లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవునికి సమీపముగా వచ్చుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

2 దిన వృ 20 : 13
ఇది యెహోషాపాతు కాలము. యూదా దేశము రాజులలో గొప్పవాడు. మనుష్యులను దేవునికి సమీపంగా తెచ్చునప్పుడు ఆయన బైబిలు బోధించే వారిని మనుష్యులలోనికి పంపినాడు. ఒకసారి మోయాబీయులు, అమ్మోనీయులు ఆయన రాజ్యముపై దండెత్తిరాగా రాజు మనుష్యులను యెహోవా దగ్గరకు చేర్చాడు. ఈ రిట్రీటులో మనం ప్రభువు యెదుట కలుసుకుందాం. దేవుడు ఎన్నడు తప్పిపోడు. చీకటి శక్తుల మీద ఆయన మనకు జయం ఇచ్చాడు. రాజు మొదలుకొని అతి దీనమైన చిన్న బిడ్డ కూడా ప్రజలందరూ దేవుని యెదుట కలుసుకున్నారు. ఇది ఎలాంటి విశ్వాసము! యెహోషాపాతు విశ్వాసము కలిగిన అద్భుతమైన రాజు. ఆయన గృహమును నాశనము చేసిన ఒక గొప్ప తప్పును చేసాడు. అతడు దుష్టుడైన ఆహాబురాజుతో వివాహ సంబంధమైన బాంధవ్యము ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషాపాతుకు తన కుమారుని నిమిత్తమై ఒక రాజు కుమార్తెను కోరాడు. ఈ తప్పుడు అంతస్తు దేవుని దృష్టిలో రాజకుమారుడు మార్పు చెందిన ఒక వ్యక్తి. కాని తప్పుడు అంతస్తు అతనిని పాడు చేసింది.

ప్రజలందరూ దేవుని యెదుట నిలువబడి యుండగా ఆ దినమున గొప్ప విజయము దొరికింది. ఇబ్బంది కలిగినపృడు యెహోషాపాతు ప్రజలందరినీ యెహోవా యెదుట సమకూర్చాడు. సంఘము ఒక భయంకరమైన పరిస్థితి ద్వారా వెళుతున్నట్లుగా నేను గమనించుచున్నాను. నులి వెచ్చనితనం వ్యాపిస్తూ ఉన్నది. మనం దేవుని యెదుట అందరం కలుసుకోవాలి. ప్రభువు ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో సహవాసంను ఈ దుష్టత్వం ఆపు చేయటానికి వాడుకుంటున్నాడు. మనుష్యుల యొద్ద నుండి దేవుని భయమును తొలగించటానికి సైతాను ప్రయత్నిస్తున్నాడు. నీ విశ్వాసపు ప్రారంభం ప్రార్థించే వారు దేవుని హస్తమును చూస్తారు. వారు జయమును చూస్తారు. సజీవుడైన దేవుడు ఉన్నాడు.

మొత్తం యూదా - భార్యలతోనూ, పిల్లలతోనూ యౌవనస్థులతోను, దేవుని యెదుట నిలువబడ్డారు. దేవుని సన్నిధిలోనికి మనుష్యులను రమ్మని పిలుచుట సులువైన విషయం కాదు. ఏ ప్రయాణ సౌకర్యము లేని ఆ కాలములో వారు అందరు దేవుని యెదుట సమకూడారు.

దైవజనునికి వ్యతిరేకముగా మాట్లాడే ప్రతి మనుష్యుడు ఎదురాడే శక్తులను ఎదుర్కొంటాడు. ప్రజలు సులువుగా దైవజనులను గూర్చి చెడు నమ్ముతారు. ఇతరులకు వ్యాపింపజేస్తారు. ఇది అపాయకరమైన విషయం. విగ్రహారాధన మన దేశంలో వృద్ధి అవుతున్నది. మనము దేవుని యెదుట కలుసుకొనవలసియున్నాము. ప్రజలందరూ తమ భార్యలతో, చిన్న పిల్లలతో దేవుని యెదుట నిలువబడ్డారు. శత్రు సైన్యములను జయించినారు. ఇది యూదాలో ఎంత గొప్ప సంభవము! మనము కూడా జయిస్తాము. మనము సంఘమును క్రిందకు పోనివ్వవద్దు.
మూల ప్రసంగాలు