లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని యెడల ధనికులమై యుండుట

కీ.శే. యన్‌. దానియేలు గారు
లూకా 12:21

ఈ వ్యక్తి దేవుని యెడల ధనవంతుడు కాడు. దేవుడు మనలను ఆయన యెడల ధనవంతులుగా ఉండవలెనని కోరుతున్నాడు. క్రీస్తు ఒక ధనవంతుని గురించి మాట్లాడుతున్నాడు. అతనికి భూములున్నవి. అనేక సంవత్సరముల కొరకు కొత్త ధాన్యపు కొట్లలో తన పంటను కూర్చుకున్నాడు. కాని దేవుని గూర్చిన తలంపు లేదు. అనేక సంవత్సరంబులకు సరిపోయే ఆహారం తనకున్నదని తన ఆత్మతో చెప్పుకున్నాడు. కనుక ''తినుము త్రాగుము సుఖించుము'' దేవుడు అతనిని బుద్ధిహీనుడు అని పిలిచాడు. అతడు బుద్ధిహీనుడే. మనలో అనేకమందిమి అతని వలే ఉన్నాము. దేవుడు దానిని ఎరిగి ఉన్నాడు. మనం అతని వలే ఉంటే మనం బాధపడాలి. ''ఈ రాత్రి నీ ఆత్మ తీసుకొనబడును. నీవు నా యెడల ధనవంతుడవు కావు. ఎందుకనగా నీవు నా యెడల ధనవంతుడివిగా లేవు. నా యొద్ద నుండి ఏమియూ సంపాదించుకొనలేవు'' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. కుమారుని దగ్గరనుండి తండ్రి ఏదో ఎదురుచూస్తాడు. కాని ఏమియూ పొందలేదు. తోటమాలితో సొంతవాడు చెప్పినట్లుగా ''మేడిచెట్టును కొట్టివేయుము''. దేవుడు ఈ మనుష్యునితో చెప్పాడు, నీ సమయం అయిపోయినది. నీవు ఇంకనూ జీవించగోరితే ప్రయోజనం లేదు. నా యెడల నీవు ధనికుడవు కావలెనని కోరలేదు. నీ పాత స్వభావము ఎదగనిచ్చినావు. కాని దైవస్వభావం ఎదగటానికి నీలో చోటు లేదు. ''నీ యెడల దేవుని ఏర్పాటులను గురించి నీకు ఒక్క తలంపు కూడా లేదు. నీవు విరగగొట్టబడతావు దేవుడు చెప్పుతున్నాడు. ''నీవు తిరిగి జన్మించినావు కాని నీవు నీ కళాశాల దినములన్నింటిలో నా కొరకు ఏమైననూ చేయవలెనని కోరలేదు. నీవు ఎన్నడూ ఈలాగు ఆలోచించలేదు. 'దేవుడు దీనిని నా కొరకు చేసినాడు. జీవితంలో దొరికే అవకాశములు అన్నీ ఆయన చేతి నుండే వస్తున్నాయి.''

