుడవు అయినది ఎక్కడ'' అని అడుగుతాడు. అబ్రహాము తన ఊరులో తన బంధు జనుల మధ్య ఉండి 30 సం|| తర్వాత ''నా జీవితంలో ముందుకు సాగినది ఎక్కడ ''అని అడిగితే దేవుడు ఏమంటాడు. దేవుడు ''నిన్ను ఒక గొప్ప జనముగా చేయుదును'' అని సెలవు ఇచ్చాడు. అబ్రహాము దేవునికి విధేయుడు అయినాడు గాబట్టి అది నెరవేరింది. యూదులు క్రీస్తుకాలంలో ఆయనను బాధించారు. కనుక బాధపడ్డాడు. వారు దేవుని న్యాయతీర్పును వారి మీదకు తెచ్చుకున్నారు. ఈనాటికిని హిట్లర్‌ తన ఖడ్గమును యూదులకు వ్యతిరేకముగా లేపినప్పుడు అతడు నాశనం అయిపోయినాడు. ఎందుకనగా దేవుని వాగ్దానములు వారిని ఇంకనూ వెంటాడుతున్నాయి.

తల్లిదండ్రులు వారి విధేయతను బట్టి ఒక ఆశీర్వాదం విడిచి వెళ్ళితే అది వారి సంతతిలో తరతరములు ఉండును. దేవుడు ఆశీర్వాదమును తొలగించడు. కాని పిల్లలు అనేక శాపములను కూడగట్టికోవచ్చు. కాని తల్లిదండ్రులు సంపాదించినది ఎన్నడూ తొలగిపోదు. యూదులు చాలా తెలివిగలవారు. వారు గొప్ప శాస్త్రజ్ఞులను మనకు ఇచ్చారు. గొప్ప గణిత శాస్త్రజ్ఞుడైన ఐన్‌స్టీన్‌ ఒక యూదుడు. ఆటంబాంబు యొక్క నాశనం చేసే శక్తిని ఆయన ముందే తెలియపర్చాడు. ఈ దినమున ఆ లెక్కలన్నీ చాలా నిజము. అనేకమంది డాక్టర్లు, లాయర్లు, చాలా ధనికులైన ప్రజలు ఈ దినములలో కనబడతారు. వారి ధన సమృద్ధి వారిని ఎక్కడికో నడిపించదు. వారు మెస్సయాను గూర్చిన వాగ్దానము కొరకు వారు ఇంకనూ ఎదురుచూస్తున్నారు. కాని క్రీస్తులో ఆ వాగ్దానం నెరవేరిందని వారు ఎరుగరు.

దేవుడు నీతో 'నేను నిన్నొక దీవెనగా చేస్తాను' అని చెప్పితే నీవు సంతోషిస్తావు. ప్రతి యౌవనస్థుడు ఈ వాగ్దానపు నెరవేర్పును చూడగలడు. ఎలాగు? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకపోవడం ద్వారా, వారు పుట్టిన విగ్రహారాధన సంబంధమైన స్థలములు విడిచిపెట్టడం ద్వారా, ఒక యౌవనస్థుడు దేవుని సలహా యొక్క భావం గ్రహించి దానిని వెంబడించినట్లయితే అతడు ధనవంతుడౌతాడు. ఆ డబ్బు వెనుక అతడు పరుగెత్తనవసరం లేదు. అతని ధనం దేవునితో ఉంది. ఆయన బిడ్డలలో ప్రతి ఒక్కరూ దీవెనగా అవుతారు. ఆది ఎంత గొప్ప ఆస్తి! నీ ధనమును నీవు ఎరుగుదువా. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివా లేకపోతే నీవు రంధ్రములు కలిగినటువంటి పాత్రవలే ఉన్నావా? నీవు శుద్దీకరించబడ్డావా? దేవుని వాక్యం నీ హృదయంలో నిలువ చేయబడిందా? నీవు దేవుని వాక్యముతో నింపబడినట్లయితే నీవు ఒక గొప్పశక్తి సజీవుడైన దేవుని వారు ఉన్న విశ్వాసము నీ యందు ఎదుగుతూ ఉంటుంది. ''నిన్ను ఆశీర్వదించే వాడిని ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వారు శపించబడతారు. లోకములోని కుటుంబములన్నియు నీయందు ఆశీర్వదించబడును.'' దేవుని వాక్యములో ఉన్న గొప్పతనమును గ్రహించగలిగితే ఎంత మేలు!

