లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీవు విశ్వాసంలో ఎదుగుచున్నావా?

కీ.శే. యన్‌. దానియేలు గారు
2 పేతురు 2:5-8

''మరియు ఆయన పూర్వకాలమునందున్న లోకమును విడిచి పెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును తప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును, మరి ఏడుగురిని కాపాడెను. మరియు ఆయన సొదొమగొమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తి హీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి, తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియ విషయంలో దినదినము నీతి గల తన మనస్సును, నొప్పించుకొనుచు వచ్చెను''.

నిజమైన అనుభవం గల పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన లోతు గురించి ఈయన మాట్లాడెను. లోతు ఒక నీతిమంతుడు - కాని దేవుడు కోరినటువంటి మనుష్యుడు కాదు. ఆయనలో విశ్వాసం లేదు. అబ్రహాము క్రింది తర్బీదు పొందెను కాని ఆయన విశ్వాసంలో ఎదుగలేదు. నేనొక పాస్టరు గారిని కలుసుకున్నాను. ఆయన తన విధిని క్రమంగా నెరవేర్చేవాడు. నేను దాని విషయమై ఆశ్చర్యపడి ఎక్కడ ఇది అంతా నేర్చుకున్నాడా అనుకున్నాను. ఓ గొప్ప బిషప్‌ గారి ద్వారా ఆయన తర్బీదు పొందాడు. కాని అయ్యో చాలా భయంకరంగా తప్పు చేసినట్లుగా నేను గమనించాను. ఆయన తన వ్యాధి యందు దేవుని తట్టు తిరిగాడు. అలాగు తిరగడం సాధారణంగా లోతైనదిగా ఉండదు. నిజమే!ౖ కష్టములు మనలను దేవుని వైపుకు తిప్పుతాయి. కాని కష్టములు దాటి పోయినప్పుడు ఒకడు పరిపూర్ణముగా శుద్ధీకరించబడాలి. అలాంటి తర్బీదును పరిశుద్ధాత్ముడు మట్టుకే ఇవ్వగలడు. లోతు నీతిమంతుడే కాని తన నీతిని, తన భార్యకు గాని, తన బిడ్డలకు గాని ఇవ్వలేకపోయాడు.

వర్షము లేని మేఘములను గూర్చి బైబిలు మాట్లాడుతున్నది. మనం అలాంటి వాటిని గూర్చి హెచ్చరించబడ్డాము. అంతరంగమందు జయం లేకుండా - అలాంటి జయములను గూర్చి మాట్లాడేవారు ఉన్నారు. నీవు మోసగాళ్ళతో మాట్లాడేటప్పుడు నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి. ఎందుకనగా ఆ ఆత్మ అంటు వ్యాధి లాంటిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఆత్మలో లేకపోతే వారి మాటలు నిన్ను క్రిందికి లాగివేస్తాయి. వారు ఉబ్బించే మాటలు చాలా మాట్లాడవచ్చు. కాని ప్రతి తలంపును క్రీస్తు వలన పరీక్షింపబడుటకు తెచ్చేవారు మట్టుకే దేవుని సేవకు ప్రయోజకులు అవుతారు. భక్తి వేషం వేసుకునే బంధువులు గొప్ప అపాయము. వారి తలంపులను గూర్చి జాగ్రత్త. దైవభక్తి యొక్క రహస్యము చాలా గొప్పది, జాగ్రత్తగా ఉండు.

తన సంఘంలో బోధించవలెనని ఆశగా ఉండిన ఒక యౌవనస్థుడు ఉండినాడు. అది అతనికి నాశనము కలిగించినది. ప్రాధాన్యతను వెదకవద్దు. మంచి క్రైస్తవ జీవితము లభించడం చాలా కష్టం. మన స్నేహితులను దేవుడు మన కొరకు ఏర్పాటు చేయాలి. దుష్ట సాంగత్యం వలన మనలోనికి వచ్చు దౌష్ట్యము నుండి మనం శుద్ధీకరించబడాలి. గొప్ప ఉద్దేశ్యము కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కాని సైతాను నిన్ను సరైన మార్గం నుండి ప్రక్కకు తిప్పవలెనని చూస్తున్నాడు. దైవజనులు దేవుడు వారికి చూపించిన మార్గము నుండి ప్రక్కకు తిరగలేదు. ప్రక్కకు తిరగడం కంటే తమ ప్రాణమును బలిగా అర్పించారు.

మూల ప్రసంగాలు