భూ సంబంధమైన వాటిని మట్టుకే ధనికుడు అనుభవించాడు. దేవుడు నీకు ఒక భార్యను ఇస్తాడు. నీవు సంతోషంగా ఉంటావు. ఆమె మంచి భోజనం సిద్ధం చేస్తుంది. ఒక స్త్రీ నీ బాధ్యతలో ఉన్నది అని అనుకొనుచున్నావు. కాని దేవుని మహిమ పర్చటానికి ఆమెను సహాయకురాలిగా నీవు ఎంచవు. ఆమె దేవుని యొక్క వరము. కాని దాని గురించి నీవు ఆలోచించవు. ఒక భర్తలోక మనస్కుడైనట్లయితే దేవుని రాజ్యమును గూర్చి దృష్టిలేని వాడైతే దేవుని యెడల ధనవంతుడు కాకపోతే తన భార్య యొక్క స్వాతంత్య్రమును తలాంతులను ఆమె ఆత్మీయజీవితమును నాశనము చేసేవాడవు అవుతాడు. నీవు దేవుని యెడల ధనవంతుడవు కాదు. దేవుడు చెప్తాడు. ''ఓ మనుష్యుడా, నీ భార్యను నీ యొద్ద నుండి తీసుకుంటాను. నీవు ఏమి చేస్తావు. నేను నీకిచ్చిన ఈవిని నీవు ఎన్నడు విలువుగా ఎంచలేదు''. పరలోకపు ధనాగారంతో ఆమె నీ ఇంటి లోపలికి ప్రవేశించవచ్చు. ఈనాటి సమాజంలో ఒక స్త్రీ చాలా చౌకగా ఉండును. అది తప్పుగా విలువ కట్టడం. నీ మనోభావము సరిగా ఉంటే ఆమె పరలోకపు ధనాగారంతో నీ ఇంటి లోపలికి ప్రవేశించవచ్చు. ఆమె నీ ఇంటిని ధనవంతంగా చేయవచ్చు. ఆమె నీ గృహం జాగ్రత్తగా చూచుకొని నీ బిడ్డలను దేవుని భయము నందు పెంచవచ్చు. త్వరలోనే దేవుని సంతోషంతో నీవు ఒక సంతోషకరమైన గృహం పొందగలవు. ఆ గృహంలో సృష్టికర్తను గూర్చి స్తుతి పాటలు వినబడుతూ ఉంటాయి. చిన్నబిడ్డలు మోకరించి ప్రార్థించటం చూస్తారు. ఈ రీతిగా ఆయన నీ విశ్వాసంను పెంచుతారు. మొదట ఒకరు, తరువాత ఇద్దరు ప్రార్థించుచుంటారు. నీవు నీ బిడ్డలతో ప్రార్థించేటపుడు నీ విశ్వాసం పెరుగుతుంది. నీ బిడ్డల విశ్వాసం పవిత్రముగాను, శక్తి వంతముగాను ఉంటుంది. నీవు దేవుని యెడల ధనవంతుడవుగా ఉన్నావా? బిడ్డలు వచ్చినపుడు వారు నీ ధనమును ఎలాగు పెంచగలరని చూస్తావు. ఇది దేవునికి బాధాకరమైనది.

దేవుని స్వరూపములో ఉన్న ఒక చిన్నబిడ్డ ఇక్కడ ఉన్నాడు. అతడు దేశమంతటికి ఒక దీవెనగా ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపు ఒక పేద కుర్రవాడు, కాని అతడు దేవుని సత్యమును నమ్మి ప్రేమ గల సజీవుడైన దేవునియందు విశ్వాసముంచాడు. అతనికి వృద్ధాప్యమందు మారు మనస్సు పొందిన తండ్రి ఉండినాడు. అతడు దేశమంతటిని రక్షించాడు. యోసేపు ఐగుప్తునకు వెళ్ళకపోయి ఉంటే తన సొంత కుటుంబమే నాశనమైపోయి ఉండేది. భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు దేవుని ఉన్నతమైన ఏర్పాట్లను నెరవేరుస్తారు. యౌవనస్థులారా మీలో ఎంతమంది దేవుని యెడల ధనవంతులై యున్నారు? మీరు కుటుంబంలోనికి వివాహం చేసుకున్నారు. మీరు తెచ్చిన ఆశీర్వాదం ఆ కుటుంబంమీదికి వచ్చును. కుటుంబంలోని వృద్ధులైన వారు చాలాకాలం జీవిస్తారు. దేవుని సమాధానం ఆ కుటుంబం మీదికిని ఇతరుల మీదికిని వస్తుంది. యోసేపు దేవునికి భయపడినాడు. కాని పేదవాడుగా ఉండినాడు. నీవు ఎలాగు ఉన్నావు? యెషయా 33:6 తల్లులారా! దేవుని భయము మీ పిల్లలలోనికి తెచ్చినారా? వారిని దేవుని యెడల ధనవంతునిగా చేసినారా? యోసేపు పైకి పేదవాడుగా ఉండినాడు కాని దేవుని యెడల ధనవంతుడును, ఇతరులను ధనవంతులుగా చేసినవాడునై ఉన్నాడు. సమాధానమును, సంపూర్ణతను నాశనము అవుతున్న ఒక దేశమునకు ఆయన తీసుకొని వచ్చాడు. దేవునికి భయపడిన ఒక్క మనుష్యుని నిమిత్తము, పరిశుద్ధునిగా జీవించిన ఒకని నిమిత్తము. పరలోకము ఏకీభవించినది. ఆయన దేశమంతటికి దీవెన తెచ్చుటకు కారకుడైనాడు.