నిన్ను తాకే వారందరికీ దేవుడు నీవు ఆశీర్వాదముగా ఉంటావని చెబుతున్నాడు. నీవు, ''యెహోవా నాకాపరి నాకు లేమి కలుగదు'' అని చెప్తావు. వ్యాధి నిన్ను జయించలేదు. అకాల మరణం నిన్ను పట్టుకోదు. దుర్మార్గత, దుష్టత్వము నీ బిడ్డలను జయించదు. నీ గృహములో సమాధానము ఉంటుంది. ఏ దొంగ నీ యింటిని తాకలేడు. దేవుడు నీతోనే ప్రయాణములన్నిటిలో ఉంటాడు. నీ భార్య ఒక బలీవ చెట్టయి ఉంటుంది. నీ బల్ల చుట్టూ చిన్న బలీవ మొక్కలు ఉంటాయి. నీ తలదిండును ముట్టగానే నిద్రపోతావు. నీవు చెల్లించవలసిన డాక్టరు బిల్లులు ఉండవు. ఒక కోటీశ్వరుడు అంటే ఇలా ఉంటాడు. ఆదాము పోగొట్టుకొనినది అబ్రహము సంపాదించుకున్నాడు. హవ్వ పోగొట్టుకొనినది శారా సంపాదించింది. వారిద్దరూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండినారు.

ఆదికాండము 15:1 ''నేను నీకు కేడెయునైయున్నాను'' దేవుడు నీ కేడెము అయి ఉంటే నీవు పోగొట్టుకున్న దేమిటి. గొల్యాతు ముందు ఒకడు డాలు పట్టుకొని వెళుతుండినాడు. కాని అది గొల్యాతుకు ఏమీ కాపుదల ఇవ్వలేదు. దావీదు అతనిని చంపివేసినాడు, దేవుడు అంటున్నాడు. ''నీ ముందు డాలు మోసుకొని వెళ్ళుదును''. దేవుడు నీ బహుమానము అయితే నీవు దేనినీ పోగొట్టుకోవు. అల్లాఉద్దీన్‌ దగ్గర ఒక ద్వీపము ఉండింది. దాని ద్వారా అతనికి కావాల్సినదంతా దొరికింది. ఒక యుక్తి గల మనుష్యుడు వచ్చి మోసం ద్వారా తన ద్వీపమును దొంగిలించాడు. అల్లావుద్దీన్‌ పేదవాడు అయిపోయినాడు. నీవు దేవుని పోగొట్టుకుంటే నీవు పేదవాడివి అయిపోతావు. ''నేనే నీ గొప్ప బహుమానము'' అని దేవుడు చెప్పాడు. ఓ క్రైస్తవుని యొక్క నిజమైన ధనము ఎక్కడ ఉన్నది? దేవుని వాగ్దానములో! నీకే వాగ్దానములు ఉన్నవా?