లయోలా దేవుని విడిచి పెట్టినటువంటి ఒక యౌవనస్థుడుగా ఉండినాడు. ఈ లోక మహిమను వెదికినవాడు. అతడు ఒక సైనికుడిగా ఉండి ఖచ్చితమైన చిత్తమును కలిగినవాడు. కాని దేవుడు అతనిని మార్చాడు. పోరాడేటప్పుడు అతడు గాయపర్చబడ్డాడు. మంచంలో పడుకొన్నాడు. కొన్ని పుస్తకములు చదివి ఉత్తేజము పొందాడు. ఇంతవరకు అతని జీవితము వ్యర్థముగా వ్యయం చేయబడిందని ఎరుగును. ''నేను దేవుని స్వరూపంలో చేయబడ్డాను. నేను పవిత్రమైన జీవితం జీవించాలి. ఓ దేవా నాకు సహాయం చేయుము'' అని మొర్రపెట్టాడు. జీవితంలో ఒక నూతన పథం ఆరంభించాడు. ఒక దీవెనగా మారి దేవుని కొరకు శక్తివంతమైన పనివాడుగా మారాడు. అతడు పేద ప్రజల కొరకు పనిచేసాడు. ధనవంతమైన కుటుంబం నుంచి వచ్చాడు. అతడు తన్ను తాను క్రమశిక్షణలో పెట్టుకొన్నాడు. రోమన్‌ కేథలిక్‌ తండ్రులు అతనికి తొందర కలిగించినా అతనొక శక్తిగా మారాడు. నీవు దేవుని యెడల ధనవంతుడవై యున్నావా? ఫ్రాన్సీస్‌ జేవియర్‌ రక్షించబడ్డాడు. మిషనరీలలో ఒక గొప్పవాడు అయ్యాడు. దేవుని యెడల నీవు ధనవంతుడవు అయియున్నావా? ఇతరులను ధనవంతునిగా చేసేది ఏమైనా నీ దగ్గర ఉన్నదా? నీవు ఇతరుల్లో ఉన్న దైవ సంబంధమైన సహజ ప్రేమను బయటకు లాగగలవా? నీ చుట్టుపక్కల ఉన్నవారి మధ్య సేవ చేయగలవా? మానవసమాజంనకు ఎంత సహాయం చేయగలవు. నీ చుట్టూ అనేకమంది ఉన్నారు. వారిలో నీవు చూసేది ఏమిటి? దేవుని కృప వారి కొరకు ఎత్తిపెట్టబడినదని నీ వెరుగుదువా? దేవుడు వారి యందు తన కొరకు ఏమి ఉంచినాడో అవి చూడగలవా? ఒక జ్ఞానవంతుడు వెలుపటి ప్రదర్శనలను చూడడు గాని హృదయం వైపు చూస్తాడు. నీవు ఒక వ్యక్తిని చూచినప్పుడు ఇలాగ అనుకోవాలి. ''ఆయన నా యొద్ద నుండి ఏ సహాయం ఆశీర్వాదం సంతోషం సంపాదించగలడు?. ''అతడు ఏర్పాటు చేసుకున్న మార్గము తప్పుడు మార్గము. అతడు తన్ను తానే గాయపర్చుకొనును. దేవుని సృజనాత్మకమైన తలంపును అతనిలో పెట్టగలవా? అది అతని హృదయమంతటిని మార్చును. ప్రార్థనతో ఒక్క ప్రేమ గల తలంపు అతనిని మార్చగలదు. ప్రియుడా నీవు పాడైపోయిన నిధివలె ఉన్నావా? లేక దేవుని యెడల ధనవంతుడవై ఉన్నావా. నీ జీవితమును దేవుడు పరీక్షించుటకు ఒప్పుకొందువా. నీ ప్రారంభ జీవితమును నీ పురాతన జీవితమును నీలో ఎలాంటి తప్పుడు ఉద్దేశములు నాటబడి ఉన్నాయో వాటిని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాని నీయందు ఎలాగు పనిచేయవలెనో ఆయన ఎరుగును. ఆయన వాక్యము నీ యందు ఉన్న తప్పుడు ఉద్దేశ్యములను అన్నింటిని తొలగించవలెనని ఆశించుచున్నాడు. దేవుడు నీకు ఒక కొత్త ఉద్దేశమును దయచేయును. నీ యందు ఉన్న చెడు తలంపులు అన్నింటిని పాడు చేయగల ఒక ఖడ్గమును నీ చేతికి ఇచ్చును. పరిశుద్ధాత్మ నిన్ను ఆకృతిలో పెట్టుటకునూ నీలో ఉన్నటువంటి దుర్మార్గపు ఉద్దేశ్యములను నాశనం చేయుటకును దేవుని నూతన ఉద్దేశములను నీలో పెట్టుటకును నీవు పరిశుద్దాత్మకు స్థానం ఇచ్చుచున్నావా? ఈ రీతిగా నీవు నూతన పురుషుడవు అవుతావు. దినము వెంబడి దినము పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయటానికి అనుమతించకుండా ఉంటే నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు. దేవుని యెడల నీవు పేదవాడివి అవుతున్నావు. మార్టిన్‌ లూథర్‌ ప్రతి ఉదయ కాలమందు 3 గంటల సేపు గడిపేవాడు. ఎలాంటి గొప్ప కార్యములు అతడు చేసాడు! నీవు దేవుని ఎడల ధనవంతుడవు అయి ఉన్నావా? నీ తలాంతులు దేవుని ఆత్మచేత ధనవంతముగా చేయబడితే నీవు దైవ సంబంధమైన జీవితం జీవిస్తావు. నీ బిడ్డల కొరకు ఎలాంటి ధనం సంపాదించుచున్నావు? మత్తయి 6:19 దొంగలు దొంగిలించలేనటువంటి స్థలములో నీవు ధనము సంపాదించు. దేవుని ఆత్మచేత నడిపించబడి ఎలాంటి ప్రార్థనలు నీవు చేర్చి పెట్టుచున్నావు. పరలోకములో అవి భద్రపరచుచున్నావు. అవి నీ బిడ్డల కొరకు అక్కడున్నవి? నిజమైన దేవుని ప్రేమతో నీవు నీ బిడ్డల కొరకు చేసే ప్రార్థనలు ఎన్నటికి వ్యర్థముకావు.

నయమాను ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల తమ యజమాని బాధను గమనించి ప్రతి దినము ప్రార్థన చేసేది. ఆమె బంధింపబడినామె. ఆమెకు తల్లిదండ్రులు లేరు. కాని ఆమె దేవుని యెడల ధనవంతురాలిగా ఉండింది. ఆమె తన యజమానురాలితో అన్నది, ''మన కెప్టెన్‌గారు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళాలి. యెహోవాయును, ఆయన ప్రవక్తయును అక్కడ ఉన్నారు. మన యజమానుడు అక్కడకు వెళితే స్వస్థత పొందుతాడు'' ఎలీషా దేవుని యందు ధనికుడు. కనుక నయమాను ఇచ్చిన ఈవి ఆయన ముట్టలేదు.

దానియేలు 9:3-20. నీవు ఇతరుల పాపములు ఒప్పుకొన్నప్పుడు అది వారికి ఒక దీవెనగా ఉండును, విమర్శించవదు, వారి పాపములు నీ మీదకు తీసుకొని భారముతో వారికొరకు ప్రార్థన చేయి. ప్రేమ యందు కొద్ది మాటలు వారితో మాట్లాడితే అప్పుడు వారి యందు అవి ఫలించును. ఫిలిప్పీ 4:19 కొలస్స్సీ 2:3 ప్రియులారా మనం దేవుని యెడల ధనవంతులముగా ఉన్నామా? మిమ్మును మీరు పరీక్షించు కొనండి. మీరు ఎవరినైనా ధనవంతులుగా చేశారా?

మూల ప్రసంగాలు