నీవు ఆయన రాజ్యములోనికి వచ్చినావా? ఆయన నీ పాపములు క్షమించినాడా. నీ జీవితం ఎక్కడ ఆరంభమవుతుంది? దేవుడు నీకు వాగ్దానములు ఇవ్వడం ఆరంభిస్తాడు. అప్పుడు నీవు ఒక బానిసపు కావు అని దేవుడు చెపుతున్నాడు. నీవు తిరిగి పుట్టక మునుపు నీవు ఒక దాసుడవు గానో లేక అడుక్కుతినే వాడివిగా ఉన్నావు. అనేకమంది క్రైస్తవులు దాసులుగాను అడుక్కుతినే వారిగానూ ఉన్నారు. నేనొక స్థలములో బోధించుచూ ఉంటిని. అక్కడొక తెలివిగలవాడు ఉండినాడు. అతడు పాపములు ఒప్పుకోవడానికిగాని, పశ్చాత్తాప పడటానికి గాని ఒప్పుకొనలేదు. అతడు సైకిల్‌ మీద 40 మైళ్ళు వెళ్ళి వారు ఆ ప్రాంతపు మిషనరీగారిని తృప్తి పరచవలెనని బోధించినాడు. సైతాను ఇటువంటి వారితో ''నీవు వెళ్ళి బోధించు'' అని చెప్తుంది. వారు వ్యభిచారం లాంటి పాపంలను దాచిపెట్టి బోధిస్తారు. సైతాను వారిని చూచి నవ్వుతాడు. పాపమును దాచిపెట్టే వారు ఏం బోధిస్తారు. పాపం యొక్క గ్రహింపు వారి మార్గములో వారు వేయు ప్రతి అడుగులోను వారిని ఆటంక పరుస్తాయి. ఒక స్త్రీ వచ్చి మన కూటములకు హాజరయింది. పరిశుద్ధాత్ముడు మనుష్యుల మీదికి దిగి వచ్చాడు. ఆమె తన పాపములు ఒప్పుకొని ప్రార్థించింది. ఆ సమయంలో ఆమె భర్త అక్కడ లేడు. జరిగిన విషయమును గూర్చి ఆయన విన్నప్పుడు ఆమెను ఇంటిలో నుంచి పంపించి వేశాడు. కాని ఆమె ప్రచించటం ప్రారంభించింది. భర్త అదిరిపోయాడు. అతడు ఆమె వైపుకు ఆకర్షించబడ్డాడు. దేవుని యొద్ద నుంచి ఆమె చాలా జ్ఞానం సంపాదించుకొన్నది. ఆమె పాపపు ఒప్పుకోలు ఆమెను దేవదూతవలే చేసింది.

మన సంఘములలో ఉండే దుర్మార్గత, దు:ఖకరంగా వ్యభిచారంలో జీవిస్తున్న మన యౌవనస్థులలో కనబడుతుంది. వారు ఎలాగో మారుమనస్సు పొందని వారిని వివాహం చేసుకుంటారు. వారికంటే చిన్నవారు వారి యొక్క మాదిరిలో నడుస్తారు. అబ్రహాము ఇంటిలోని ధనమును మట్టుకు హాజరు కోరింది. ఆమె కనులు అబ్రహము యొక్క ఆత్మీయ ధనం మీద లేవు. దేవుని ఆశీర్వాదములు 1000 తరముల వరకు వెంబడించును. హాగరుకు విశ్వాసం ఉండి ఉంటే ఆమె కుమారుడు అత్యధికముగా దీవించబడును. శారా చెప్పింది. హాగరు వెళ్ళిపోవాల్సిందే. ''ఇస్సాకు యొక్క జీవితమునకు హాగరు యొక్క కుటుంబము ఒక శాపముగా మారును.''

మన వీధులలో గాడిదలు ఉంటాయి. గాడిదల వంటి కుర్రవాళ్ళతో స్నేహం చేయవద్దు. ఇస్సాకు సాధారణమైన కుమారులు కాదు. ఆయన దేవుని యొక్క ఈవి. ఆయన ద్వారా దేవుని నామం మహిమ పరచబడును. శారా సరిగా చెప్పిందని దేవుడు అన్నాడు. ఇస్సాకుకు ఈ స్నేహితుడు అవసరం లేదు - ఇశ్మాయేలు. ఆ గృహంలో ఇక హాగరు యొక్క మాట వినబడకూడదు. దేవుని కన్నులు నమ్మకోస్థులైన స్త్రీల మీద ఉన్నాయి. వారు ఈ లోకమునకు రక్షకులు. దేవుడు యౌవన స్త్రీలను నమ్మకస్థులుగా ఉండమని కోరుతున్నాడు. దేవుడు నిన్ను ఇస్సాకువలె దీవించును. నీ విశ్వాసము ఇస్సాకు నందు అభివృద్ధి చెందును. నీ ధనమేమీ? కొంతమంది వాగ్దానములు పొందుతారు, కాని వాటి నెరవేర్పును చూడరు. కనుక వారు పేదవారుగాను కనికరింపబడవలసిన వారుగాను అయి ఉన్నారు. నీవు దేవుని వాగ్దానములను పొంది నిద్రించుచున్నావా? దేవుడు నాకు ఆయన వాగ్దానములను గూర్చి జ్ఞాపకం చేసాడు. వాటిని స్వతింత్రించుకోమని చెప్పాడు. ఆయన వాక్కును నీవు నెరవేర్చినప్పుడు పరలోకపు సైన్యములు నీ వెనుక వచ్చును. అబ్రహాం ఎక్కడకు వెళ్ళితే అక్కడకు దేవదూతలు కూడా వచ్చారు. నీకు కూడా ఇదే జరుగుతుంది. మనం దేవుని వాక్యములో జీవిద్దాం.

అబ్రహాము పరిపూర్ణముగా విధేయుడు కాలేదు. కానీ ఆయన విధేయతను నేర్చుకున్నాడు. మనం దేవుని బిడ్డలము అయి ఉన్నప్పుడు మనం దేవునికి విధేయులము అయి ఉండుట నేర్చుకొంటాము. దేవుని ఆశీర్వాదము అనేకమంది సులువుగా పారవేసుకుంటారు. హాగరు పారిపోవాలని ఆశించింది. అబ్రహము ఇంటిలో ఉన్నటువంటి దీవెనను ఆమె గ్రహించిందా? ఒక అయుక్తి గల స్త్రీ గ్రహించుకోదు, దేవుని ఇంటిలో నివసించలేదు, దేవుని బిడ్డలతో జీవించడం ఆమెకు సంకటంగా ఉంటుంది. ఆమె పారిపోతుంది. ఆమె ఇష్మాయేలును ఒక ఐగుప్తియ బాలునిగా పెంచింది. సత్యమును గ్రహించడానికి కావాల్సిన తెలివితేటలు శారాకు ఉండినవి. సత్యమును వెదికి కనుగొనే కనులు, వినే చెవులు ఆమెకు ఉండినవి. మన ధనాగారం ఏమంటే క్రైస్తవ గృహములోను క్రైస్తవ సంఘములోను ఉన్నటువంటి క్రైస్తవ తర్పీదు.

దేవుని పిల్లల యొక్క సహవాసములో దుర్మార్గమైన ప్రభావములు మనలను అంటలేనటువంటి వాతావరణమును కలిగించును. హాగరు ఈ ఆశీర్వాదములను గూర్చిన గ్రహింపు లేదు. వాటిని సంపాదించుకోలేదు. విశ్వాసపు నడకలు శారా ఒకప్పుడు అబ్రహము వెనుక ఉండింది. ఈ పరిస్థితిలో ఆమె అబ్రహముకు ముందుగా వెళ్ళిపోయింది. ''ఆమె చెప్పిన మాట విను''మని దేవుడు చెప్పాడు.

ప్రభువు శారాను దర్శించినాడు. అది ఒక గొప్ప దీవెన. జీవితములో ఆమెకు సకల విధమైన మార్పును తెచ్చింది. ఒక దేవదూత హాగరు దగ్గరకు కూడా వచ్చింది. కాని ఆమెకు బేధమేమీ కనబడలేదు. అనేకమంది దేవునిని ఆయన ఈవులను సులువుగా ఎంచుతారు. నీ సాక్ష్యమును దేవుడు నీకిచ్చిన స్వస్థపరిచే శక్తిని ఎక్కడపడితే అక్కడ వినియోగించవద్దు. ఈ ఈవులు క్రీస్తు ఎక్కడైతే మహిమ పరచబడతాడో అక్కడ వినియోగించు.
మూల ప్రసంగాలు